
📌 Key Points
- వెంకీ, అనిల్ రావిపూడి కాంబోలో సీక్వెల్ మూవీకి సన్నాహాలు!
- 2027 సంక్రాంతి టార్గెట్‌గా భారీ ప్లానింగ్ చేస్తున్న దర్శకుడు!
- గెస్ట్ రోల్ కోసం రానా, కార్తీ పేర్లు పరిశీలనలో ఉన్నాయి!
- పుష్ప విలన్ ఫహాద్ ఫాజిల్ ఎంట్రీకి ఎక్కువ ఛాన్స్‌లు!
టాలీవుడ్ సంచలనం! విక్టరీ వెంకటేష్, స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వస్తున్న సినిమాలో పుష్ప విలన్ ఫహాద్ ఫాజిల్ నటిస్తున్నాడనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం!
2027 సంక్రాంతికి వెంకీ మామ రాక!
టాలీవుడ్ సక్సెస్ ఫుల్ దర్శకుడు అనిల్ రావిపూడి వరుస సినిమాలతో దూసుకు వెళ్తున్నారు. ప్రతి సంక్రాంతికి ఒక హిట్ కొడుతున్న అనిల్ రావిపూడి, మొన్న మెగాస్టార్ చిరంజీవితో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. మన శంకర వరప్రసాద్ గారు సినిమాను చాలా గ్రాండ్ గా తెరకెక్కించిన అనిల్ రావిపూడి, ట్రెండింగ్ లోకి వచ్చారు. గత సంక్రాంతికి విక్టరీ వెంకటేష్ తో హిట్ కొట్టి, ఈ సారి మెగాస్టార్ చిరంజీవి ద్వారా సక్సెస్ అందుకున్నారు. ఆయన విజయాన్ని అందుకోవడమే కాకుండా ఆ మెగాస్టార్ చిరంజీవికి కూడా చరిత్రలో మరిచిపోలేని హిట్ అందించారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది హీరోలు, అనిల్ రావిపూడితో సినిమా చేసేందుకు ఎగబడుతున్నారట.
సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో గత ఏడాది విక్టరీ వెంకటేష్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం. అయితే ఈ మూవీకి సీక్వెల్ కూడా తీస్తున్నారు అనిల్ రావిపూడి. 2027 సంక్రాంతికి ఈ మూవీని రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నారట. అయితే ఇందులో ఒక గెస్ట్ రోల్ ఉంటుందని అంటున్నారు. దీనికోసం ముందు రానా దగ్గుబాటి పేరు వినిపించినప్పటికీ, ఇప్పుడు మరో ఇద్దరి పేర్లు తెరపైకి వచ్చింది. తమిళ్ హీరో కార్తీ లేదా పుష్ప విలన్ ఫహాద్ ఫాజిల్ ను తీసుకునే ఛాన్సులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో ఫహాద్ ఫాజిల్ ను ఫైనల్ చేసే అవకాశాలు ఉన్నట్లు టాలీవుడ్ సర్కిల్లో వార్తలు వస్తున్నాయి.
ఫహాద్ ఫాజిల్ ఎంట్రీతో సినిమాకు హైప్!
అనిల్ రావిపూడి మార్క్ సీక్వెల్!
టాలీవుడ్ లో ఈ వార్త సంచలనం సృష్టిస్తోంది. వెంకటేష్, ఫహాద్ ఫాజిల్ కాంబినేషన్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


