
రష్మిక మందన్న ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమా సక్సెస్ మీట్ లో విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ ఈవెంట్‌లో రష్మిక గురించి విజయ్ ఎంతో ఆత్మీయంగా మాట్లాడారు. ఆమె ప్రయాణాన్ని చూసి తాను గర్వపడుతున్నానని, రష్మిక అద్భుతమైన మహిళ అని కొనియాడారు. ఈ జంట చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
Key Points
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న 'ది గర్ల్ ఫ్రెండ్' సక్సెస్ మీట్‌లో కలిసి కనిపించారు.
రష్మిక ప్రయాణం చూసి గర్వపడుతున్నానని విజయ్ దేవరకొండ తెలిపారు.
రష్మిక మంచితనం, అంకితభావం అద్భుతమని విజయ్ కొనియాడారు.
"మేము నిన్ను ప్రొటెక్ట్ చేసుకుంటాము" అని రష్మికకు విజయ్ హామీ ఇచ్చారు.
రష్మిక ‘ది గర్ల్ ఫ్రెండ్’ సక్సెస్ మీట్‌లో విజయ్
Vijay Deverakonda : రష్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ సినిమా సక్సెస్ మీట్ నేడు జరగ్గా ఈ ఈవెంట్ కి విజయ్ దేవరకొండ గెస్ట్ గా హాజరయ్యాడు. విజయ్ – రష్మిక గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉండి ఇటీవల కొన్ని రోజుల క్రితమే నిశ్చితార్థం చేసుకున్నారు. నిశ్చితార్థం తర్వాత మొదటిసారి ఈ ఈవెంట్లో కలిసి కనిపిస్తుండటంతో ఈవెంట్ పై మంచి హైప్ నెలకొంది.
ఈ ఈవెంట్లో విజయ్ దేవరకొండ మొదట సినిమా గురించి మాట్లాడాడు. అనంతరం సినిమాలో నటించినవాళ్లు, పనిచేసిన వాళ్ళ గురించి మాట్లాడుతూ రష్మిక గురించి స్పెషల్ గా మాట్లాడాడు.
రష్మికపై విజయ్ దేవరకొండ ప్రశంసలు
విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. రష్మికని నేను గీత గోవిందం నుంచి చూస్తున్నాను. ఆమె నిజంగానే భూమాదేవీనే(ది గర్ల్ ఫ్రెండ్ సినిమాలో రష్మిక పాత్ర). ఒక అమాయకత్వం, అందరూ హ్యాపీగా ఉండాలి, తన చుట్టూ ఉన్నవాళ్ళు బాగుండాలి అని కోరుకుంటుంది. తన గురించి ఆలోచించదు. ఏం చెప్పినా చేస్తుంది. అక్కడ్నుంచి ఇవాళ ఒక వుమెన్ గా మారి ఇలాంటి స్క్రిప్ట్స్ సెలెక్ట్ చేసుకోవడం, కెరీర్ పీక్ లో ఉన్నప్పుడు ఈ సినిమా చేయడం చాలా మందికి ఇన్‌స్పిరేషన్ తను.
వైరల్ అవుతున్న విజయ్ రష్మిక కామెంట్స్
ఇది నువ్వు చెప్పాల్సిన కథ. రష్.. నీ జర్నీ చూసి నేను గర్వపడుతున్నాను. తనని కూడా చాలా మంది చాలా మాటలు అన్నారు. నన్ను ఎవరేమన్నా అంటే నేను రివర్స్ లో వేస్తా. రష్ ప్రపంచం ఎన్ని మాటలన్నా ఏదన్నా మంచితనమే చూపిస్తుంది. తను ఇక్కడ ఎక్కువ రోజులు ఉంటుంది. ఏదో ఒక రోజు ప్రపంచం నువ్వేంటో చూస్తుంది. నువ్వు ఎలా ఉంటావో అలాగే ఉండు. నువ్వు ఒక అద్భుతమైన మహిళవి. మేము నిన్ను ప్రొటెక్ట్ చేసుకుంటాము అని తెలిపాడు. దీంతో రష్మిక గురించి విజయ్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.
విజయ్ దేవరకొండ రష్మికపై చూపిన అభిమానం, మద్దతు ఈవెంట్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వారిద్దరి బంధం, ఒకరికొకరు ఇచ్చే గౌరవం అభిమానులను ఆకట్టుకున్నాయి. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.


