|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

విజయ్ దేవరకొండ సంచలనం: బుజ్జి పాపకు లంచ్ ఆఫర్! వైరల్ వీడియోతో ఒక్కసారిగా మారిపోయిన సీన్!

Published: 07-03-2026, 11:05 PM
విజయ్ దేవరకొండ సంచలనం: బుజ్జి పాపకు లంచ్ ఆఫర్! వైరల్ వీడియోతో ఒక్కసారిగా మారిపోయిన సీన్!
  • చిన్నారి అభిమాని వీడియోకి ఫిదా అయిన విజయ్ దేవరకొండ – లంచ్ కి ఆహ్వానం!
  • చిట్టి తల్లికి ఇష్టమైన చాక్లెట్స్, స్వీట్స్ తెప్పిస్తానని విజయ్ మాటిచ్చారు.
  • రష్మికతో విజయ్ పెళ్లి ఉదయపూర్ లో ఫిబ్రవరి 26న గ్రాండ్ గా జరిగింది.
  • సోషల్ మీడియాలో వైరల్ అయిన క్యూట్ చిన్నారి రిక్వెస్ట్ వీడియో – 10 మిలియన్ వ్యూస్!

టాలీవుడ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ ఓ చిన్నారి అభిమానికి ఇచ్చిన సర్ ప్రైజ్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పెళ్లికి పిలవలేదని బాధపడ్డ ఆ చిన్నారికి విజయ్ ఏం చెప్పాడో తెలుసా?

చిన్నారి క్యూట్ రిక్వెస్ట్ వీడియో వైరల్

Vijay Deverakonda: టాలీవుడ్ స్టార్ విజయ్ దేవరకొండ ఇటీవల పెళ్లిచేసుకున్న విషయం తెలిసిందే. నేషనల్ క్రష్ రష్మిక మందన్నాను ఆయన ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరి పెళ్లి ఫిబ్రవరి 26న ఉదయపూర్ లో ఘనంగా జరిగింది. అనంతరం హైదరాబాద్ లో గ్రాండ్ గా రెసెప్షన్ కూడా జరిగింది. అయితే, విజయ్ దేవరకొండ పెళ్లి సందర్బంగా ఓ చిన్నారి చేసిన క్యూట్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

లంచ్ కి పిలుస్తానన్న విజయ్ దేవరకొండ

ఆ వీడియోలో చిన్నారి మాట్లాడుతూ.. విజయ్ కి నేను కూడా ఫ్యాన్ నే కదా. నన్ను కూడా పెళ్ళికి పిలవొచ్చు కదా.. ఎందుకు పిలవలేదు. నాకు కూడా లడ్డూలు ఇవ్వొచ్చు కదా అంటూ ఎంతో క్యూట్ గా రిక్వెస్ట్ చేస్తూ వీడియో చేసింది. ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అయ్యింది. 10 మిలియన్ వ్యూస్ వచ్చాయి ఆ వీడియోకి. అలా ఆ వీడియో విజయ్ వద్దకు చేరింది.

ఫిబ్రవరి 26న రష్మికతో విజయ్ పెళ్లి

ఆ వీడియో చూసిన విజయ్(Vijay Deverakonda) వెంటనే ఆ వీడేమో కింద రిప్లై ఇచ్చాడు. చిట్టితల్లి నిన్ను ఇంటికి పిలిస్తా లంచ్ కి. నీకు నచ్చిన చాక్లెట్స్, స్వీట్స్ ఏంటో నాకు చెప్పు. ఇంట్లో చేయించుకొని మంచిగా తిందాం”అంటూ రాసుకొచ్చాడు. దాంతో, విజయ్ చేసిన ఏ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ఆ చిన్నారి విజయ్ ఇంటికి ఎప్పుడు వెళుతుంది అనేది చూడాలి.

చిన్నారి అభిమాని కోసం విజయ్ దేవరకొండ చేసిన ఈ పని అందరినీ ఆకట్టుకుంటుంది. మరి ఈ చిన్నారి విజయ్ ఇంటికి ఎప్పుడు వెళ్తుందో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.