
📌 Key Points
- ధనుష్‌లో తండ్రిని చూసుకున్నానని తెలిపిన విఘ్నేష్ శివన్.
- ధనుష్‌తో స్నేహం తెగిపోవడం తన జీవితంలో ఒక చేదు జ్ఞాపకమని విఘ్నేష్ ఆవేదన.
- కమ్యూనికేషన్ గ్యాప్ వల్లే ఇద్దరి మధ్య దూరం పెరిగిందని శివన్ అభిప్రాయం.
- ధనుష్ ఇచ్చిన ప్రోత్సాహం ఎప్పటికీ మరువలేనని విఘ్నేష్ వెల్లడి.
ప్రముఖ దర్శకుడు విఘ్నేష్ శివన్, నటుడు ధనుష్‌తో తన స్నేహబంధం గురించి ఆవేదన వ్యక్తం చేశారు. ధనుష్‌లో తన తండ్రిని చూసుకున్నానని, ఆ బంధం తెగిపోవడం తనను తీవ్రంగా కలచివేసిందని ఆయన అన్నారు. కమ్యూనికేషన్ లోపం వల్లే ఇదంతా జరిగిందని ఆయన తెలిపారు.
ధనుష్‌తో స్నేహం: విఘ్నేష్ షాకింగ్ కామెంట్స్
Vignesh: సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీల మధ్య మంచి అవినాభావ సంబంధాలు ఉంటాయి. కానీ ఒక్కొక్కసారి ఆ సంబంధాలు చెడిపోతే మాత్రం ఆ బాధ వర్ణనాతీతం అనే చెప్పాలి. ముఖ్యంగా సినీ సెలబ్రిటీల మధ్య మంచి స్నేహబంధం ఏర్పడినప్పుడు ఎదుటివారిలో తమ కుటుంబ సభ్యులను చూసుకున్న సెలబ్రిటీలు కూడా లేకపోలేదు. అయితే కేవలం కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఆ బంధం చెడిపోతే ఎలా ఉంటుందో నిరూపించారు ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్. ఈ క్రమంలోనే ప్రముఖ దర్శకుడు విఘ్నేష్ శివన్ ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ లో తన తండ్రిని చూసుకున్నానని, అయితే ఇప్పుడు ఆ సంబంధం కూలిపోయింది అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు ధనుష్ నుండి విడిపోవడం పై పశ్చాతాపం వ్యక్తం చేస్తూ .. ఆ రోజు కూర్చొని మాట్లాడి ఉంటే ఈరోజు ఇంత వేదన కలిగేది కాదు అంటూ తన బాధను వ్యక్తపరిచారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..
డైరెక్టర్ విఘ్నేష్ శివన్ ప్రస్తుతం దర్శకత్వం వహించిన చిత్రం లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ.. ప్రదీప్ రంగనాథన్ హీరోగా, కృతి శెట్టి హీరోయిన్గా రౌడీ పిక్చర్స్ బ్యానర్ పై నయనతార నిర్మించిన ఈ చిత్రం.. ఏప్రిల్ 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలోనే వరుస ప్రమోషనల్ కార్యక్రమాలలో పాల్గొంటున్న విఘ్నేష్ శివన్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని స్టార్ హీరో ధనుష్ తో విభేదాలపై స్పందించారు.
విఘ్నేష్ మాట్లాడుతూ.. ధనుష్ తో స్నేహం చెడిపోవడం నా జీవితంలోనే ఒక చేదు జ్ఞాపకం. కెరియర్ ఆరంభంలో ధనుష్ ఇచ్చిన ప్రోత్సాహం నేను మరువలేనిది. రఘువరన్ బీటెక్ సినిమా సమయంలో రెండేళ్ల పాటు నేను ఆయనతోనే ఉంటూ ఎంతో నేర్చుకున్నాను. నా తండ్రి మరణించిన రోజే ధనుష్ పుట్టినరోజు కావడంతో ఆయనలో నేను నా తండ్రిని చూసుకునేవాడిని. అంతటి ఘాడమైన అనుబంధం బ్రేక్ అవ్వడాన్ని ఇప్పటికీ నేను తట్టుకోలేక పోతున్నాను . ముఖ్యంగా జరిగిన పొరపాట్లకు సిగ్గుపడుతున్నాను.
విఘ్నేష్ మనసులోని బాధను బయటపెట్టిన శివన్
ఇద్దరి వ్యక్తుల మధ్య సమస్యలు ఉన్నప్పుడు కూర్చోని మాట్లాడుకుంటే బాగుండేది అనేది నా అభిప్రాయం. కేవలం కమ్యూనికేషన్ గ్యాప్ వల్లి మా ఇద్దరి మధ్య దూరం పెరిగింది. అసలు ఆ గొడవ ఎందుకు జరిగిందో కూడా మాకు అర్థం కావడం లేదు. ” అంటూ విఘ్నేష్ తెలిపారు. మొత్తానికైతే ధనుష్ లేకపోతే తాను లేనని, తాను ఈ స్థాయిలో ఉండడానికి ధనుష్ కారణమని , ధనుష్ పై కృతజ్ఞత చాటుకుంటూనే .. మరొకవైపు కోల్పోయిన స్నేహాన్ని మళ్లీ పొందాలనే మనసులోని బాధను బయటపెట్టారు విఘ్నేష్ . ఇక ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇకపోతే వీరిద్దరి మధ్య విభేదాలు రావడానికి గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే.. నయనతార వివాహ డాక్యుమెంటరీ విడుదల సమయంలో తలెత్తిన వివాదాల వల్లే వీళ్ళిద్దరి మధ్య విభేదాలు వచ్చినట్లు సమాచారం. ధనుష్ నిర్మించిన నానుమ్ రౌడీధాన్ చిత్రంలోని కొన్ని సెకన్ల ఫుటేజీని అనుమతి లేకుండా వాడారు అంటూ ధనుష్ పది కోట్ల రూపాయల నష్టపరిహారం కోరారు. దానికి నయనతార బహిరంగ లేఖ రాయడం సంచలనం సృష్టించింది. ఆ సమయంలో ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన విగ్నేష్ కూడా ధనుష్ పై విమర్శలు చేశాడు. ఇక అప్పట్నుంచే ఇద్దరి మధ్య దూరం పెరిగింది.
కమ్యూనికేషన్ గ్యాప్ వల్లే దూరం పెరిగిందా?
మరి విఘ్నేష్ పశ్చాతాపడుతున్న విషయాన్ని ధనుష్ తెలుసుకొని క్షమాభిక్ష పెడతారేమో చూడాలి.
ధనుష్ లేకపోతే తాను లేనని, తన ఎదుగుదలకు ధనుషే కారణమని విఘ్నేష్ కృతజ్ఞతలు తెలుపుకున్నారు. అంతేకాకుండా, కోల్పోయిన స్నేహాన్ని తిరిగి పొందేందుకు తన ప్రయత్నాలు కొనసాగుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.


