|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

VarshaBollamma: ‘విక్రమార్కుడు మూవీ 50 సార్లు చూశాను’.. నేను సలార్ 60 సార్లు చూశాను అరుస్తున్నానా? అంటూ నెటిజన్ కామెంట్

Published: 08-07-2025, 12:49 AM
VarshaBollamma: ‘విక్రమార్కుడు మూవీ 50 సార్లు చూశాను’.. నేను సలార్ 60 సార్లు చూశాను అరుస్తున్నానా? అంటూ నెటిజన్ కామెంట్

తెలుగు సినిమా నటి వర్ష బొల్లమ్మ ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ‘విక్రమార్కుడు’ సినిమాను 50 సార్లు చూశానని చెప్పింది. ఈ వ్యాఖ్య సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Key Points

1

వర్ష బొల్లమ్మ 'విక్రమార్కుడు' సినిమాను 50 సార్లు చూశానని తెలిపారు.

2

ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

4

వర్ష బొల్లమ్మ తమిళం, తెలుగు, మలయాళం సినిమాల్లో నటించారు.

వర్ష బొల్లమ్మ ఇంటర్వ్యూ కామెంట్స్

క్యూట్ నటి వర్ష బొల్లమ్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. చిన్నప్పటి నుంచే నటనపై ఆసక్తి ఉన్న ఈ హీరోయిన్ ప్రారంభంలో రాజా రాణిలోని నజ్రియా నజీమ్ డైలాగ్స్ డబ్స్మాష్ వీడియోలతో గుర్తింపు సంపాదించుకుంది. వర్ష కూడా నజ్రియా మాదిరిగా ఉంటుందని నెటిజన్లు కామెంట్లు చేస్తుంటారు. వర్ష విజిల్ (2019) సినిమాలో ఫుట్‌బాల్ ప్లేయర్‌గా.. చూసీ చూడంగానే సినిమాలో మ్యూజిక్‌ డైరెక్టర్‌గా నటించి మెప్పించింది.

అలాగే వర్ష ఆనంద్ దేవరకొండతో నటించిన మిడిల్ క్లాస్ మెలోడీస్ చిత్రం అమెజాన్ ప్రైమ్ లో విడుదలయింది. ఈ హీరోయిన్ కేవలం తమిళంలోనే కాకుండా.. తెలుగు మలయాళ సినిమాల్లో నటించి ప్రేక్షకుల్ని మెప్పించింది. 2015లో తమిళంలో వచ్చిన సతురన్ సినిమాలో తొలిసారిగా నటించిన వర్ష బొల్లమ్మ.. 2019లో వచ్చిన చూసి చూడంగానే చిత్రంతో తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే.

సోషల్ మీడియాలో వైరల్

తర్వాత వెట్రివేలన్‌, ఇవన్ యారేంద్రు తెరికిరత, యానుమ్ తీయవన్, కళ్యాణం, మందారం, సీమతురై, పెట్టికడై, జాను, మానె నెం.13, పుష్పకవిమానం, సెల్ఫీ, అక్క కురివి, స్టాండప్‌ రాహుల్‌, స్వాతిముత్యం, ఊరు పేరు భైరవకోన సినిమాల్లో నటించింది. ఇటీవలే తమ్ముడు సినిమాతో ప్రేక్షకుల ముందుగా వచ్చింది.

నెటిజన్ల ఫన్నీ ప్రతిస్పందనలు

అయితే ఈ ముద్దుగుమ్మ ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ బ్యూటీ ఇంటర్వ్యూలో ఓ సందర్భంలో రవితేజ హీరోగా వచ్చిన బ్లాక్ బస్టర్ విక్రమార్కుడు చిత్రం 50 సార్లు చూశానని చెప్పుకొచ్చింది. సమ్మర్‌లో తన కజిన్స్ ఇంటికెళ్లినప్పుడు చూశానని తెలిపింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవ్వగా.. ‘నేను సలార్ 60 సార్లు చూశాను అరుస్తున్నానా?’, దాంట్లో బ్రహ్మ్మనందం హెల్మెట్ పెట్టి కొట్టినప్పుడు పక్కన ఒక పిల్లి ఉంది దాని కలర్ చెప్పు అంటూ నెటిజన్ కామెంట్లు చేస్తున్నారు.

వర్ష బొల్లమ్మ ‘విక్రమార్కుడు’ సినిమాపై ఉన్న అభిమానాన్ని ఈ కామెంట్స్ వివరిస్తున్నాయి. సోషల్ మీడియాలో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.