|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Varun Tej Lavanya: బిడ్డ కోసం అప్పుడే మొదలుపెట్టేశారు

Published: 25-07-2025, 7:46 AM
Varun Tej Lavanya: బిడ్డ కోసం అప్పుడే మొదలుపెట్టేశారు

మెగా హీరో వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠి దంపతులు త్వరలో తల్లిదండ్రులు కానున్నారు. మే నెలలో ఈ శుభవార్తను వారు అధికారికంగా ప్రకటించారు. ఇప్పుడు బిడ్డ కోసం షాపింగ్ కూడా మొదలుపెట్టారు.

Key Points

1

వరుణ్ తేజ్ త్వరలో తండ్రి కాబోతున్నాడు.

2

లావణ్య త్రిపాఠి గర్భవతి అని మే నెలలో వెల్లడించారు.

4

వరుణ్ తేజ్ మరియు లావణ్య 2023 నవంబరులో వివాహం చేసుకున్నారు.

వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి దంపతులు

మెగాహీరో వరుణ్ తేజ్ త్వరలో తండ్రి కాబోతున్నాడు. ఈ ఏడాది మే నెలలో తన భార్య లావణ్య త్రిపాఠి ప్రెగ్నెన్సీతో ఉన్న విషయాన్ని బయటపెట్టాడు. అప్పటినుంచి ఓవైపు సినిమా చేస్తూనే మరోవైపు భార్యతో ఎప్పటికప్పుడు టూర్స్ వేస్తూనే ఉన్నాడు. ఇకపోతే పుట్టబోయే బిడ్డ కోసం ఇప్పటినుంచే షాపింగ్ కూడా మొదలుపెట్టేశారు. ఈ విషయాన్ని స్వయంగా లావణ్య త్రిపాఠినే బయటపెట్టింది.

బిడ్డ కోసం షాపింగ్

నాగబాబు కొడుకు వరుణ్ తేజ్. ‘ముకుంద’ సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. ఫిదా, కంచె లాంటి చిత్రాలతో ఆకట్టుకున్నాడు. ఎఫ్ 2, ఎఫ్ 3 మూవీస్‌తో హిట్స్ కొట్టాడు. కానీ తర్వాత నుంచి సినిమాలైతే చేస్తున్నాడు గానీ సక్సెస్ కాలేకపోతున్నాడు. గతేడాది ‘మట్కా’తో వచ్చాడు కానీ ఫలితం లేకుండా పోయింది. ప్రస్తుతం ఓ హారర్ కామెడీ చిత్రం చేస్తున్నాడు.

మెగా ఫ్యామిలీ సంతోషం

అసలు విషయానికొస్తే తనతో కలిసి సినిమాలు చేసిన హీరోయిన్ లావణ్య త్రిపాఠిని ఆరేడేళ్ల పాటు ప్రేమించిన వరుణ్ తేజ్.. 2023 నవంబరులో పెళ్లి చేసుకున్నాడు. ఈ మే నెలలో తాము తల్లిదండ్రులు కాబోతున్న విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఇప్పుడు రాబోయే బేబీ కోసం షాపింగ్ చేయడం లాంటివి చూస్తుంటే మరో నెలరోజుల్లో గుడ్ న్యూస్ చెబుతారేమో అనిపిస్తుంది.

వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠి దంపతులకు త్వరలో పుట్టబోయే బిడ్డ కోసం అభినందనలు. వారి కొత్త జీవిత అధ్యాయానికి శుభాకాంక్షలు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.