
‘కింగ్డమ్’ సినిమా ట్రైలర్ లాంచ్ తర్వాత, విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ మరియు చిత్ర యూనిట్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వారు స్వామివారి ఆశీర్వాదం తీసుకొని, సినిమా విజయవంతం కావాలని కోరుకున్నారు.
Key Points
విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
'కింగ్డమ్' సినిమా ట్రైలర్ లాంచ్ తర్వాత స్వామివారి ఆశీర్వాదం తీసుకున్నారు.
విజయ్ దేవరకొండ రాయలసీమ యాసలో ప్రసంగించి అలరించారు.
సినిమా విజయం కోసం ప్రేక్షకుల ఆశీస్సులు, వెంకటేశ్వరస్వామి అనుగ్రహం కోరారు.
‘కింగ్డమ్’ ట్రైలర్ లాంచ్
విజయ్ దేవరకొండ నటించిన ‘కింగ్డమ్’ సినిమా భారీ అంచనాలతో జూలై 31న విడుదల కానుంది . ఈ క్రమంలో శనివారం తిరుపతిలో ట్రైలర్ ఈవెంట్ ను నిర్వహించారు . ఈ చిత్రంలో సత్యదేవ్, భాగ్యశ్రీ బోర్సే ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని నాగవంశీ నిర్మించారు . అయితే , సినిమా విడుదల సందర్భంగా చిత్ర యూనిట్ అందరూ తిరుమల శ్రీవారి ఆశీస్సులు తీసుకున్నారు .
ట్రైలర్ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ రాయలసీమ యాసలో ప్రసంగించడం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. చాలాకాలంగా ఆయన భారీ విజయం కోసం ఎదురుచూస్తున్నాడు . కింగ్డమ్ విజయం తన కెరీర్ కు ఎంత ముఖ్యమో చెబుతూ తన మనసులో మాట ఇలా చెప్పాడు . ‘ మన తిరుపతి ఏడుకొండల వెంకన్న స్వామి నా పక్కనుండి నడిపిస్తే.. చాలా పెద్దోడిని అయిపోతాను. ఎప్పటిలాగే ఈ సినిమా కోసం కూడా ప్రాణం పెట్టి పనిచేశాను . ఈసారి నా సినిమాని చూసుకోవడానికి చాలా మంది ఉన్నారు . కానీ , వెంకన్నస్వామి దయ, ప్రేక్షకుల ఆశీసులు. ఈ రెండూ నాతో ఉంటే ఎవ్వరూ మనల్ని ఆపేదేలే ‘ అంటూ ఆయన అన్నారు . సినిమా వేడుక అయిన తర్వాత తిరుమల శ్రీవారిని దర్శించుకుని ఆయన ఆశీసులు తీసుకున్నాడు . దీంతో విజయ్ , భాగ్యశ్రీ , నాగవంశీ కలిసి ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది .
తిరుమల శ్రీవారి దర్శనం
విజయ్ దేవరకొండ ప్రసంగం
చిత్ర యూనిట్ తిరుమల శ్రీవారి ఆశీస్సులతో ‘కింగ్డమ్’ సినిమా భారీ విజయం సాధిస్తుందని ఆశిద్దాం. విజయ్ దేవరకొండ తన నమ్మకం, ప్రేక్షకుల ప్రేమను వ్యక్తపరిచాడు.


