
విజయ్ దేవరకొండ, సత్యదేవ్ నటించిన ‘కింగ్‌డమ్’ చిత్రం జూలై 31న విడుదల కానుంది. తాజాగా విడుదలైన ట్రైలర్ అంచనాలను మరింత పెంచింది. సలార్ సినిమాకు పోలికలున్న ఈ చిత్రం అన్నదమ్ముల మధ్య గ్యాంగ్‌స్టర్ యాక్షన్ థ్రిల్లర్.
Key Points
విజయ్ దేవరకొండ, సత్యదేవ్ కాంబినేషన్లో యాక్షన్ ఎంటర్టైనర్
అన్నదమ్ముల మధ్య గ్యాంగ్‌స్టర్ థ్రిల్లర్
సలార్ సినిమాకు పోలికలున్న కథానారణ్యం
జూలై 31న థియేటర్లలో విడుదల
కింగ్‌డమ్ ట్రైలర్ విడుదల
తెలుగులో రూపొందుతోన్న భారీ చిత్రాల్లో ‘కింగ్‌డమ్’ ఒకటి. రౌడీ హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తున్న కింగ్‌డమ్ మూవీలో మరో హీరో సత్యదేవ్ ప్రధాన పాత్ర పోషఇంచాడు. అలాగే, ఈ సినిమాలో గ్లామర్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా చేసింది.
మళ్లీ రావా, జెర్సీ వంటి చిత్రాలను తెరకెక్కంచిన డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి కింగ్‌డమ్ సినిమాకు దర్శకత్వం వహించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ , సాయి సౌజన్య ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.
జూలై 31న కింగ్‌డమ్ మూవీ థియేటర్లలో విడుదలకానుంది. ఈ నేపథ్యంలో కింగ్‌డమ్ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా శనివారం (జూలై 26) రాత్రి 11 గంటల సమయంలో కింగ్‌డమ్ ట్రలర్‌ను విడుదల చేశారు మేకర్స్.
అన్నదమ్ముల మధ్య కథ
కాస్తా ఆలస్యమైన కింగ్‌డమ్ ట్రైలర్ అదిరిపోయింది. విజయ్ దేవరకొండ, సత్యదేవ్ అన్నదమ్ముళ్లుగా యాక్షన్, ఎమోషనల్ సీన్స్ పండించారు. ఇద్దరు అన్నదమ్ముల మధ్య గ్యాంగ్‌స్టర్ ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్‌గా కింగ్‌డమ్ మూవీ ఉన్నట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది.
విజయ్ దేవరకొండ ఓ సీక్రెట్ మిషన్ కోసం వెళ్లడం, అది ఎంత ప్రమాదకరమో చెప్పడం, అక్కడ గ్యాంగ్‌స్టర్స్ అందరికి లీడర్‌గా విజయ్ దేవరకొండ అన్న సత్యదేవ్ ఉండటం వంటి అంశాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. అన్న మీద ప్రేమతో ఎంత దూరమైన వెళ్లే తమ్ముడిగా విజయ్ దేవరకొండ కనిపించాడు.
సలార్ తరహా యాక్షన్
హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే గ్లామర్‌తో తళుక్కుమంది. కొన్ని సీన్స్ సలార్ సన్నివేశాలను గుర్తు చేసేలా ఉన్నాయి. ఓ రకంగా కింగ్‌డమ్ టెంప్లేట్ సలార్ తరహాలోనే ఉంది. సలార్‌లో ఇద్దరు స్నేహితుల మధ్య కథ నడిస్తే.. ఇది అన్నదమ్ముల మధ్య సాగే సినిమాగా ఉంది.
కాగా, గత చిత్రాలతో అంతగా మెప్పించని విజయ్ దేవరకొండ ఈ కింగ్‌డమ్‌తో ఎలా ఆకట్టుకుంటాడో చూడాలి. ఇకపోతే ప్రస్తుతం సోషల్ మీడియాలో కింగ్‌డమ్ ట్రైలర్ తెగ రెస్పాన్స్ అందుకుంటోంది.
కింగ్‌డమ్ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. విజయ్ దేవరకొండ, సత్యదేవ్ నటన, యాక్షన్ సన్నివేశాలు హైలెట్. జూలై 31న విడుదలయ్యే ఈ చిత్రం భారీ విజయం సాధిస్తుందని అంచనా.


