
📌 Key Points
- వరలక్ష్మి శరత్ కుమార్ దర్శకత్వంలో ‘సరస్వతి’ చిత్రం విడుదల కానుంది.
- నయనతార చేతుల మీదుగా మార్చి 1న ‘సరస్వతి’ సినిమా ఫస్ట్ సింగిల్ విడుదల కానుంది.
- ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, ప్రియమణి, రాధిక ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
- ‘సరస్వతి’ చిత్రం మార్చి 6న థియేటర్లలో విడుదల కానుంది.
వరలక్ష్మి శరత్ కుమార్ దర్శకత్వంలో ‘సరస్వతి’ అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఫస్ట్ సింగిల్ ను సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార విడుదల చేయనున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. సినిమా మార్చి 6న విడుదల కానుంది.
దర్శకురాలిగా వరలక్ష్మి శరత్ కుమార్
Varalakshmi Sarathkumar:ఒకప్పుడు హీరోయిన్ గా కెరియర్ ను మొదలుపెట్టిన వరలక్ష్మి శరత్ కుమార్ (Varalakshmi Sarathkumar) హీరోయిన్ గా సక్సెస్ కాకపోవడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన కెరియర్ ను మార్చుకుంది. ఆ తర్వాత తెలుగులో క్రాక్ సినిమాలో విలన్ గా మొదటిసారి నటించి తన అద్భుతమైన నటనతో ఊహించని పాపులారిటీ సొంతం చేసుకుంది. ముఖ్యంగా తెలుగు స్టార్ హీరోలకు లక్కీ లేడీగా మారిపోయిన ఈ ముద్దుగుమ్మ..తెలుగులో ఎన్నో చిత్రాలు చేస్తూ ప్రేక్షకులను అలరించింది. అలాంటి ఈమె తొలిసారి దర్శకురాలిగా మారి లీడ్రోల్ పోషిస్తూ సరస్వతి (saraswathi) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ప్రకాష్ రాజ్, ప్రియమణి, రాధిక, నాజర్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాలో వరలక్ష్మి కీలకపాత్ర పోషిస్తుంది. ఇటీవల ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేయగా.. ఆ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో వరలక్ష్మి ఎమోషనల్ అయింది. తనకు పునర్జన్మ నిచ్చిన డైరెక్టర్ గోపీచంద్ మలినేని కి ధన్యవాదాలు తెలిపింది . ఇకపోతే తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా ఇంస్టాగ్రామ్ వేదికగా ఒక పోస్ట్ పంచుకుంది వరలక్ష్మి శరత్ కుమార్.
నయనతార చేతుల మీదుగా ఫస్ట్ సింగిల్ విడుదల
సరస్వతి సినిమా నుండి ఫస్ట్ సింగిల్ ని మార్చి ఒకటి ఉదయం 10:04 గంటలకు సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanthara) చేతుల మీదుగా లాంచ్ చేయబోతున్నట్లు అధికారికంగా స్పష్టం చేసింది. ఇకపోతే ఈ సినిమా మార్చి 6వ తేదీన థియేటర్లలోకి రాబోతున్న విషయం తెలిసిందే. ఇకపోతే ఈ చిత్రాన్ని దోస డైరీ బ్యానర్ పై తన సోదరీ పూజా శరత్ కుమార్ తో పాటు వరలక్ష్మీ శరత్ కుమార్ నిర్మిస్తోంది. భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమా ఫస్ట్ సింగిల్ ను నయనతార చేతుల మీదుగా లాంచ్ చేయబోతున్నారని అధికారికంగా ప్రకటించడంతో ఇప్పుడు అంచనాలు రెట్టింపు అయ్యాయని చెప్పాలి..ఈ చిత్రానికి ఎస్.తమన్ సంగీతాన్ని అందించారు.
మార్చి 6న ‘సరస్వతి’ సినిమా విడుదల
సరస్వతి సినిమా ట్రైలర్ విషయానికి వస్తే.. హై కాన్సెప్ట్ థ్రిల్లర్ గా రూపొందుతున్న సరస్వతీ సినిమా నుండి ట్రైలర్ రిలీజ్ చేశారు.. తన కూతురు కోసం క్రూరమైన ప్రపంచానికి వ్యతిరేకంగా సరస్వతి ఎదురు నిలిచే సాహసం ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కినట్లు ట్రైలర్ ద్వారా స్పష్టం చేశారు. ఇకపోతే తొలిసారి వరలక్ష్మి దర్శకురాలిగా, నిర్మాతగా తన తొలి ప్రయాణాన్ని మొదలుపెట్టింది. మరి ఈ ప్రయాణం ఆమెకు మరింత విజయాన్ని అందించాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. విలక్షణమైన నటిగా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న వరలక్ష్మి శరత్ కుమార్ ఇప్పుడు దర్శకురాలిగా తన టాలెంట్ను ఏ మేరకు నిరూపించుకుంటుందో చూడాలి.
Tags Nayanathara Varalakshmi Sarathkumar Share
మొత్తానికి వరలక్ష్మి శరత్ కుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి. నయనతార చేతుల మీదుగా ఫస్ట్ సింగిల్ విడుదల కానుండటంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.


