|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Varanasi: రాజమౌళి, మహేష్ బాబు సినిమా టైటిల్ ఇదే.. రిలీజ్ ఎప్పుడంటే..

Published: 15-11-2025, 11:41 AM
Varanasi: రాజమౌళి, మహేష్ బాబు సినిమా టైటిల్ ఇదే.. రిలీజ్ ఎప్పుడంటే..

రాజమౌళి-మహేష్ బాబు సినిమాపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మూవీ టైటిల్ ‘వారణాసి’ అని ప్రకటించారు. మహేష్ బాబు ‘రుద్ర’గా కనిపించనుండగా, ఫస్ట్ లుక్, గ్లింప్స్ విడుదలయ్యాయి. 2027 వేసవిలో సినిమా విడుదల కానుంది.

Key Points

1

రాజమౌళి-మహేష్ బాబు సినిమా టైటిల్ 'వారణాసి'గా ఖరారైంది.

2

మహేష్ బాబు క్యారెక్టర్ 'రుద్ర'గా పరిచయం చేస్తూ పోస్టర్ విడుదలయ్యింది.

4

ఈ భారీ యాక్షన్ అడ్వెంచర్ 2027 వేసవిలో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

రాజమౌళి-మహేష్ బాబు సినిమా టైటిల్ ఖరారు

Varanasi: ఉత్కంఠకు తెర పడింది. టైటిల్ ఏంటో రివీల్ అయ్యింది. రాజమౌళి-మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా టైటిల్ ఖరారైంది. ఈ మూవీకి వారణాసి అనే టైటిల్ పెట్టారు. అలాగే మహేష్ బాబు క్యారెక్టర్ ను రివీల్ చేశారు రాజమౌళి. రుద్రగా పరిచయం చేశారు. దీనికి సంబంధించి పోస్టర్ ను సోషల్ మీడియాలో షేర్ చేశారాయన. ఇక గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ లో స్పెషల్ వీడియోని రిలీజ్ చేశారు. ఇందులో మహేష్ బాబు నంది మీద కూర్చున్న లుక్ అదిరిపోయింది.

ఈ మూవీలో మహేష్ ఫస్ట్ లుక్‌తో పాటే గ్లింప్స్‌ను సైతం రిలీజ్ చేశారు. హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో గ్లోబ్ ట్రాటర్ పేరుతో గ్రాండ్ గా ఈవెంట్ నిర్వహించారు. ఇదే ఈవెంట్‌లో రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది చిత్ర బృందం. ఈ భారీ యాక్షన్ అడ్వెంచర్‌ను 2027 వేసవి కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.

మహేష్ బాబు ‘రుద్ర’ లుక్ అదరహో!

గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్: విడుదల తేదీ ప్రకటన

“వారణాసి” టైటిల్, మహేష్ బాబు లుక్‌తో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న ఈ యాక్షన్ అడ్వెంచర్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 2027 వేసవిలో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సందడి చేయనుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.