|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: ‘వారణాసి’ రెండు పార్టులుగా రానుందా? జక్కన్న సంచలన ప్లాన్! గ్లోబల్ రికార్డ్స్ ఖాయం!

Published: 30-01-2026, 10:35 AM
షాకింగ్: 'వారణాసి' రెండు పార్టులుగా రానుందా? జక్కన్న సంచలన ప్లాన్! గ్లోబల్ రికార్డ్స్ ఖాయం!
  • మహేష్ బాబు ‘వారణాసి’ మూవీ రెండు పార్టులుగా విడుదల కానుందా?
  • టైటిల్ పోస్టర్ లో జక్కన్న హింట్: గ్లోబ్ ట్రాటర్, టైం ట్రాటర్!
  • రూ.1300 కోట్ల భారీ బడ్జెట్ తో హాలీవుడ్ రేంజ్ లో చిత్రం నిర్మాణం!
  • ఏప్రిల్ 7న ‘వారణాసి’ విడుదల: సమ్మర్ ట్రీట్ పక్కా!

టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న ‘వారణాసి’ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఈ సినిమా రెండు పార్టులుగా విడుదల కానుందనే వార్త ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

వారణాసి: జక్కన్న మార్క్ ప్లానింగ్!

Varanasi: టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ చిత్రం వారణాసి(Varanasi). సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వస్తున్న ఈ సినిమాలో హాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుండగా మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా చేస్తున్నాడు. యాక్షన్ అడ్వెంచర్ బ్యాక్డ్రాప్ లో హాలీవుడ్ రేంజ్ లో ఈ సినిమాను దాదాపు రూ.1300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నాడు జక్కన్న. అందుకే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇక రీసెంట్ గా ఈ సినిమా నుంచి టైటిల్ వీడియోను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆ వీడియోకి ప్రపంచవ్యాప్తంగా భారీ రెస్పాన్స్ వచ్చింది. సినిమాను 2027లో విడుదల చేస్తున్నట్టు అదే సమయంలో ప్రకటించారు. తాజాగా వారణాసి సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను వదిలాడు జక్కన్న. సమ్మర్ కానుకగా ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు మేకర్స్.

మహేష్ బాబు విశ్వరూపం: రెండు పార్టుల్లో?

అయితే, రిలీజ్ డేట్ పోస్టర్ విడుదల అయ్యాక ఆడియన్స్ లో ఒక కొత్త సందేహం మొదలయ్యింది. అదేంటంటే, రాజమౌళి వారణాసి సినిమాను రెండు పార్టులుగా తీస్తున్నాడా అని. కారణం ఏంటంటే, టైటిల్ రిలీజ్ ఈవెంట్ లో రిలీజ్ చేసిన పోస్టర్ లో వారణాసి సినిమాను గ్లొబ్ ట్రాటర్ అండ్ టైం ట్రాటర్ అనే రెండు యాష్ ట్యాగ్స్ ని యాడ్ చేశాడు. కానీ, తాజాగా విడుదలైన పోస్టర్ లో మాత్రం కేవలం గ్లొబ్ ట్రాటర్ అని మాత్రమే కనిపించింది. దీంతో, వారణాసి పార్ట్ 1లో ప్రపంచాన్ని చుట్టేసి వీరుడిగా కనిపించే మహేష్ బాబు వారణాసి పార్టీ 2లో కాలాల్ని చుట్టేసే ధీరుడిగా కనిపిస్తాడని టాక్ నడుస్తోంది.

గ్లోబల్ రికార్డ్స్ వేట షురూ!

ఇదే గనక నిజమైతే వారణాసి సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీలో సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేయడం ఖాయం. అయితే, పోస్టర్ లో కావాలని ప్రేక్షకులకు పజిల్ గా ఉండేలా సెకండ్ పార్ట్ కి హింట్ ఇస్తూ జక్కన్న ఇలా ప్లాన్ చేశాడు అంటూ నెట్టింట టాక్ నడుస్తోంది. ఏది ఏమైనా వారణాసి సినిమా రెండు పార్టులుగా రావడం అనేది విశేషంగా చెప్పుకోవచ్చు. మరి ఇది ఎంత వరకు నిజం అనేది అధికారిక ప్రకటన వచ్చాకే తెలుస్తుంది.

ఏది ఏమైనా ‘వారణాసి’ చిత్రం రెండు పార్టులుగా వస్తే మాత్రం రికార్డులు బద్దలు కావడం ఖాయం. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.