
తెలుగు సినిమా రంగంలో కామెడీ నటిగా పేరు తెచ్చుకున్న వాసుగి (పాకీజా) ప్రస్తుతం దీనస్థితిలో ఉన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆమె భిక్షాటన చేయాల్సి వస్తుందని తెలిపారు. ఆమె సహాయం కోసం ప్రభుత్వం, సినీ ప్రముఖులను కోరుతున్నారు.
Key Points
అలనాటి నటి వాసుగి ('పాకీజా') దీనస్థితిలో ఉన్నారు.
ఆమె ఆర్థిక ఇబ్బందుల కారణంగా భిక్షాటన చేస్తున్నారు.
అమ్మ క్యాన్సర్ చికిత్స కోసం ఆమె డబ్బు ఖర్చు చేశారు.
పవన్ కళ్యాణ్, చంద్రబాబు సహాయం కోసం ఆమె విజ్ఞప్తి చేస్తున్నారు.
పాకీజాగా పేరు తెచ్చుకున్న నటి దీనస్థితి
సినీ ఇండస్ట్రీలో కామెడీతో నవ్వులు పూయించిన అలనాటి నటి వాసుగి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఆమె అసెంబ్లీ రౌడీ మూవీలో ‘పాకీజా’ పాత్రతో తెలుగు ప్రేక్షకుల మనసులు దోచుకున్నారు. ఈ చిత్రంలో ఆమె నటనతో అందరినీ ఆకట్టుకుంది. ఈ క్రమంలో అప్పటి నుంచి వాసుగి సినీ ప్రియులకు పాకీజా పేరుతో దగ్గరైంది. కానీ.. ఆమెకు ఇప్పుడు పూట గడవని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ తరుణంలో వాసుగి దీనస్థితిలో కొన్నిసార్లు భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నారు. విషయంలోకి వెళితే.. చెన్నై నుంచి విజయవాడ కనకదుర్గమ్మ దర్శనానికి వచ్చిన పాకీజా గుంటూరులో మీడియాతో ఆమె దీనస్థితి గురించి మాట్లాడుతూ కన్నీరు పెట్టుకున్నారు.
ప్రస్తుతం తన ఆర్థిక పరిస్థితి బాగోలేదని, పూట గడవక భిక్షాటన చేసే పరిస్థితుల్లో ఉన్నానని నటి పాకీజా(వాసుగి) తెలిపారు. ఉన్న డబ్బును అమ్మ క్యాన్సర్ చికిత్స కోసం ఖర్చు చేశానని ఆమె భావోద్వేగానికి గురయ్యారు. ఈ తరుణంలో ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కలిసేందుకు ఆమె గుంటూరు వచ్చినట్లు తెలిపారు. నా దుస్థితి గురించి తమిళ ఇండస్ట్రీ పట్టించుకోలేదు. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం(AP Government) తనను ఆదుకుంటుందన్న ఆశతో ఇక్కడికి వచ్చాను. గతంలో చిరంజీవి(Chiranjeevi), నాగబాబు(Nagababu) ఆదుకున్నారు. ఒకవేళ ఆ సమయంలో వారు కూడా ఆదుకోకపోతే నేను ఎప్పుడో చనిపోయేదాన్ని అంటూ విలపించారు. ఇప్పుడు సీఎం చంద్రబాబు(CM Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kayan) కల్పించుకుని నాకు పెన్షన్ ఇవ్వాలని నటి వాసుగి కోరారు.
ఆర్థిక ఇబ్బందులు, భిక్షాటన
సీఎం, డిప్యూటీ సీఎం సహాయం కోసం విజ్ఞప్తి
వాసుగి దీనస్థితి చూసి ప్రభుత్వం, సినీ ప్రముఖులు స్పందించి ఆమెకు సహాయం చేయాలని ఆశిద్దాం. ఆమెకు తగిన ఆర్థిక సహాయం అందేలా చర్యలు తీసుకోవాలి.


