|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

విజయ్, రష్మిక: గుళ్ళు గోపురాల్లో విరోష్ జంట.. వైరల్ ఫోటోలు! ఫాన్స్ పండగ!!

Published: 27-03-2026, 6:05 AM
విజయ్, రష్మిక: గుళ్ళు గోపురాల్లో విరోష్ జంట.. వైరల్ ఫోటోలు! ఫాన్స్ పండగ!!
  • విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల ఆధ్యాత్మిక యాత్ర వైరల్! అనంతపురంలో ప్రత్యేక పూజలు!!
  • ‘రణబాలి’ మూవీ షూటింగ్ కోసం అనంతపురంలో విరోష్.. తపోవనంలో ఘన స్వాగతం!
  • హౌసింగ్ బోర్డ్ కాలనీలోని ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన విరోష్ జంట!
  • గీత గోవిందం, డియర్ కామ్రేడ్ తర్వాత ‘రణబాలి’లో మరోసారి మెరవనున్న ఈ జంట!

టాలీవుడ్ మోస్ట్ లవ్డ్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న మరోసారి వార్తల్లో నిలిచారు. ఈ జంట అనంతపురంలో సందడి చేయడంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. వీరి గుడి సందర్శన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

అనంతపురంలో విరోష్ సందడి!

టాలీవుడ్ లో చాలామంది సెలబ్రిటీ జంటల పెళ్లిల్లు జరిగాయి కానీ.. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంట మాత్రం చాలా స్పెషల్ అనిపించుకుంటున్నారు. పార్టీలు,హడావిడి మాత్రమే కాకుండా.. గుళ్లు గోపురాలు తిరుగుతూ.. అభిమానుల మనసు గెలుచుకుంటున్నారు. పెళ్లి జరిగిన వెంటనే తిరుమల తిరుపతి శ్రీవారి దర్శనం చేసుకున్న ఈ జంట.. ఆతరువాత విజయ్ సొంత ఊరిలో సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చేసుకున్నారు. ఆతరువాత కూడా కొన్ని దేవాలయాలు సందర్శించుకున్న ఈ జంట.. తాజాగా మరో ఆలయాన్ని సందర్శించారు.

టాలీవుడ్ స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న గురువారం సాయంత్రం అనంతపురంలో సందడి చేశారు. వీరిద్దరూ కలిసి వస్తున్నారన్న సమాచారంతో అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. తపోవనం వద్ద ఈ జంటకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. అభిమానుల సందడి, హర్షధ్వానాలతో ఆ ప్రాంతం కిక్కిరిసిపోయింది. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న హౌసింగ్ బోర్డ్ కాలనీలోని ఆంజనేయస్వామి ఆలయాన్ని సందర్శించారు. వేద పండితుల ఆశీర్వచనాల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తులతో నిండిపోయింది. తమ అభిమాన తారలను దగ్గరగా చూడాలని స్థానికులు పోటీ పడటంతో ట్రాఫిక్ కంట్రోల్ చేయడం కష్టంగా మారింది. ప్రస్తుతం విజయ్, రష్మిక కలిసి ‘రణబాలి’ సినిమాలో నటిస్తున్నారు. గీత గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాల తర్వాత ఈ జంట మూడోసారి స్క్రీన్‌ను పంచుకుంటుండటం విశేషం. గతంలో వీరిద్దరి కాంబినేషన్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతో ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.

‘రణబాలి’ మూవీతో మళ్ళీ విరోష్!

‘రణబాలి’ సినిమా షూటింగ్ అనంతపురం పరిసర ప్రాంతాల్లో జరగనుండటంతో చిత్ర యూనిట్ ఇప్పటికే అక్కడకు చేరుకుంది. షూటింగ్ ప్రారంభానికి ముందు దేవాలయ దర్శనం చేయడం భాగంగా ఈ జంట ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలుస్తోంది.వెండితెరపై తమ కెమిస్ట్రీతో ప్రేక్షకులను అలరించిన ఈ క్రేజీ కాంబినేషన్ మళ్లీ ఒకే ఫ్రేమ్‌లో కనిపించనుండటంతో సినీ అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది.

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల ఈ దేవాలయ సందర్శన, ‘రణబాలి’ సినిమా అప్డేట్స్ టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారాయి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.