
📌 Key Points
- ప్రదీప్ రంగనాథన్, కృతి శెట్టి జంటగా వస్తున్న ఎల్ఐకే సినిమా ప్రమోషన్స్ లో విఘ్నేష్.
- అనిరుధ్ తన కష్టాల్లో నీడలా ఉన్నాడని విఘ్నేష్ శివన్ కామెంట్.
- ‘నానుమ్ రౌడీ దాన్’ సినిమా సమయంలో అనిరుధ్ చేసిన సహాయం గుర్తు చేసుకున్న విఘ్నేష్.
- జేబులో డబ్బులు లేని సమయంలో అనిరుధ్ ఆర్థికంగా ఆదుకున్నాడని వెల్లడి.
ప్రముఖ డైరెక్టర్ విఘ్నేష్ శివన్, అనిరుధ్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఒకానొక సమయంలో తన ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉన్నప్పుడు అనిరుధ్ తనను ఆదుకున్నాడని, అదెలాగో వివరించారు. ఆ వివరాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
విఘ్నేష్ శివన్ ఎమోషనల్ కామెంట్స్
Vignesh Shivan: ప్రముఖ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ (Vignesh Shivan) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. అద్భుతమైన దర్శకత్వ మెలుకువలతో ఊహించని పాపులారిటీ సొంతం చేసుకొని.. ఇప్పుడు తనకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్నారు. ఇకపోతే తాజాగా ఆయన యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్, కృతి శెట్టి జంటగా ఎల్ఐకే అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఏప్రిల్ 10వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న నేపథ్యంలో అటు ప్రమోషనల్ కార్యక్రమాలను జోరుగా చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా ఎన్నో విషయాలను పంచుకున్న ఈయన అందులో భాగంగానే ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా పనిచేస్తున్న అనిరుద్ గతంలో తనకు చేసిన మేలు గురించి చెప్పి ఎమోషనల్ అయ్యారు.
విఘ్నేష్ శివన్ ఈ స్థాయికి చేరుకోవడం వెనుక ఎవరున్నారు? అనే విషయాన్ని చెబుతూనే.. తన కష్టాల్లో నీడలా తోడుండి.. ఈరోజు తాను ఈ పొజిషన్లో ఉండడానికి కారణమైన మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ గురించి ఎమోషనల్ కామెంట్లు చేశారు. తన కెరియర్ కి టర్నింగ్ పాయింట్ గా నిలిచిన ‘నానుమ్ రౌడీ దాన్’ సినిమా సమయం నుంచి మాట్లాడుతూ విఘ్నేష్ ఎమోషనల్ అయ్యారు. “నేను నానుమ్ రౌడీ దాన్ సినిమా షూటింగ్ కోసం పాండిచ్చేరి వెళ్లాను.. అయితే బస్సు టికెట్ కోసం నా దగ్గర కేవలం 250 మాత్రమే ఉన్నాయి. అంతకుమించి ఒక్క రూపాయి కూడా లేదు. ఒక రకంగా చెప్పాలి అంటే అప్పట్లో నా ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. అలాంటి కష్ట సమయంలోనే అనిరుధ్ నా చెయ్యి పట్టుకుని నడిపించాడు.
అనిరుధ్ చేసిన సహాయం గురించి వెల్లడి
కేవలం ఈ చిత్రానికి సంగీతం ఇవ్వడమే కాదు.. నన్ను నమ్మి ఆ ప్రాజెక్టు పట్టాలెక్కడానికి అన్ని రకాలుగా నాకు వెన్నెముకగా నిలిచాడు. జేబులో 250 తో నేను బస్సు ఎక్కాను. అయితే నా బ్యాగ్ లో రహస్యంగా రూ.50,000 ఉంచి బస్సులో నేను ఉండగానే నాకు మెసేజ్ చేశాడు.. అప్పుడు ఆ మెసేజ్ చూసి నా కళ్ళు ఒక్కసారిగా నీటితో నిండిపోయాయి. అసలు అనిరుద్ అలాంటి వాడని అస్సలు అనుకోలేదు. ఆరోజు నా జీవితంలో అనిరుద్ లేకపోతే ఈరోజు విఘ్నేష్ ఉండేవాడు కాదు” అంటూ కన్నీటి పర్యంతమయ్యారు విఘ్నేష్ శివన్.
ఇకపోతే ఈ సినిమా పట్టాలెక్కడానికి.. అలాగే నయనతారతో పరిచయం , ప్రేమ, పెళ్లి చేసుకోవడానికి పునాది పడిన ఈ సినిమా వెనుక అనిరుద్ ప్రోత్సాహం ఎంతగానో ఉందని ఆయన గుర్తు చేసుకున్నారు. ఇక ఈ విషయం తెలిసి అభిమానులు సైతం సంతోషం వ్యక్తం చేస్తూ.. అనిరుద్ గొప్పతనం తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.. ఏది ఏమైనా కష్ట కాలాల్లో అండగా నిలిచి, స్నేహితుడిగా తనను ముందుకు నడిపించిన అనిరుద్ గొప్పతనానికి ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు. ఇకపోతే వీళ్లిద్దరూ ఇప్పుడు లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ సినిమాతో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
నయన్ తో పరిచయం వెనుక అనిరుధ్ ప్రోత్సాహం
అనిరుధ్ తన జీవితంలో ఒక వెన్నెముకలా నిలిచాడని, ఆయన చేసిన సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోలేనని విఘ్నేష్ శివన్ అన్నారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు అనిరుధ్ గొప్పతనాన్ని కొనియాడుతున్నారు.


