
గ్లోబ్‌ట్రాటర్ ఈవెంట్లో రాజమౌళి-మహేష్ బాబుల సినిమా టైటిల్‌ను ‘వారణాసి’గా అఫీషియల్‌గా ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదలైన వీడియో అభిమానులను ఆకట్టుకుంది. పవర్‌ఫుల్ క్యారెక్టర్‌లో మహేష్ బాబు కనిపించారు. సినిమా రిలీజ్ వివరాలపై ఆసక్తి నెలకొంది.
Key Points
రాజమౌళి-మహేష్ బాబు సినిమాకు 'వారణాసి' అనే టైటిల్ అఫీషియల్‌గా ఖరారు చేశారు.
గ్లోబ్‌ట్రాటర్ ఈవెంట్లో మూవీ టైటిల్‌తో పాటు స్పెషల్ వీడియోను లాంఛ్ చేశారు.
విడుదలైన వీడియో విజువల్ ట్రీట్ గా ఉందని, మహేష్ బాబు పవర్‌ఫుల్ పాత్రలో కనిపించారని తెలిపారు.
ట్రైలర్ లీక్‌లపై రాజమౌళి ఆవేదన వ్యక్తం చేయడంతో పాటు టెక్నికల్ పవర్ సమస్యలను ప్రస్తావించారు.
రాజమౌళి సర్ ప్రైజ్, వారణాసి టైటిల్ విడుదల
గ్లోబ్‌ట్రాటర్ ఈవెంట్లో ఫ్యాన్స్ కు రాజమౌళి అదిరే సర్ ప్రైజ్ ఇచ్చారు. మూవీ టైటిల్ అనౌన్స్ చేయడంతో పాటు స్పెషల్ వీడియో లాంఛ్ చేశారు. ఇందులో విజువల్స్ అదిరిపోయాయి.
అఫీషియల్.. మహేష్ బాబు- రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న సినిమా పేరు ‘వారణాసి’. ఈవెంట్ స్టార్ట్ కావడానికి ముందే అక్కడి స్క్రీన్ లపై ఈ పేరు వచ్చింది. ఇప్పుడు అఫీషియల్ గా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇవాళ (నవంబర్ 15) జరుగుతున్న గ్లోబ్‌ట్రాటర్ ఈవెంట్లో ఫ్యాన్స్ కు రాజమౌళి అదిరే సర్ ప్రైజ్ ఇచ్చారు. ట్రైలర్ విజువల్ ట్రీట్ గా ఉంది.
మహేష్ బాబు పవర్‌ఫుల్ లుక్, వీడియో హైలైట్స్
‘‘మేం కొత్త టెక్నాలజీ ఫిల్మ్ డ్ ఫర్ ఐమ్యాక్స్ ఇంట్రడూస్ చేస్తున్నాం. ఈ మూవీని ఫుల్ స్క్రీన్ పై చూడొచ్చు. ట్రైలర్ ప్లే చేద్దామనుకున్నాం. 100 అడుగుల స్క్రీన్ పెట్టాం. చాలా పవర్ కావాలి. నిన్న రాత్రి టెస్ట్ వీడియోలు చూడాలనుకున్నాం. కానీ కొంతమంది వచ్చి డ్రోన్ వీడియోలు తీసి నెట్ లో పెట్టారు’’ అని రాజమౌళి తెలిపారు.
లీక్‌లపై రాజమౌళి స్పందన, టెక్నికల్ సమస్యలు
‘‘చాలా మంది కష్టం, డబ్బు ఇందులో ఉంది. మా వీడియోను టెస్ట్ చేసుకోవడానికి ఛాన్స్ కూడా ఇవ్వలేదు. లీక్ అవ్వకూడదని అనుకున్నాం. డైరెక్ట్ గా ప్లే చేద్దామనుకున్నాం. కానీ వర్కౌట్ అవట్లేదు. పవర్ సరిపోవట్లేదు. మరో 10 నిమిషాలు ఓపిక పట్టండి’’ అని చెప్పారు. ఆ తర్వాత ప్లే చేశారు.
మొత్తానికి ‘వారణాసి’ టైటిల్, అదిరిపోయిన వీడియోతో అభిమానుల్లో అంచనాలు రెట్టింపయ్యాయి. రాజమౌళి విజన్‌తో మహేష్ బాబు ఎలాంటి పాత్రలో కనిపించబోతున్నారో చూడటానికి అందరూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు.


