|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

గేమింగ్ యాప్ ను మాత్రమే ప్రమోట్ చేశా.. బెట్టింగ్ ప్లాట్ ఫామ్ కాదు: ఈడీ విచారణ తర్వాత విజయ్ దేవరకొండ

Published: 06-08-2025, 8:16 PM
గేమింగ్ యాప్ ను మాత్రమే ప్రమోట్ చేశా.. బెట్టింగ్ ప్లాట్ ఫామ్ కాదు: ఈడీ విచారణ తర్వాత విజయ్ దేవరకొండ

బెట్టింగ్ యాప్ ప్రమోషన్ ఆరోపణలపై విజయ్ దేవరకొండ ఈడీ విచారణకు హాజరయ్యారు. అతను కేవలం గేమింగ్ యాప్ ప్రమోషన్ చేశానని, బెట్టింగ్ యాప్స్ తో తనకు సంబంధం లేదని స్పష్టం చేశారు.

Key Points

1

విజయ్ దేవరకొండ ఈడీ విచారణకు హాజరయ్యారు.

2

గేమింగ్ యాప్ ప్రమోషన్ మాత్రమే చేశానని విజయ్ వివరణ.

4

అవసరమైన ఆర్థిక పత్రాలను ఈడీకి సమర్పించారు.

ఈడీ విచారణలో విజయ్ దేవరకొండ

బెట్టింగ్ యాప్ ల ప్రమోషన్, మనీ లాండరీంగ్ కేసు దర్యాప్తులో భాగంగా నటుడు విజయ్ దేవరకొండ బుధవారం (ఆగస్టు 6) హైదరాబాద్లోని బషీర్బాగ్ ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎదుట హాజరయ్యారు. ఆన్ లైన్ బెట్టింగ్ తో లింకులు ఉన్నాయనే ఆరోపణలతో అతనికి ఈడీ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. విచారణ తర్వాత విజయ్ మీడియాతో మాట్లాడుతూ.. తాను కేవలం గేమింగ్ యాప్ ను మాత్రమే ప్రమోట్ చేశానని, అది బెట్టింగ్ ప్లాట్ ఫామ్ కాదని పేర్కొన్నాడు.

‘‘బెట్టింగ్ యాప్ కేసులో నా పేరు రావడంతో నాకు సమన్లు జారీ చేశారు. భారత్ లో బెట్టింగ్ యాప్స్ , గేమింగ్ యాప్స్ అనే రెండు కేటగిరీలు ఉనన్నాయి. నేను ఏ23 అనే గేమింగ్ యాప్ ను ప్రమోట్ చేశానని స్పష్టంగా చెప్పా. బెట్టింగ్ యాప్ లకు, గేమింగ్ యాప్ లకు ఎలాంటి సంబంధం లేదు. గేమింగ్ యాప్స్ చాలా రాష్ట్రాల్లో చట్టబద్ధం. అవి రిజిస్టర్ అయ్యాయని, జీఎస్టీ, పన్నులు, అవసరమైన అనుమతులు ఉన్నాయని తెలిపారు. తన బ్యాంకు లావాదేవీ రికార్డులు, యాప్ వెనుక ఉన్న కంపెనీతో కుదుర్చుకున్న ఒప్పందం కాపీతో సహా అవసరమైన అన్ని ఆర్థిక పత్రాలను ఈడీకి సమర్పించానని, తాను ప్రమోట్ చేసిన ఏ23 యాప్ తెలంగాణలో కూడా అందుబాటులో లేదు’’ అని విజయ్ దేవరకొండ తెలిపాడు.

గేమింగ్ యాప్ ప్రమోషన్ వివరణ

బెట్టింగ్ యాప్స్ కారణంగా అమాయక యువత ప్రాణాలు కోల్పోతుండటం కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో ఈ బెట్టింగ్ యాప్ లు ప్రమోట్ చేస్తున్న సెలబ్రిటీలపై పోలీసులు, ఈడీ ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి , మంచు లక్ష్మి, ప్రకాష్ రాజ్ లకు అక్రమ బెట్టింగ్ కార్యకలాపాలపై విస్తృత దర్యాప్తునకు సంబంధించి సమన్లు జారీ అయ్యాయి. జూలై 30న హైదరాబాద్ లోని ఈడీ ముందు హాజరైన ప్రకాశ్ రాజ్ 2016లో తాను గేమింగ్ యాప్ ను ప్రమోట్ చేశానని, అయితే ఆ తర్వాత వ్యక్తిగత నైతిక విలువలను చూపుతూ ఒప్పందాన్ని రద్దు చేసుకున్నానని, ఎలాంటి చెల్లింపులకు నిరాకరించానని వివరణ ఇచ్చారు.

బెట్టింగ్ యాప్స్ తో సంబంధం లేదు

విజయ్ దేవరకొండ ఇటీవల కింగ్డమ్ మూవీతో థియేటర్లలో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు వచ్చారు. జూలై 31న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాలో ఓ మిషన్ కోసం శ్రీలంక వెళ్లే స్పై గా విజయ్ నటించారు. తన అన్నను వెతికే క్రమంలో అతనికి ఎదురైన సంఘటనలతో మూవీని రూపొందించారు. దీనికి మిక్స్ డ్ టాక్ వచ్చింది. ఇందులో విజయ్ సరసన భాగ్యశ్రీ బోర్సే నటించింది.

ఈడీ విచారణ తర్వాత విజయ్ దేవరకొండ తన నిరపరాధిత్వాన్ని స్పష్టం చేశారు. గేమింగ్ యాప్ ప్రమోషన్ మాత్రమే చేశానని, బెట్టింగ్ యాప్స్ తో సంబంధం లేదని తెలిపారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.