|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రైతుల‌ జీవితాల నేప‌థ్యంలో వీడే మ‌న వార‌సుడు – రిలీజ్ డేట్ జూలై 18!

Published: 27-06-2025, 11:47 PM

రమేష్ ఉప్పు హీరోగా నటించి దర్శకత్వం వహించిన ‘వీడే మన వారసుడు’ సినిమా జూలై 18న విడుదల కానుంది. రైతుల జీవితాలను, కుటుంబ బంధాలను చూపించే ఈ సినిమాకు సెన్సార్ బోర్డు సభ్యులు ప్రశంసలు తెలిపారు.

Key Points

1

రమేష్ ఉప్పు హీరోగా నటించిన 'వీడే మన వారసుడు' జూలై 18న విడుదల.

2

రైతుల జీవితాలు, కుటుంబ బంధాలు, మాదక ద్రవ్యాల ప్రభావం ప్రధాన అంశాలు.

4

జూన్ 29న ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది.

రమేష్ ఉప్పు చిత్రం ‘వీడే మన వారసుడు’

ర‌మేష్ ఉప్పు హీరోగా న‌టిస్తూ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన మూవీ ‘వీడే మన వారసుడు’. సందేశాత్మ‌క క‌థాంశంతో తెర‌కెక్కుతోన్న ఈ మూవీ లో లావణ్య రెడ్డి, సర్వాణి మోహన్ హీరోయిన్లుగా న‌టించారు. సమ్మెట‌ గాంధీ, విజయ రంగరాజు, ఆనంద్ భారతి, గూడూరు కిషోర్, శిల్ప (వైజాగ్) కీలక పాత్రలు పోషించారు. జూలై 18న తెలుగు రాష్ట్రాల‌లో ఈ సినిమా విడుద‌ల‌కాబోతుంది. వీడే మ‌న వార‌సుడు మూవీకి హీరో, డైరెక్ట‌ర్‌గానే కాకుండా స్క్రీన్‌ప్లే, మాటలు, పాటలు కూడా ర‌మేష్ ఉప్పు అందించారు.

తాజాగా వీడే మ‌న వార‌సుడు సినిమా చూసిన సెన్సార్ సభ్యులు చిత్రయూనిట్‌ను అభినందించారు. కుటుంబం, రైతుల పోరాటం, యువతపై మాదకద్రవ్యాల ప్రభావం వంటి అంశాలను సమర్థవంతంగా చూపించిన మూవీ మెచ్చుకున్న‌ట్లు మేక‌ర్స్ వెల్ల‌డించారు.

రైతుల పోరాటం, కుటుంబ విలువలు

ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌క‌నిర్మాత రమేష్ ఉప్పు మాట్లాడుతూ.. “స‌మాజానికి మంచి సందేశం అందించే మూవీ ఇది. సినిమా లోని ఎమోష‌న్స్‌ ప్ర‌తి ఒక్క‌రిని క‌దిలిస్తాయి. సెన్సార్ బోర్డు స‌భ్యుల‌తో పాటు, ప్రీమియ‌ర్ షో చూసిన ప‌లువురు ప్ర‌ముఖులు సినిమాపై ప్ర‌శంస‌లు కురిపించ‌డంతో మా న‌మ్మ‌కం మ‌రింతా పెరిగింది.మా క‌ష్టానికి త‌గిన ఫ‌లితం అందుతుందనే నమ్మకం బ‌లంగా ఉంది. రైతుల కష్టాలను అర్థవంతంగా సినిమాలో చూపించాం” అని పేర్కొన్నారు. జూన్ 29న మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు.

జూలై 18న విడుదల

ఈ సినిమాకు ఇద్ద‌రు మ్యూజిక్ డైరెక్ట‌ర్లు ప‌నిచేశారు. పాట‌ల‌ను స‌దివే దేవంద్ర అందించ‌గా…బీజీఎమ్ శ్రీవెంక‌ట్ స‌మ‌కూర్చారు.

సెన్సార్ బోర్డు అభినందనలతో విడుదలకు సిద్ధమైన ‘వీడే మన వారసుడు’ సినిమా, రైతుల కష్టాలను ప్రతిబింబించి ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని నమ్ముతున్నారు. జూలై 18న థియేటర్లలో.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.