|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Vedam Movie : అల్లు అర్జున్ లేకుండానే ‘వేదం 2’.. డైరెక్టర్ కామెంట్స్.. క్లైమాక్స్ లో ఆ సీన్ నుంచి లీడ్ తీసుకొని..

Published: 04-09-2025, 2:31 AM
Vedam Movie : అల్లు అర్జున్ లేకుండానే ‘వేదం 2’.. డైరెక్టర్ కామెంట్స్.. క్లైమాక్స్ లో ఆ సీన్ నుంచి లీడ్ తీసుకొని..

2010లో విడుదలైన వేదం సినిమా ఇప్పటికీ ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది. తాజాగా, ఈ సినిమాకు సీక్వెల్ గురించి దర్శకుడు క్రిష్ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. అల్లు అర్జున్ లేకుండా అనుష్క శెట్టితో సినిమా తెరకెక్కే అవకాశం ఉందట.

Key Points

1

వేదం సినిమాకు సీక్వెల్ గురించి దర్శకుడు క్రిష్ వెల్లడించారు.

2

అల్లు అర్జున్, మంచు మనోజ్ పాత్రలు చనిపోవడంతో అనుష్క పాత్రతోనే కథ కొనసాగుతుంది.

4

క్రిష్-అనుష్క కాంబినేషన్‌లో సరోజ పాత్ర ఆధారంగా లవ్ స్టోరీ వస్తుందని సమాచారం.

వేదం 2 గురించి దర్శకుడు క్రిష్ కామెంట్స్

Vedam Movie : 2010 లో డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో అల్లు అర్జున్, మంచు మనోజ్, అనుష్క.. పలువురు ముఖ్య పాత్రల్లో తెరకెక్కన సినిమా వేదం. కమర్షియల్ గా ఈ సినిమా పర్వాలేదనిపించినా ఒక క్లాసిక్ సినిమాలా నిలిచిపోయింది. ఇప్పటికి ఈ సినిమాకు ఫ్యాన్స్ ఉన్నారు. అనుష్క, అల్లు అర్జున్, మనోజ్ కెరీర్లో ఈ సినిమాలో పాత్రలు బెస్ట్ క్యారెక్టర్స్ గా నిలుస్తాయి.(Vedam Movie)

అయితే ఈ సినిమాకు సీక్వెల్ ఎప్పుడూ అనుకున్నట్టు ఎవరూ చెప్పలేదు. సినిమా ఎండింగ్ లో అల్లు అర్జున్, మంచు మనోజ్ పాత్రలు కూడా చనిపోవడంతో సినిమాకు ముగింపు అనుకున్నారు. అయితే తాజాగా ఈ సినిమా సీక్వెల్ పై డైరెక్టర్ క్రిష్ కామెంట్స్ చేసారు. క్రిష్ దర్శకత్వంలో అనుష్క మెయిన్ లీడ్ లో తెరకెక్కిన ఘాటీ సినిమా సెప్టెంబర్ 5 రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా క్రిష్ మీడియాతో మాట్లాడిన ఇంటర్వ్యూలో వేదం 2 గురించి మాట్లాడాడు.

అనుష్క శెట్టితో వేదం సీక్వెల్?

క్రిష్ మాట్లాడుతూ.. వేదం సినిమా క్లైమాక్స్ లో అనుష్క ట్రైన్ లో వెళ్ళిపోతూ ఉంటుంది. బయట వర్షం పడుతుంది. జీవితం మీద ఆశ ఉంది అన్నట్టు ముగింపు ఉంటుంది. అప్పుడే ఈ క్యారెక్టర్ కి సీక్వెల్ అనుకోని అనుష్క తో మళ్ళీ పనిచేద్దాం అని షూటింగ్ లోనే చెప్పాను. ఆ సినిమాలో సరోజ అనే వేశ్య పాత్రతోనే కంటిన్యూ చేద్దాం అనుకున్నాం. తిలక్ గారు రాసిన ఊరి చివర ఇల్లు అనే నవల బాగుంటుంది. అందులో రమ అనే వేశ్య పాత్ర గొప్పగా ఉంటుంది. దాన్ని ఆధారంగా తీసుకొని అనుష్కకి సరోజ సీక్వెల్ లాగా ఒక కథ చెప్పాను. దాన్ని ఒక గొప్ప లవ్ స్టోరీగా మార్చాను. దాంతో అనుష్క ఎప్పుడూ అడుగుతూ ఉంటుంది సరోజ సినిమా ఎప్పుడు అని. కానీ దానికి సమయం పడుతుంది అని తెలిపాడు.

సరోజ పాత్ర ఆధారంగా కొత్త కథ

క్రిష్ కామెంట్స్ తో వేదం సినిమాలో అల్లు అర్జున్, మనోజ్ పాత్రలు చనిపోతాయి కాబట్టి అనుష్క సరోజ పాత్ర తోనే సపరేట్ సినిమా తీస్తారని తెలుస్తుంది. అనుష్క వేశ్యగా నటిస్తూనే ఓ లవ్ స్టోరీగా సరోజ అనే టైటిల్ తోనే సినిమా ఉంటుందని భావిస్తున్నారు. మరి క్రిష్ – అనుష్క కలిసి ఈ సినిమా ఎప్పుడు తీస్తారో చూడాలి.

చివరగా, వేదం సినిమా కథానాయిక అనుష్క శెట్టి పాత్రతో వేదం 2 తెరకెక్కే అవకాశం ఉందని దర్శకుడు క్రిష్ వెల్లడించారు. అయితే, ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలియాల్సి ఉంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.