|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

వర్మ అంటే వోడ్కా.. నిజమే రాంగ్ ట్రాక్ లోకి వెళ్ళా, నెక్స్ట్ మూవీతో నేనేంటో చూపిస్తా

Published: 10-11-2025, 3:42 PM
వర్మ అంటే వోడ్కా.. నిజమే రాంగ్ ట్రాక్ లోకి వెళ్ళా, నెక్స్ట్ మూవీతో నేనేంటో చూపిస్తా

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ‘శివ’ రీ-రిలీజ్ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను రాంగ్ ట్రాక్‌లోకి వెళ్ళానని అంగీకరిస్తూ, తన తదుపరి చిత్రంతో తన సత్తా చాటుతానని ప్రకటించారు. ఈ ప్రకటన టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.

Key Points

1

రాంగోపాల్ వర్మ సృష్టించిన శివ మూవీ నవంబర్ 14న గ్రాండ్ రీ-రిలీజ్‌కి సిద్ధమవుతోంది.

2

రీ-రిలీజ్ ప్రెస్ మీట్‌లో వర్మ, నాగార్జున పాల్గొన్నారు; పలువురు సినీ ప్రముఖులు మద్దతు తెలిపారు.

4

తన నెక్స్ట్ సినిమాతో నేనేంటో చూపిస్తానని, తన ట్యాలెంట్ నిరూపిస్తానని వర్మ ధీమా వ్యక్తం చేశారు.

శివ రీ-రిలీజ్: ఒక సంచలనం

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ సృష్టించిన అద్భుతం శివ మూవీ నవంబర్ 14న గ్రాండ్ రీ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఒక రేంజ్ లో నాగార్జున, వర్మ రీ రిలీజ్ కి ప్రమోషన్స్ చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, మహేష్ బాబు లాంటి వాళ్లంతా శివ రీ రిలీజ్ కి మద్దతు తెలిపారు. నాగార్జున సతీమణి అమల బిగ్ బాస్ వేదికపైకి వచ్చి శివ మూవీ కోసం ప్రమోషన్స్ చేయడం జరిగింది.

శివ మూవీలో నాగార్జున, అమల జంటగా నటించగా.. రఘువరన్ విలన్ పాత్రలో నటించారు. జేడీ చక్రవర్తి, తనికెళ్ళ భరణి కీలక పాత్రల్లో నటించారు. శివ మూవీ 1989లో విడుదలై సంచలన విజయం సాధించింది. ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ మూవీని వర్మ తెరకెక్కించిన విధానం ఇండియన్ సినిమా ఫిలిం మేకర్స్ కి ఒక పాఠం అనే చెప్పాలి. వర్మ తెరకెక్కించిన విధానం ఆయన మేధస్సుకి నిదర్శనంలా నిలిచాయి.

రాంగ్ ట్రాక్‌లో వర్మ: నిజమేనా?

నాగార్జున సైకిల్ చైన్ తో సరికొత్త ట్రెండ్ సృష్టించారు. ఈ రీరిలీజ్ ప్రెస్ మీట్ లో వర్మ, నాగార్జున పాల్గొన్నారు. శివ లాంటి తెలుగు సినిమా గేమ్ ఛేంజింగ్ మూవీ తెరకెక్కించిన వర్మ ఆ తర్వాత ఆ స్థాయిలో మెప్పించిన సందర్భాలు చాలా తక్కువ. ఇటీవల అయితే అనే పూర్తిగా రాంగ్ ట్రాక్ లోకి వెళ్లిపోయారు. వివాదాలతో సహవాసం చేస్తున్నారు.

తదుపరి చిత్రంతో వర్మ ప్లాన్

ఇదే విషయం గురించి ఏసియా నెట్ న్యూస్ ప్రతినిధి ప్రశ్నించినప్పుడు వర్మ ఆసక్తికరంగా సమాధానం ఇచ్చారు. శివ మూవీ చూస్తే వర్మలో ఎంత ట్యాలెంట్ ఉంది అనే విషయం తెలుస్తుంది.. కానీ ఇప్పుడు మీ ట్యాలెంట్ రాంగ్ ట్రాక్ లోకి వెళుతోంది అని అనిపిస్తోంది, వర్మ అంటే వోడ్కా అంటూ సెటైర్లు వేసుకునే పరిస్థితి వచ్చింది.. మీరు రియలైజ్ అయ్యారా అని ప్రశ్నించారు. అది నిజమే.. పూర్తిగా రాంగ్ ట్రాక్ లోకి వెళ్ళిపోయా. కానీ నా నెక్స్ట్ సినిమాలో నేనెంటో చూపిస్తా అంటూ వర్మ స్పందించారు. మరి వర్మ తాను చెప్పినట్లు తదుపరి చిత్రంతో ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో వేచి చూడాలి.

మొత్తానికి, వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన వర్మ, తన తప్పును అంగీకరించి, కొత్త సినిమాతో తన ట్యాలెంట్‌ను తిరిగి నిరూపించుకుంటానని చెప్పడం ఆసక్తికరంగా మారింది. ఆయన తదుపరి చిత్రం కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.