
వాస్తు ప్రకారం ఇంట్లో సానుకూల శక్తి ప్రవహించడానికి కొన్ని నియమాలను పాటించాలి. ముఖ్యంగా, పడకగదిలో చేసే పొరపాట్లు ఆరోగ్యం, సంబంధాలపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. మానసిక ఒత్తిడిని తగ్గించుకుని, ప్రశాంతమైన జీవితం కోసం బెడ్‌రూమ్‌లో ఉండకూడని 6 వస్తువుల గురించి తెలుసుకుందాం.
Key Points
మంచానికి ఎదురుగా అద్దం ఉంచడం ప్రతికూల శక్తి, మానసిక ఒత్తిడిని పెంచుతుంది.
ఎలక్ట్రానిక్ డివైజ్‌లు ప్రతికూల శక్తిని కలిగిస్తాయి, సానుకూలతను దూరం చేస్తాయి.
విరిగిన వస్తువులు, పాత సామాన్లు బెడ్‌రూమ్‌లో అడ్డంకులను సృష్టిస్తాయి.
పూజ సామాన్లు, దేవుడి మందిరం బెడ్‌రూమ్‌లో ఉంచడం వాస్తు ప్రకారం సరికాదు.
అద్దం, ఎలక్ట్రానిక్ వస్తువుల స్థానం
వాస్తు ప్రకారం పాటించడం వలన సానుకూల శక్తి ప్రవహిస్తుంది, ప్రతికూల శక్తి తొలగిపోతుంది. అందుకే చాలా మంది ఇంట్లో వాస్తు నియమాలను పాటిస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం పాటించడం వలన ఇంట్లో ప్రశాంతత, సంతోషం కూడా ఉంటాయి. పడకగదిలో కూడా కొన్ని పొరపాట్లు చేయకుండా ఉండాలి. వాస్తు ప్రకారం పడక గదిలో ఎలాంటి పొరపాట్లు చేయకూడదు? ఏవి ఉంటే సమస్యలు వస్తాయి వంటి వివరాలని ఇప్పుడు తెలుసుకుందాం.
చాలా మంది మంచానికి ఎదురుగా అద్దం పెడుతూ ఉంటారు. నిజానికి అది చాలా పెద్ద పొరపాటు. ఎప్పుడూ కూడా మంచానికి ఎదురుగా అద్దం ఉండకూడదు. అది ప్రతికూల శక్తిని తీసుకొచ్చి, మానసిక ఒత్తిడిని పెంచుతుంది. నిద్ర కూడా పట్టదు.
ఒకవేళ మంచానికి ఎదురుగా ఉన్న అద్దాన్ని తొలగించడం కుదరకపోతే, రాత్రి నిద్రపోయే ముందు ఒక క్లాత్‌తో అద్దాన్ని కవర్ చేయండి. లేదంటే పడక గదిలో వేరే దిశకు అద్దాన్ని మార్చండి.
పదునైన వస్తువులు, ప్రతికూల చిత్రాలు
వాస్తు ప్రకారం టీవీ, ల్యాప్‌టాప్ మొదలైన ఎలక్ట్రానిక్ డివైస్లను బెడ్రూంలో ఉంచడం మంచిది కాదు. వీటి వలన ఎలక్ట్రో మాగ్నెటిక్ వేవ్స్ రిలీజ్ అవుతాయి. ఇవి ప్రతికూల శక్తిని కలిగించి, సానుకూల శక్తి దూరమవుతుంది. వాటిని బెడ్రూం నుంచి తొలగించడం అవ్వకపోతే, నిద్రపోవడానికి గంట ముందే వాటిని ఆఫ్ చేసి పెట్టండి.
విరిగిపోయినవి, పాత సామాన్లు వంటివి బెడ్రూంలో ఉంచడం మంచిది కాదు. చెత్తాచెదారం కూడా తొలగించాలి. వాస్తు ప్రకారం ఇలాంటివి బెడ్రూంలో ఉండడం వలన ప్రతికూల శక్తిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. జీవితంలో అడ్డంకులు కూడా కలుగుతాయి. కాబట్టి ఎప్పటికప్పుడు బెడ్రూంని శుభ్రంగా ఉంచుకోవాలి. పనికిరాని వాటిని తొలగించాలి.
వాస్తు ప్రకారం పడక గదిలో కత్తులు, కత్తెర వంటి పదునైన వస్తువులు ఉండకూడదు. ఇవి మానసిక ఒత్తిడిని పెంచుతాయి. రిలేషన్‌షిప్‌లో కూడా సమస్యలు కలిగిస్తాయి. కాబట్టి వాటిని బెడ్రూం నుంచి తొలగించడం మంచిదే.
దేవుడి మందిరం, పాత సామాన్ల తొలగింపు
యుద్ధం, భయంకరమైనవి, ఏడుస్తున్న వారి ఫోటోలు ఇలాంటివి పెట్టకూడదు. ఇవి మానసిక ఒత్తిడిని పెంచుతాయి. నిద్ర కూడా సరిగా పట్టదు.
బెడ్రూంలో ప్రశాంతంగా ఉండాలి. పూజ సామాన్లు, దేవుడు మందిరం వంటివి బెడ్రూంలో ఉంచకూడదు. అలా ఉంచితే ప్రతికూల శక్తిని ఎదుర్కోవాల్సి ఉంటుంది.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
పడకగదిలో వాస్తు నియమాలు పాటించడం ద్వారా ప్రతికూల శక్తిని తొలగించి, సానుకూల వాతావరణాన్ని సృష్టించుకోవచ్చు. ఈ చిట్కాలు పాటించడం వల్ల ఆరోగ్యం, సంబంధాలు మెరుగుపడి, ప్రశాంతమైన నిద్రతో పాటు ఆనందకరమైన జీవితం మీ సొంతమవుతుంది.


