|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

‘విద్రోహి’ విజయం సాధించాలి : అల్లరి నరేశ్‌

Published: 23-09-2025, 10:17 AM
‘విద్రోహి’ విజయం సాధించాలి : అల్లరి నరేశ్‌

రవి ప్రకాష్, శివకుమార్ నటించిన ‘విద్రోహి’ సినిమా ట్రైలర్‌ను అల్లరి నరేష్ ఆవిష్కరించారు. పోస్ట్ ప్రొడక్షన్ పూర్తయిన ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. అల్లరి నరేష్ సినిమాకు శుభాకాంక్షలు తెలిపారు.

Key Points

1

‘విద్రోహి’ సినిమా ట్రైలర్‌ను అల్లరి నరేష్ ఆవిష్కరించారు.

2

పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి అయ్యాయి, విడుదలకు సిద్ధం.

4

నిర్మాతలు త్వరలో విడుదల తేదీని ప్రకటించనున్నారు.

‘విద్రోహి’ ట్రైలర్ విడుదల

‎రవి ప్రకాష్, శివకుమార్, చరిష్మా శ్రీఖర్, సాయికి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘విద్రోహి’. వి ఎస్‌ వి దర్శకత్వంలో సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రాన్ని  వెంకట సుబ్రహ్మణ్యం విజ్జన నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ని హీరో శ్రీకాంత్, ఫస్ట్ సాంగ్‌ని వివి వినాయక్ , రెండో పాటను  ఆర్ పి పట్నాయక్ విడుదల చేసిన విషయం తెలిసిందే. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోన్న ఈ చిత్రం ట్రైలర్ ను తాజాగా కామెడీ కింగ్ అల్లరి నరేష్ ఆవిష్కరించారు. త్వరలోనే  విద్రోహి చిత్ర విడుదల తేదీని ప్రకటించనున్నారు. ‎

‎ట్రైలర్ విడుదల అనంతరం అల్లరి నరేష్ మాట్లాడుతూ.. ‘విద్రోహి’ ట్రైలర్ చాలా బాగుంది. ఈ సినిమాలో పని చేసిన వారు నాకు చాలా క్లోజ్ పర్సన్స్. వారికి ఈ సినిమా మంచి సక్సెస్‌ని ఇవ్వాలని కోరుకుంటున్నాను’అన్నారు. ‎ ‎ఈ చిత్ర నిర్మాత వెంకట సుబ్రమణ్యం మాట్లాడుతూ – మా ‘విద్రోహి’ మూవీ ట్రైలర్ ను విడుదల చేసిన కామెడీ కింగ్ అల్లరి నరేష్‌గారికి మా టీమ్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంతకు ముందు హీరో శ్రీకాంత్ గారు, దర్శకుడు వివి వినాయక్‌గారు , సంగీత దర్శకుడు ఆర్ పి పట్నాయక్ గారు మాకు సపోర్ట్ చేశారు. ఇండస్ట్రీ తరపున ఇలాంటి సపోర్ట్ మాకు లభించడం చాలా ఆనందంగా ఉంది. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నామని తెలిపారు.

అల్లరి నరేష్ శుభాకాంక్షలు

సినిమా విడుదల తేదీ త్వరలో

‘విద్రోహి’ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అల్లరి నరేష్ సహా చిత్ర యూనిట్ విజయం కోసం ఆశావహంగా ఉన్నారు. సినిమా విజయవంతం కావాలని కోరుకుందాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.