
📌 Key Points
- రష్మిక, విజయ్ ఫిబ్రవరి 26న పెళ్లి చేసుకోబోతున్నారని సమాచారం.
- విజయ్ దేవరకొండ తల్లి రష్మికకు కొన్ని కండిషన్లు పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి.
- కాబోయే కోడలు తన కొడుకుని ప్రేమగా చూసుకుంటే చాలని విజయ్ తల్లి పేర్కొంది.
- కుల, మతాలతో తమకు పట్టింపు లేదని విజయ్ తండ్రి గోవర్ధన్ రావు తెలిపారు.
సౌత్ ఇండియన్ స్టార్ రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ ఫిబ్రవరి 26న పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి. విజయ్ తల్లిదండ్రులు రష్మికకు కొన్ని కండిషన్లు పెట్టారని సమాచారం.
విజయ్, రష్మిక పెళ్లి వార్తల్లో నిజమెంత?
Vijay Deverakonda’s Parents: సౌత్ ఇండియన్ స్టార్, నేషనల్ రష్మిక మందన్న(Rashmika) మరొక రెండు రోజులలో పెళ్లి బంధంలోకి అడుగు పెట్టబోతున్న సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా నటుడు విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) తో ప్రేమలో ఉన్న ఈ ముద్దుగుమ్మ ఫిబ్రవరి 26వ తేదీ కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితుల సమక్షంలో పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతున్నారు. ఈ పెళ్లి వేడుకలో భాగంగా ఇప్పటికే రష్మిక విజయ్ కుటుంబ సభ్యులు ఉదయపూర్ చేరుకున్న సంగతి తెలిసిందే. ఇక సెలబ్రిటీలు కూడా ఒక్కొక్కరు ఉదయపూర్ లో ఈ గ్రాండ్ వెడ్డింగ్ కు హాజరవుతున్నారు. ఇలా విజయ్ దేవరకొండ రష్మిక పెళ్లి చేసుకోబోతున్న నేపథ్యంలో వీరిద్దరి గురించి ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న సంగతి తెలిసిందే.
విజయ రష్మిక ఆస్తుల గురించి వారి మధ్య ఏజ్ గ్యాప్ అలాగే వారి క్వాలిఫికేషన్ గురించి ఎన్నో రకాల వార్తలు బయటకు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే మరొక వార్త వైరల్ అవుతుంది. రష్మిక విజయ్ దేవరకొండ ఇంట్లోకి కోడలిగా అడుగుపెడుతున్న నేపథ్యంలో విజయ్ దేవరకొండ తల్లిదండ్రులు ఈమెకు కండిషన్లు పెట్టారని తెలుస్తోంది. మరి విజయ్ పేరెంట్స్ రష్మికకు పెట్టిన ఆ కండిషన్స్ ఏంటి ? రష్మిక ఆ కండిషన్లకు ఒప్పుకుందా.. అసలు ఆ కండిషన్స్ ఏంటీ అనే విషయానికి వస్తే..
రష్మికకు విజయ్ తల్లిదండ్రులు పెట్టిన కండిషన్లు ఏమిటి?
విజయ్ దేవరకొండ రష్మిక హీరో హీరోయిన్లుగా నటించిన గీత గోవిందం సినిమా సక్సెస్ ఈవెంట్లో విజయ్ తల్లి తనకు కాబోయే కోడలిలో ఉండాల్సిన క్వాలిటీస్ గురించి ఆమెకు పెట్టే కండిషన్ల గురించి మాట్లాడిన ఒక వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ తల్లి మాధవి మాట్లాడుతూ నా కొడుకును చాలా అమితంగా ప్రేమించే అమ్మాయి నా ఇంటి కోడలుగా రావాలి. నా కొడుకు సినిమా ఇండస్ట్రీలో ఉన్నాడు తనకు వచ్చే భార్య తన పరిస్థితిని అర్థం చేసుకొని తనని చాలా ఇష్టంగా, ప్రేమగా చూసుకునే అమ్మాయి అయితే చాలు అంటూ కండిషన్ పెట్టారు.
కుల మతాలతో పట్టింపులు లేవు..
విజయ్ పేరెంట్స్ ఆశించే కోడలి లక్షణాలు
ఇలా విజయ్ దేవరకొండ తల్లి కాబోయే కోడలుకు కండిషన్ పెట్టిన నేపథ్యంలో విజయ్ తండ్రి గోవర్ధన్ రావు కూడా తన భార్య మాటలను ఏకీభవిస్తూ విజయ్ ఎప్పుడూ కూడా తనకు నచ్చిన అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని తెలిపారు. మాకు కుల మతాల గురించి పట్టింపులు లేవని, విజయ్ మన దక్షిణాది అమ్మాయిని పెళ్లి చేసుకుంటే చాలంటూ గోవర్ధన్ రావు తెలిపారు. ఇలా 2018లో కాబోయే కోడలు గురించి వీరిద్దరూ చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో వీరి కోరికల మేరకు విజయ్ దేవరకొండను అమితంగా ప్రేమించే అమ్మాయి ఇండస్ట్రీకి చెందిన అమ్మాయి అలాగే దక్షిణాది రాష్ట్రాలకు చెందిన అమ్మాయి వారి ఇంటి కోడలుగా వెళ్లబోతోంది అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
మొత్తానికి విజయ్ దేవరకొండ, రష్మికల పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వారి కుటుంబ సభ్యులు పెట్టిన కండిషన్లు చర్చనీయాంశంగా మారాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.


