|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

చిరంజీవి సినిమాలో వెంకీ సందడి: వెంకటేష్ పేరు మార్చేసిన అభిమానులు! అసలేం జరిగిందంటే?

Published: 15-01-2026, 12:00 PM
చిరంజీవి సినిమాలో వెంకీ సందడి: వెంకటేష్ పేరు మార్చేసిన అభిమానులు! అసలేం జరిగిందంటే?
  • చిరంజీవి సినిమాలో వెంకటేష్ 25 నిమిషాల పాటు కనిపించి సందడి చేశారు.
  • సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా మూడు రోజుల్లో 150 కోట్లకు పైగా వసూలు చేసింది.
  • సినిమా చూసిన అభిమానులు వెంకీ మామని వెంకీ గౌడ అని పిలవడం మొదలుపెట్టారు.
  • వెంకటేష్, చిరంజీవి కాంబినేషన్లో పూర్తి సినిమా కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.

చిరంజీవి నటించిన ‘మన శంకర్ వరప్రసాద్’ సినిమాలో వెంకటేష్ ప్రత్యేక పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఆయన నటనకు ఫిదా అయిన అభిమానులు ఆయన పేరును మార్చేశారు. పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి.

చిరంజీవి సినిమాలో వెంకటేష్ సందడి

Venkatesh:  ఇటీవల కాలంలో స్టార్ హీరోల సినిమాలలో ఇతర హీరోలు క్యామియో పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటించిన మన శంకర వరప్రసాద్ గారు సినిమాలో మరొక స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ (Venkatesh) కూడా నటించి సందడి చేశారు. ఈయన ఈ సినిమాలో 25 నిమిషాల పాటు స్క్రీన్ పై సందడి చేశారు .వెంకటేష్, చిరంజీవి కాంబినేషన్లో వచ్చిన పాట అలాగే సీన్లు కూడా సినిమాకు హైలైట్ అయ్యాయి. ఈ సినిమా జనవరి 12వ తేదీ సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయ్యి మంచి సక్సెస్  అవ్వడంతో మెగా విక్టరీ అభిమానులు ఈ సక్సెస్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు.

ఇక ఈ సినిమాకు మంచి ఆదరణ రావడమే కాకుండా మూడు రోజుల వ్యవధిలో ఏకంగా 150 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి సంచలనాలను సృష్టించింది. ఈ నేపథ్యంలోనే చిత్ర బృందం కూడా సక్సెస్ సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. తాజాగా సంక్రాంతి పండుగ సందర్భంగా విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి, చిరంజీవి కలిసి ఒక ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూలో భాగంగా అనిల్ రావిపూడి ఈ సినిమా చూసిన తర్వాత వెంకటేష్ గారి కుటుంబ సభ్యుల రియాక్షన్ గురించి అడిగి తెలుసుకున్నారు. తన ఫ్యామిలీ మెంబర్స్ ఈ సినిమా చూసి చాలా బాగా ఎంజాయ్ చేశారని తెలిపారు.

150 కోట్లు వసూలు చేసిన సినిమా

ముఖ్యంగా మా ఇద్దరి మధ్య వచ్చే సీన్స్ చాలా ఇష్టపడ్డారని ఇద్దరినీ ఒకే ఫ్రేమ్ లో చూసి తన ఫ్యామిలీ మెంబర్స్ సంతోషం వ్యక్తం చేశారని వెంకటేష్ తెలియజేశారు. ఈ సినిమా చూసిన తర్వాత అభిమానులందరూ తనకు పేరు మార్చేసారని ప్రతి ఒక్కరూ తనని వెంకీ మామ నుంచి వెంకీ గౌడ(Venky Gowda) అంటూ పిలవడం మొదలుపెట్టారని వెంకటేష్ తెలియజేశారు. ఇటీవల ఓ సందర్భంలో మా మిస్సెస్ ని కూడా నీరజ గౌడ అంటూ పిలుస్తున్నారని వెంకటేష్ ఈ సందర్భంగా తెలియజేశారు. ఇలా మన శంకర వరప్రసాద్ గారు సినిమా తర్వాత వెంకటేష్ ను ముద్దుగా వెంకీ మామ అంటూ పిలుచుకునే వారందరూ వెంకీ గౌడ అంటూ పిలుస్తున్నారని తెలిసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

నిర్మాతగా సుస్మిత కొణిదేల..

వెంకీ మామ కాస్తా వెంకీ గౌడ ఎలా అయ్యారు?

ఇలా వెంకటేష్ చిరంజీవి కాంబినేషన్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేయడమే కాకుండా వీరిద్దరి కాంబినేషన్లో ఫుల్ లెంగ్త్ సినిమా వస్తే బాగుంటుంది అంటూ వారి అభిప్రాయాలను కూడా తెలియజేశారు. మరి అభిమానుల కోరిక ఎప్పుడు నెరవేరబోతుందో తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో చిరంజీవికి జోడిగా నయనతార నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా షైన్ స్క్రీన్ బ్యానర్ గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సుస్మిత కొణిదెల,సాహు గారపాటి నిర్మాతలుగా వ్యవహరించారు.

చిరంజీవి, వెంకటేష్ కలిసి నటించిన ఈ సినిమా భారీ విజయం సాధించడంతో, వీరిద్దరి కాంబినేషన్లో మరో సినిమా వస్తే చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు. వారి కల ఎప్పుడు నెరవేరుతుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.