|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మామూలు షాక్ కాదు: త్రివిక్రమ్ సినిమా కోసం వెంకటేష్ భారీ రెమ్యునరేషన్! రికార్డు బ్రేకింగ్!

Published: 27-01-2026, 6:35 AM
మామూలు షాక్ కాదు: త్రివిక్రమ్ సినిమా కోసం వెంకటేష్ భారీ రెమ్యునరేషన్! రికార్డు బ్రేకింగ్!
  • వెంకటేష్ లేటెస్ట్ మూవీ: త్రివిక్రమ్‌తో ‘ఆదర్శ కుటుంబం’లో నటించనున్న విక్టరీ హీరో!
  • రెమ్యునరేషన్ షాక్: సంక్రాంతి హిట్ తర్వాత ఏకంగా 40 కోట్ల పారితోషికం అందుకుంటున్న వెంకీ మామ!
  • భారీ బడ్జెట్: ‘ఆదర్శ కుటుంబం’ చిత్రం దాదాపు 150 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందుతోంది!
  • రికార్డు కలెక్షన్లు: గత చిత్రం 300 కోట్లు కొల్లగొట్టింది, ఈ సినిమాపై భారీ అంచనాలు!

విక్టరీ వెంకటేష్ మరో సంచలనానికి సిద్ధమయ్యారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటించబోయే సినిమాలో ఆయన రెమ్యునరేషన్ పెంచేశారనే వార్త టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

త్రివిక్రమ్ తో వెంకటేష్ మూవీ: క్రేజీ కాంబో రిపీట్!

టాలీవుడ్ ఆడియన్స్ లో ఫ్యామిలీ హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు వెంకటేష్. ఎప్పటికప్పుడు ట్రెండ్ ను ఫాలో అవుతూ.. తనలో మార్పులు చేసుకుంటూ పరిశ్రమలో దూసుకుపోతున్నాడు. 65 ఏళ్ల వయసులో కూడా వరుస విజయాలతో ముందుకు సాగుతున్నాడు విక్టరీ వెంకటేష్. గత ఏడాది సంక్రాంతికి ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా తో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న వెంకటేష్.. ఈ సంక్రాంతికి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ సినిమాలో స్పెషల్ క్యారెక్టర్ లో కనిపించి మరోసారి సక్సెస్ సాధించారు.

ఈ రెండు సినిమాల సక్సెస్ లో మంచి ఫామ్ లో ఉన్నాడు వెంకటేష్. తనకు తగ్గ పాత్రలు సెలెక్ట్ చేసుకుని సినిమాలు చేయడంతో విక్టరీ స్టార్ అంచనాలు ఎప్పుడు తప్పలేదు. కొన్ని సినిమాలు తప్పించి.. ఆయన కెరీర్ లో ఎక్కువ సినిమాలు సక్సెస్ సాధించాయి.

65 ఏళ్ల వయసులోనూ తగ్గేదే లే: వెంకీమామ జోరు!

ఇక ప్రస్తుతం వెంకటేష్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ‘ఆదర్శ కుటుంబం’ అనే కొత్త సినిమాలో నటిస్తున్నారు. నిజానికి వెంకటేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్‌లో సినిమా చాలా కాలం క్రితమే రావాల్సి ఉండగా, అప్పట్లో కొన్ని కారణాల వల్ల అది వర్కౌట్ కాలేదు. అయితే ఇప్పుడు ఎట్టకేలకు ఈ కాంబినేషన్ సెట్ కావడంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది.

వెంకటేష్ , త్రివిక్రమ్ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. గతంలో కూడా వీరి కాంబోలో అద్బుతమైన సినిమాలు వచ్చాయి. వెంకటేష్ కెరీర్‌లో త్రివిక్రమ్ ప్రత్యేకమైన పాత్ర పోషించారు. గతంలో వెంకటేష్ సినిమాలకు త్రివిక్రమ్ అందించిన డైలాగ్స్ ప్రేక్షకుల్లో మంచి ఆదరణ పొందాయి. నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి వంటి సినిమాలు ఇప్పటికీ ప్రేక్షకుల మదిలో నిలిచిపోయాయి. త్రివిక్రమ్ రాసే పంచ్ లకు.. వెంకటేష్ టైమింగ్ తోడైతే.. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందన్న అంచనాలు ఉన్నాయి.

రెమ్యునరేషన్ ఎంతంటే: టాలీవుడ్‌లో హాట్ టాపిక్!

ఈ సినిమాకు సంబంధించి మరో ముఖ్యమైన విషయం వైరల్ అవుతోంది. టాలీవుడ్ టాక్ ప్రకారం వెంకటేష్ ఈ మూవీ కోసం రెమ్యూనరేషన్ భారీగా పెంచినట్టు తెలుస్తోంది.. ప్రస్తుత సమాచారం ప్రకారం, ఈ సినిమా కోసం వెంకటేష్ సుమారు 40 కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

గతంలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా కోసం ఆయన దాదాపు 35 కోట్ల రూపాయలు అందుకున్నారని టాక్. ఆ సినిమా 300 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించడంతో, తాజా ప్రాజెక్ట్‌కు రెమ్యూనరేషన్ పెరిగినట్లు తెలుస్తోంది.ఆదర్శ కుటుంబం సినిమా సుమారు 150 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. ఈ సినిమాను భారీ స్థాయిలో రూపొందించి, 400 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించాలనే లక్ష్యంతో నిర్మాతలు ఆలోచిస్తున్నారట.

వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి. సినిమా రిలీజ్ కోసం ఎదురుచూద్దాం. బ్లాక్ బస్టర్ హిట్ కొడుతుందో లేదో చూద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.