|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Varalaxmi Sarathkumar : వరలక్ష్మి శరత్ కుమార్ కొత్త సినిమా.. పోలీస్ పాత్రలో మరోసారి..

Published: 30-05-2025, 1:18 PM
Varalaxmi Sarathkumar : వరలక్ష్మి శరత్ కుమార్ కొత్త సినిమా.. పోలీస్ పాత్రలో మరోసారి..

విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పేరు తెచ్చుకున్న వరలక్ష్మి శరత్ కుమార్ తాజాగా ‘పోలీస్ కంప్లెయింట్’ అనే కొత్త సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో ఆమె పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. సూపర్ స్టార్ కృష్ణ గారి జన్మదినం సందర్భంగా ఫస్ట్ లుక్ విడుదలైంది.

Key Points

1

వరలక్ష్మి శరత్ కుమార్ 'పోలీస్ కంప్లెయింట్' సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నారు.

2

సుపర్ స్టార్ కృష్ణ గారి జన్మదినం సందర్భంగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేయబడింది.

4

ఎమ్మెస్కె ప్రమిదశ్రీ ఫిలిమ్స్, శ్రీ విష్ణు గ్లోబల్ మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

పోలీస్ కంప్లెయింట్ సినిమా అనౌన్స్ మెంట్

Varalaxmi Sarathkumar : వరలక్ష్మి శరత్ కుమార్ విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలతో బిజీగా ఉంది. సౌత్ లో అన్ని భాషల్లో సినిమాలు చేస్తుంది. తాజాగా తెలుగులో మరో కొత్త సినిమా అనౌన్స్ చేసింది. ‘పోలీస్ కంప్లెయింట్’ అనే టైటిల్ తో ఈ సినిమా రానుంది. నేడు ఈ సినిమా నుంచి వరలక్ష్మి శరత్ కుమార్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసారు. సూపర్ స్టార్ కృష్ణ జన్మదినం సందర్భంగా మూవీ యూనిట్ నేడు ఈ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు.

ఫస్ట్ లుక్ రిలీజ్

అలాగే.. ఈ సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ మీద స్పెషల్ సాంగ్ షూట్ చేసామని, అది సినిమాకే మెయిన్ హైలెట్ అని నిర్మాతలు తెలిపారు.

కృష్ణ గారిపై స్పెషల్ సాంగ్

ఈ సినిమాని ఎమ్మెస్కె ప్రమిదశ్రీ ఫిలిమ్స్, శ్రీ విష్ణు గ్లోబల్ మీడియా సంస్థల బ్యానర్లలో సింగపూర్ బాలకృష్ణ, మల్లెల ప్రభాకర్ సంయుక్త నిర్మాణంలో సంజీవ్ మేగోటి డైరెక్టర్ గా తెరకెక్కిస్తున్నాడు. నవీన్ చంద్ర, కృష్ణ సాయి, రాగిణి ద్వివేది, రవిశంకర్, ఆదిత్య ఓం, అమిత్, దిల్ రమేష్, రాజశ్రీ నాయర్.. పలువురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

వరలక్ష్మి శరత్ కుమార్ కొత్త సినిమా ‘పోలీస్ కంప్లెయింట్’ పై అంచనాలు పెరుగుతున్నాయి. సూపర్ స్టార్ కృష్ణ గారిపై ఉన్న స్పెషల్ సాంగ్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా ఉంటుందని భావిస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.