|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

VD 14 టైటిల్ గండం తీరింది! విజయ్ దేవరకొండ సంచలన ప్రకటన!

Published: 24-01-2026, 7:35 AM
VD 14 టైటిల్ గండం తీరింది! విజయ్ దేవరకొండ సంచలన ప్రకటన!
  • విజయ్ దేవరకొండ, రాహుల్ సాంకృత్యాన్ కాంబినేషన్‌లో VD 14 చిత్రం
  • రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న టైటిల్ టీజర్ విడుదల
  • ఈ చిత్రానికి ‘రణభేరి’, ‘ది గన్’ టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి
  • మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌లో నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ నిర్మాణం

విజయ్ దేవరకొండ, రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో వస్తున్న VD 14 చిత్రం టైటిల్ టీజర్ విడుదల తేదీ ఖరారైంది. జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా టీజర్ విడుదల కానుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది.

VD 14 టైటిల్ టీజర్ విడుదల తేదీ

VD 14: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda). రౌడీ హీరోగా బిరుదు సొంతం చేసుకున్న ఈ మధ్యకాలంలో సరైన సక్సెస్ లేక చతికిలపడ్డారు అనే చెప్పాలి. అందుకే ఈసారి ఎలాగైనా సరే సక్సెస్ అందుకోవాలని.. గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు విజయ్ దేవరకొండ. అందులో భాగంగానే ఆయన నటిస్తున్న చిత్రం రౌడీ జనార్ధన్. ఇప్పటికే ఈ సినిమా నుండి ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్ని కూడా విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇక మరొకవైపు VD 14 అనే వర్కింగ్ టైటిల్ తో ఒక సినిమా ప్రారంభించారు. విజయ్ దేవరకొండ హీరోగా.. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన ఇప్పుడు టైటిల్ టీజర్ ను బ్లాక్ చేశారు మేకర్స్. ఈ మేరకు ఒక పోస్టర్ ను కూడా పంచుకున్నారు.

రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26వ తేదీన VD 14 మూవీ నుండి టైటిల్ టీజర్ ను రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఇక ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇదిలా ఉండగా ఈ సినిమాకి రణభేరి, ది గన్ అనే పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ముఖ్యంగా ఈ రెండింటిలో ఒక టైటిల్ను ఫైనల్ చేయబోతున్నట్లు సమాచారం. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో వస్తున్న ఈ చిత్రాన్ని నవీన్ ఎర్నేని , వై రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఇకపోతే 13వ శతాబ్దానికి సంబంధించిన ఒక హిస్టారికల్ యాక్షన్ డ్రామా అని తెలుస్తోంది. ముఖ్యంగా కర్నూల్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమాను తీస్తున్నారట. ఇందులో విజయ్ దేవరకొండ సరసన రష్మిక మందన్న మరోసారి జతకట్టనుంది.

విజయ్ దేవరకొండ , రష్మిక మందన్న కాంబినేషన్ లో వస్తున్న మూడవ చిత్రం కావడంతో ఈ కాంబినేషన్ హ్యాట్రిక్ అందుకుంటుందా అనే కామెంట్లు వ్యక్తం చేస్తున్నారు అభిమానులు . ఇదివరకే వీరిద్దరి కాంబినేషన్లో గీతాగోవిందం సినిమా వచ్చింది. ఇది బ్లాక్ బస్టర్ సొంతం చేసుకుంది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ తరువాత వీరిద్దరి కాంబినేషన్లో డియర్ కామ్రేడ్ సినిమా వచ్చింది. ఈ సినిమా కూడా మంచి విజయం అందుకుంది. అందుకే ఇప్పుడు మళ్లీ వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తుండడంతో ఈ సినిమా హ్యాట్రిక్ అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

సినిమా టైటిల్ విషయంలో ఊహాగానాలు

ఇదిలా ఉండగా గీతగోవిందం సమయం నుంచే వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని.. పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ వార్తలు వినిపించాయి. దీనికి తోడు గత ఏడాది రహస్యంగా నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 26వ తేదీన వివాహం చేసుకోబోతున్నట్లు వార్తలు రాగా.. దీనిపై స్పందించిన రష్మిక మందన్న నాలుగేళ్లుగా రూమర్స్ వింటున్నాను. త్వరలోనే అన్నింటికీ క్లారిటీ ఇస్తాను అని చెప్పి రూమర్స్ కి చెక్ పెట్టింది. మరి ఆ సమయం ఎప్పుడు వస్తుందో అని అభిమానులు కూడా ఎదురుచూస్తున్నారు.

మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో చిత్రం

26.1.26. Remember the date🔥 You will remember the name❤️‍🔥 #VD14 @TheDeverakonda @Rahul_Sankrityn @MythriOfficial #NiravShah #BhushanKumar #KrishanKumar @TSeries #ShivChanana @neerajkalyan_24 @vd14thefilm pic.twitter.com/07HL8UJqth

— Mythri Movie Makers (@MythriOfficial) January 24, 2026

మొత్తానికి విజయ్ దేవరకొండ VD 14 చిత్రం టైటిల్ టీజర్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జనవరి 26న విడుదల కానున్న ఈ టీజర్ సినిమాపై అంచనాలు పెంచేస్తుందని భావిస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.