|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

వారణాసిలో మాంసాహార దుకాణాలకు షాక్! మున్సిపల్ సంచలన నిర్ణయం, ఇకపై నాన్ వెజ్ రహిత నగరం?

Published: 07-06-2026, 4:45 PM
వారణాసిలో మాంసాహార దుకాణాలకు షాక్! మున్సిపల్ సంచలన నిర్ణయం, ఇకపై నాన్ వెజ్ రహిత నగరం?
  • వారణాసిలో మాంసం, చేపల దుకాణాలను శివారు ప్రాంతాలకు తరలించాలని మున్సిపల్ కార్పొరేషన్ నిర్ణయం.
  • నగర పరిశుభ్రత పెంపు, వ్యర్థాల సమస్య పరిష్కారమే ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశ్యం.
  • మేయర్ అశోక్ కుమార్ తివారీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ తీర్మానం చేశారు.
  • ఆరు నెలల్లోగా దుకాణాలను తరలించాలని ఆదేశాలు; వ్యాపారుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వారణాసిని నాన్ వెజ్ రహిత ప్రాంతంగా మార్చేందుకు మున్సిపల్ కార్పొరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. నగర పరిశుభ్రతను మెరుగుపరచడం, వ్యర్థాల సమస్యను పరిష్కరించడం లక్ష్యంగా మాంసం, చేపల దుకాణాలను శివారు ప్రాంతాలకు తరలించాలని ఆదేశించింది. ఈ నిర్ణయంపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది.

వారణాసిలో మాంసాహార దుకాణాలపై కీలక నిర్ణయం

వారణాసి పట్టణంలో పరిశుభ్రతను మెరుగుపర్చేందుకు మున్సిపల్ కార్పొరేష‌న్ పాల‌క‌మండలి కీలక నిర్ణయం తీసుకున్నారు. నగర పరిధిలోని మాసం, చేపల దుకాణాలను శివారులోని నిర్దేశిత ప్రదేశాలకు తరలించేలా వ్యాపారులకు ఆదేశాలు జారీ చేశారు. శనివారం మేయర్ అశోక్ కుమార్ తివారీ అధ్యతన జరిగిన సమావేశంలో మున్సిపల్ కార్పొరేషన్ పాలకమండలి ఈ నిర్ణయం తీసుకుంది. సమావేశంలో పట్టణాభివృద్ధి, ఆక్ర‌మ‌ణ‌ల తొల‌గింపుతో పాటు ప‌రిశుభ్ర‌త‌పై చ‌ర్చించారు. ఈ నేప‌థ్యంలోనే న‌గ‌రంలోని మాంసం, చేప‌ల మార్కెట్ల‌ను సైతం త‌ర‌లించాల‌ని నిర్న‌యించారు.

అంతే కాకుండా ఆరు నెల‌ల్లో ప‌ట్ట‌ణం నుండి దుకాణాల‌ను త‌ర‌లించాల‌ని ఇప్ప‌టికే ఆదేశాలు జారీ చేశారు. ప్ర‌స్తుతం న‌గ‌ర ప‌రిధిలో సుమారు 350 నుండి 400 వ‌ర‌కు మాసం, చేప‌ల దుకాణాలు ఉన్న‌ట్టు అధికారులు అంచ‌నా వేశారు. దుకాణాల నుండి వ‌చ్చే వ్య‌ర్థాల వ‌ల్ల ఇబ్బందులు త‌లెత్తున్నాయ‌ని చెప్పారు. మ‌రోవైపు పవిత్ర శ్రావ‌ణ‌మాసంలో దుకాణాలు మూసివేయ‌డం వ‌ల్ల వ్యాపారం కూడా దెబ్బ తింటుంద‌ని వ్యాపారులు చెప్పారు. దీంతో మున్సిప‌ల్ కార్పొరేష‌న్ పాల‌క‌మండలి నిర్ణ‌యం పై హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు.

పరిశుభ్రత, వ్యర్థాల సమస్యకు పరిష్కారం

వ్యాపారుల ఆందోళన, ప్రజల హర్షం

వారణాసి మున్సిపల్ కార్పొరేషన్ తీసుకున్న ఈ నిర్ణయం నగర పారిశుద్ధ్యాన్ని మెరుగుపరుస్తుందని ఆశిస్తున్నారు. అయితే, వ్యాపారుల జీవనోపాధిపై దీని ప్రభావం ఎలా ఉంటుందో వేచి చూడాలి. ఇది ఇతర నగరాలకు ఆదర్శంగా నిలుస్తుందా అనేది చర్చనీయాంశం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.