|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Varanasi : రామాయణం, ట్రెజర్ హంట్, టెక్నాలజీ, శివుడు, అంటార్కిటికా.. అన్ని మిక్స్ చేసి వారణాసి.. ఏం ప్లాన్ చేసావు రాజమౌళి..

Published: 15-11-2025, 9:46 PM
Varanasi : రామాయణం, ట్రెజర్ హంట్, టెక్నాలజీ, శివుడు, అంటార్కిటికా.. అన్ని మిక్స్ చేసి వారణాసి.. ఏం ప్లాన్ చేసావు రాజమౌళి..

రాజమౌళి-మహేష్ బాబుల క్రేజీ ప్రాజెక్ట్ ‘వారణాసి’ గ్లింప్స్ రిలీజ్ అవ్వడంతో అంచనాలు ఆకాశాన్ని అంటాయి. రామాయణం నుండి అంటార్కిటికా వరకు, ట్రెజర్ హంట్ నుండి శివుడి వరకు ఎన్నో ఆసక్తికర అంశాలతో ఈ చిత్రం హాలీవుడ్ స్థాయిలో ఉండబోతుందని తెలుస్తుంది.

Key Points

1

రాజమౌళి-మహేష్ బాబు సినిమా టైటిల్ 'వారణాసి'గా ప్రకటించబడింది.

2

గ్లింప్స్ లో రామాయణం, ట్రెజర్ హంట్, టెక్నాలజీ, శివుడు, అంటార్కిటికా వంటి అనేక అంశాలు ప్రస్తావించబడ్డాయి.

4

హాలీవుడ్ స్థాయి విజువల్స్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం 2027 మార్చ్ లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

వారణాసి గ్లింప్స్: పెరిగిన అంచనాలు

Varanasi : రాజమౌళి – మహేష్ బాబు సినిమా మీద అంచనాలు ఉండటం సహజం. కానీ నిన్న రిలీజ్ చేసిన గ్లింప్స్ తో ఈ అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఈ గ్లింప్స్ లో ఎన్నో లింకులు ఇస్తూ, కథని ఏటో ఏటో తీసుకెళ్తు, బోలెడన్ని లేయర్లు ఉన్నట్టు చూపించడంతో ఒక్కసారిగా సినిమాపై హైప్ వెయ్యి రేట్లు పెరిగింది.(Varanasi)

రాజమౌళి మహేష్ సినిమాకు వారణాసి అని టైటిల్ ప్రకటించారు. వారణాసి గ్లింప్స్ లో 512 వ సంవత్సరంలో వారణాసిని చూపించారు. 2027 లో భూమి మీదకు ఆస్టరాయిడ్ శాంభవి వస్తున్నట్టు చూపించారు. అంటార్కిటికా లోని ప్రపంచములోని అతి పెద్ద ఐస్ పర్వతం అయిన రాస్ షెల్ఫ్ ని చూపించారు. ఆఫ్రికాలోని అంబాసిలి అడవులను, అక్కడి జంతువులను చూపించారు. వానంతల్ ఉగ్రభతి గుహలు చూపించారు. త్రేతాయుగం లంకలో రామ రావణ యుద్ధం చూపించారు. వారణాసి మణికర్ణికా ఘాట్ చూపించారు. చివర్లో మహేష్ బాబు త్రిశూలం పట్టుకొని వారణాసిలో ఎద్దు మీద ఉగ్రంగా రుద్రుడిగా వస్తున్నట్టు చూపించారు.

కథా నేపథ్యం: రామాయణం నుండి ట్రెజర్ హంట్ వరకు

దీంతో సినిమాలో చాలా లేయర్లు ఉన్నాయని తెలుస్తుంది. రామాయణం నుంచి ప్రస్తుత కాలానికి కథ కలిపారని ఆ కథ అంతా వారణాసి చుట్టే తిరుగుతుందని తెలుస్తుంది. అలాగే ఇది ఇండియానా జోన్స్, ట్రెజర్ హంట్ లాగా ఉంటుందని గతంలో రాజమౌళి చెప్పారు. భూమండలం అంతా ఒకే చోట నుంచి విడిపోయిన సంగతి తెలిసిందే. అలా ఇండియా కూడా అంటార్కిటికా నుంచి విడిపోయింది. అంటార్కిటికా అని కూడా ఈ గ్లింప్స్ లో చూపించడం గమనార్హం. గ్లింప్స్ లో చిన్న చిన్న షాట్స్ తోనే అదరగొట్టారంటే ఇక సినిమాలో ఈ సీన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో ఊహించొచ్చు. రాజమౌళి ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు. హాలీవుడ్ లెవల్లో భారీగా ప్లాన్ చేస్తున్నాడు అని తెలుస్తుంది.

రాజమౌళి విజన్: హాలీవుడ్ స్థాయి మేకింగ్

మొత్తంగా రాజమౌళి హాలీవుడ్ లెవల్లో మన ఇండియన్ మూలాలు చూపిస్తూ భారీగా వారణాసి సినిమాని తెరకెక్కిస్తున్నాడని తెలుస్తుంది. ఫ్యాన్స్ తో పాటు సినిమా లవర్స్, ప్రేక్షకులు అంతా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాని 2027 మార్చ్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

మొత్తంగా, రాజమౌళి తన హాలీవుడ్ స్థాయి విజన్ తో ఇండియన్ మూలాలను స్పృశిస్తూ ‘వారణాసి’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఫ్యాన్స్, ప్రేక్షకులు ఈ 2027 మార్చ్ విడుదల కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.