
📌 Key Points
- యశ్ రంగినేని విజయ్ దేవరకొండ మామయ్య, ప్రముఖ తెలుగు చిత్ర నిర్మాత.
- ‘పెళ్లి చూపులు’, ‘డియర్ కామ్రేడ్’ వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించారు.
- ‘ఛాంపియన్’ సినిమాలో వీరయ్య పాత్రతో నటుడిగా పరిచయమయ్యారు.
- పవర్ ఫుల్ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుని ప్రశంసలు అందుకున్నారు.
ప్రముఖ నిర్మాత, విజయ్ దేవరకొండ మామయ్య యశ్ రంగినేని ఇప్పుడు నటుడిగా మారారు. ఇటీవల విడుదలైన ‘ఛాంపియన్’ సినిమాలో వీరయ్య పాత్రలో అదరగొట్టి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆయన నటనకు ప్రేక్షకుల నుంచి విశేష ప్రశంసలు లభిస్తున్నాయి.
నిర్మాతగా యశ్ రంగినేని ప్రస్థానం
విజయ్ దేవరకొండ మామయ్య యశ్ రంగినేని నిర్మాతగా తెలుగులో మంచి సినిమాలు తీశారు. (Yash Rangineni)
Yash Rangineni : విజయ్ దేవరకొండ మామయ్య యశ్ రంగినేని నిర్మాతగా తెలుగులో మంచి సినిమాలు తీశారు. బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్ స్థాపించి విజయ్ దేవరకొండతో పెళ్లి చూపులు, డియర్ కామ్రేడ్, ఆనంద్ దేవరకొండ తో దొరసాని సినిమాలు నిర్మించారు. అంతే కాక ఏబీసీడీ, అన్నపూర్ణ ఫోటో స్టూడియో, భాగ్ సాలే.. లాంటి పలు సినిమాలను నిర్మించారు.(Yash Rangineni)
‘ఛాంపియన్’లో వీరయ్యగా యశ్ నటన
ఇన్నాళ్లు నిర్మాతగా సినిమాలు తీసిన యశ్ రంగినేని ఇప్పుడు నటుడిగా అదరగొట్టారు. ఇటీవల రోషన్ హీరోగా ప్రదీప్ అద్వైతం దర్శకత్వంలో నిజాం కాలంలో భైరాన్ పల్లిలో జరిగిన సంఘటన ఆధారంగా తెరకెక్కిన ఛాంపియన్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో యశ్ రంగినేని వీరయ్య అనే పాత్రలో నటించారు.
నటుడిగా భవిష్యత్ ప్రణాళికలు
భైరాన్ పల్లిలో పవర్ ఫుల్ ముసలి పాత్రలో యశ్ రంగినేని నటించాడు. అసలు సినిమా చూస్తే ఎవరూ గుర్తుపట్టలేనంతగా పాత్రలోకి మారిపోయి నటనతో, యాక్షన్ సీన్స్ తో మెప్పించారు. మొదటిసారి చేసినా నటుడిగా యశ్ రంగినేని మెప్పించడంతో విజయ్ అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఆయన్ని అభినందిస్తున్నారు. మరి భవిష్యత్తులో కూడా ఇలాగే నటుడిగా సినిమాలు చేస్తారా? విజయ్, ఆనంద్ సినిమాల్లో కూడా నటిస్తాడా చూడాలి.
నిర్మాతగా పలు విజయాలు సాధించిన యశ్ రంగినేని, నటుడిగా కూడా అద్భుతమైన ప్రారంభం ఇచ్చారు. భవిష్యత్తులో ఆయన మరిన్ని చిత్రాలలో నటిస్తారా, ముఖ్యంగా విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ సినిమాల్లో కనిపిస్తారా అనేది ఆసక్తిగా మారింది.


