
నటుడు విక్టరీ వెంకటేశ్ తన ప్రియమైన పెంపుడు శునకం గూగుల్ మరణంపై తీవ్ర విషాదంలో ఉన్నారు. 12 ఏళ్లుగా తనతో ఉన్న గూగుల్‌ను కోల్పోయిన బాధను ఆయన సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.
Key Points
వెంకటేశ్ తన ప్రియమైన పెంపుడు శునకం గూగుల్‌ను కోల్పోయి బాధపడుతున్నారు.
గూగుల్‌తో 12 ఏళ్ల అద్భుతమైన జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.
ఖుష్బూ వెంకటేశ్ పోస్ట్‌కు ఓం శాంతి అంటూ స్పందించారు.
వెంకటేశ్‌కు గూగుల్‌తో 12 ఏళ్ల అనుబంధం
విక్టరీ వెంకటేశ్ ఎమోషనల్ అయ్యాడు. తన పెంపుడు శునకం గూగుల్ చనిపోవడంతో బాధపడుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. దానితో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నాడు. ఇక వీడ్కోలు అని రాసుకొచ్చాడు.
ఎమోషనల్ సోషల్ మీడియా పోస్ట్
‘మా ప్రియమైన గూగుల్. గత 12 ఏళ్లుగా మా జీవితాల్లో నువ్వు భాగమయ్యావు. ఎంతో ప్రేమని పంచావు. అందమైన జ్ఞాపకాలని ఇచ్చావు. నువ్వే మా సన్‌షైన్. ఇక నీకు వీడ్కోలు. నువ్వు లేని శూన్యత మాటల్లో వర్ణించలేనిది. నేను నిన్ను ఎప్పటికీ మిస్ అవుతూనే ఉంటాను డియర్ ఫ్రెండ్’ అని వెంకటేశ్ తన ఇన్ స్టాలో పోస్ట్ పెట్టాడు. దీనికి నటి ఖుష్బూ కూడా కామెంట్ చేసింది. ఓం శాంతి అని రాసుకొచ్చింది.
వెంకటేశ్ సినిమాల విషయానికొస్తే ఈ ఏడాది సంక్రాంతికి ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించాడు. రీసెంట్‌గానే త్రివిక్రమ్‌తో మూవీ చేయబోతున్నట్లు ప్రకటించాడు. ఇది కూడా కుటుంబ కథా చిత్రం అని తెలుస్తోంది. త్వరలో షూటింగ్ మొదలుకానుంది. వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నారు.
ఖుష్బూ స్పందన
వెంకటేశ్ పెంపుడు జంతువుతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుని తన విషాదాన్ని వ్యక్తం చేశారు. గూగుల్ లేకపోవడం వల్ల కలిగే ఖాళీని వర్ణించలేమని ఆయన పేర్కొన్నారు.


