
📌 Key Points
- విజయ్ దేవరకొండ, రష్మికల పెళ్లి వేడుకలు తుమ్మపేటలో గ్రాండ్ గా జరిగాయి!
- సొంత ఊరి ప్రజల కోసం భారీ విందు ఏర్పాటు చేసిన దేవరకొండ ఫ్యామిలీ!
- అచ్చంపేట డివిజన్లోని 44 ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు స్కాలర్‌షిప్స్ ప్రకటన!
- దేవరకొండ ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిరుపేద విద్యార్థులకు ఆర్థిక సహాయం!
టాలీవుడ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ తన స్వగ్రామంలో పెళ్లి వేడుకలు జరుపుకున్నారు. అంతేకాదు, తన గ్రామంలోని విద్యార్థుల కోసం ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం!
తుమ్మపేటలో విజయ్ దేవరకొండ పెళ్లి సందడి
ఇటీవలే వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన హీరో విజయ్ దేవరకొండ తన సతీమణి రశ్మిక మందన్న, కుటుంబ సభ్యులతో కలిసి సొంత ఊరు తుమ్మపేటకు వెళ్లారు. నాగర్ కర్నూలు జిల్లాలోని బల్మూరు మండలంలో ఉన్న తుమ్మన్ పేట విజయ్ సొంతూరు. పెళ్లైన తర్వాత తొలిసారి అక్కడికి కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లారు విజయ్ దేవరకొండ.
గ్రామస్తులకి ఘనంగా పెళ్లి విందు ఏర్పాటు
విజయ్ కుటుంబానికి తుమ్మన్ పేట గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. ఈ గ్రామంలో ఉన్న తమ స్వగృహంలో సత్యనారాయణ స్వామి వ్రతం జరుపుకున్నారు విజయ్. స్థానిక ప్రజలందరికీ విజయ్ కుటుంబ సభ్యులు పెళ్లి విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా
విద్యార్థులకి స్కాలర్‌షిప్స్ ప్రకటించిన విజయ్
విజయ్ దేవరకొండ మాట్లాడుతూ – సొంత గ్రామంలో పెళ్లి వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉంది. మా జంటకు ఆశీస్సులు అందించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. మన గ్రామానికి చాలా మంచి పనులు చేయాలని ఉంది. ఒక్కొక్కటిగా చేసుకుంటూ వెళ్దాం. ఇక్కడ మాకు సొంత ఇళ్లు, పొలమూ ఉన్నాయి. ఇక నుంచి తరుచుగా మన గ్రామానికి వస్తాను. అచ్చం పేట డివిజన్ లో ఉన్న 44 ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 9, 10వ తరగతి విద్యార్థులకు విజయ్ దేవరకొండ ఛారిటబుల్ ట్రస్ట్ తరుపున స్కాలర్ షిప్స్ అందిస్తాం. అన్నారు.
విజయ్ దేవరకొండ తీసుకున్న ఈ నిర్ణయం అందరిని ఆకట్టుకుంటుంది. మరిన్ని టాలీవుడ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.


