|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: వరుణ్ తేజ్‌కి ప్రమాదం! నిహారిక సంచలన ప్రకటనతో టాలీవుడ్‌లో కలకలం!

Published: 15-04-2026, 11:35 AM
షాకింగ్: వరుణ్ తేజ్‌కి ప్రమాదం! నిహారిక సంచలన ప్రకటనతో టాలీవుడ్‌లో కలకలం!
  • వరుణ్ తేజ్ ‘బరి’ మూవీ కోసం వాలీబాల్ ప్రాక్టీస్ చేస్తుండగా మోకాలికి గాయం, అభిమానుల్లో ఆందోళన!
  • మోకాలికి ఆపరేషన్ విజయవంతం, త్వరలో షూటింగ్‌లో పాల్గొంటారని మెగా డాటర్ నిహారిక ప్రకటన
  • ప్రస్తుతం వరుణ్ తేజ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపిన డాక్టర్లు, అభిమానులకు ఊరట
  • వరుణ్ కోలుకున్నాక ‘బరి’ మూవీ షూటింగ్ పునః ప్రారంభం, భారీ అంచనాలు!

టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ తేజ్ కి ప్రమాదం జరిగిందా? మెగా డాటర్ నిహారిక చేసిన ప్రకటన ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అసలు వరుణ్ తేజ్‌కి ఏమైంది? పూర్తి వివరాల్లోకి వెళ్దాం!

వరుణ్ తేజ్‌కి గాయం: అసలేం జరిగింది?

వరుణ్ తేజ్ నటుస్తున్న తాజా మూవీ బరి. ఈసినిమాను పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై.. యదు వంశీ తెరకెక్కిస్తున్నారు. రీసెంట్ గా స్టార్ట్ అయిన ఈసినిమా షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా కొనసాగుతోంది. చిత్రీకరణలో భాగంగా వాలీబాల్ ఆటకు సంబంధించిన సన్నివేశాల కోసం.. వరుణ్ తేజ్ ప్రత్యేకంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ సమయంలో ఆయన మోకాలికి తీవ్ర గాయం జరిగినట్లు సమాచారం.

ఈ గాయం తీవ్రంగా ఉండటంతో.. పరిశీలించిన డాక్టర్లు వెంటనే ఆపరేషన్ చేయాలని సూచించారు. దాంతో రీసెంట్ గా వరుణ్ తేజ్‌కు మోకాలికి ఆపరేషన్ నిర్వహించారు. ఈ శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తైనట్లు వరున్ తేజ్ చెల్లెలు, మెగా డాటర్ నిహారిక కొణిదెల ఒక ప్రకటనలో తెలిపారు.

నిహారిక ప్రకటన: అభిమానులకు ఊరట

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, “ వరుణ్ అన్న ‘బరి’ సినిమా కోసం వాలీబాల్ ప్రాక్టీస్ చేస్తుండగా మోకాలికి గాయమైంది. డాక్టర్లు పరీక్షించి ఆయనకు ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ ఎలాంటి ఇబ్బంది లేకుండా సక్సెస్‌ఫుల్‌గా పూర్తైంది. ప్రస్తుతం ఆయన కంప్లీట్ గా రెస్ట్ లో ఉన్నాడు” అని అన్నారు.

నిహారిక ప్రకటనలో…. “త్వరలోనే వరుణ్ అన్నయ్య పూర్తిగా కోలుకుంటారని ఆశిస్తున్నాం. ఈ సమయంలో మాకు  సపోర్ట్  గా నిలిచిన అభిమానులు, స్నేహితులు, శ్రేయోభిలాషులందరికీ ధన్యవాదాలు” అని ఆమె తెలిపారు.ప్రస్తుతం వరుణ్ తేజ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. డాక్టర్ల సూచనల మేరకు కొంతకాలం విశ్రాంతి తీసుకున్న అనంతరం తిరిగి షూటింగ్‌లో పాల్గొనే అవకాశం ఉందని సమాచారం.

‘బరి’ మూవీ షూటింగ్ అప్‌డేట్స్

‘బరి’ సినిమా కోసం స్పెషల్ ట్రైయినింగ్ తీసుకుంటున్నాడు వరుణ్ తేజ్.. ఇదే సమయంలో ఈ ఘటన చోటుచేసుకోవడం తో మూవీ షూటింగ్ మరింత ఆలస్యం కానుంది. అయితే వరుణ్ పెద్ద గండం నుంచి బయటపడటం.. శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తవడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. త్వరలోనే వరుణ్ పూర్తిగా కోలుకుని మళ్లీ షూటింగ్‌లో పాల్గొంటారని చిత్ర యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

వరుణ్ తేజ్ త్వరగా కోలుకుని మళ్లీ సినిమాల్లో బిజీ అవుతారని ఆశిద్దాం. ‘బరి’ మూవీ గురించి మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూ ఉండండి. త్వరలోనే మిగతా వివరాలు తెలియజేస్తాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.