
ప్రముఖ దర్శకుడు వెంకీ అట్లూరి తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తన రాసిన ప్రతి కథను మొదట నాగచైతన్యకు వినిపించానని, కానీ అవి సినిమాలుగా మారలేదని చెప్పారు. అలాగే అఖిల్‌తో తన భవిష్యత్తు ప్రణాళికలను కూడా పంచుకున్నారు.
Key Points
వెంకీ అట్లూరి రాసిన ప్రతి కథనం మొదట నాగచైతన్యకు వినిపించారు.
నాగచైతన్యతో సినిమా కుదరకపోవడంపై వెంకీ అట్లూరి వెల్లడించారు.
అఖిల్‌తో 'మిస్టర్ మజ్ను' సినిమా చేసిన అనుభవం గురించి మాట్లాడారు.
ప్రస్తుతం సూర్యతో సినిమా చేస్తున్న వెంకీ అట్లూరి, భవిష్యత్తులో అఖిల్‌తో సినిమా చేయాలని కోరుకుంటున్నారు.
నాగచైతన్యకు చెప్పిన కథలు
సార్, లక్కీ భాస్కర్ చిత్రాలతో వరుస హిట్లు అందుకున్నాడు డైరెక్టర్ వెంకీ అట్లూరి ( Venky Atluri ). ప్రస్తుతం హీరో సూర్యతో సినిమా చేస్తున్నాడు. దర్శకుడిగా ఇప్పటివరకు ఐదు సినిమాలు చేసిన వెంకీ అట్లూరి.. వాటన్నింటినీ ముందుగా అక్కినేని నాగచైతన్యకు వినిపించాడట! తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో వెంకీ అట్లూరి మాట్లాడుతూ.. అక్కినేని ఫ్యామిలీ అంటే నాకిష్టం. మీరు నమ్ముతారో, లేదో కానీ.. ఇప్పటివరకు రాసుకున్న ప్రతి కథ మొదటగా నాగచైతన్యకే చెప్పాను.
వర్కవుట్ కాలే ఈరోజు వరకు నేను తీసిన ఐదు సినిమాలు ప్రతీది చైతన్య ( Naga Chaitanya )కే చెప్పాను. కానీ, డేట్స్ కుదరక.. లేదా ఏదో ఒక కారణం వల్ల మా కాంబినేషన్‌లో సినిమా వర్కవుట్ కావడం లేదు. నెక్స్ట్ టైం అయినా కలిసి మూవీ చేద్దామని జోక్ చేసుకుంటూ ఉంటాం. అఖిల్‌కు మంచి హిట్టు ఇవ్వలేకపోయానన్న బాధ ఉంది. తనతో భవిష్యత్తులో కచ్చితంగా ఓ మంచి మూవీ చేస్తాను అని చెప్పుకొచ్చాడు.
సినిమా కాంబినేషన్లు
సినిమా వెంకీ అట్లూరి.. అఖిల్‌తో మిస్టర్ మజ్ను మూవీ చేశాడు. ప్రస్తుతం సూర్యతో కలిసి ఓ సినిమా చేస్తున్నాడు. మమితా బైజు, రాధికా శరత్ కుమార్, రవీనా టండన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్ మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ కానుంది. ఈ సినిమాకు జీవీ ప్రకాష్‌కుమార్ సంగీతం అందిస్తున్నారు.
భవిష్యత్తు ప్రణాళికలు
వెంకీ అట్లూరి తన కథలు నాగచైతన్యతో సినిమాలుగా మారకపోవడంపై వివరించారు. అయితే, అఖిల్ తో మంచి సినిమా చేయాలనే ఆయన కోరికను వ్యక్తం చేశారు. సూర్యతో ప్రస్తుతం చేస్తున్న సినిమాపై ఆశలు పెంచుకుంటున్నారు.


