|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

విజయ్ జీవితంలో పెను తుఫాను! విడాకుల పిటిషన్లో సంచలన ఆరోపణలు!!

Published: 27-02-2026, 9:05 PM
విజయ్ జీవితంలో పెను తుఫాను! విడాకుల పిటిషన్లో సంచలన ఆరోపణలు!!
  • విజయ్, సంగీతలది 26 ఏళ్ల వివాహ బంధం
  • విడాకుల పిటీషన్ దాఖలు చేసిన సంగీత
  • మరో హీరోయిన్తో విజయ్ సంబంధం ఉందని ఆరోపణ
  • విజయ్ కి మతిస్థిమితం సరిగా లేదని పిటిషన్లో పేర్కొనడం హాట్ టాపిక్

తమిళ స్టార్ హీరో విజయ్ దాంపత్య జీవితంలో పెను విషాదం! 26 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతూ భార్య సంగీత విడాకుల పిటిషన్ దాఖలు చేయడం సంచలనంగా మారింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

విడాకుల పిటిషన్లో సంచలన విషయాలు

Vijay: తమిళ స్టార్ హీరో, టీవీకే పార్టీ అధినేతకు విజయ్ నుంచి విడాకుల కోరుతూ ఆయన భార్య సంగీత కోర్టు కెక్కిన విషయం తెలిసిందే. దేశ వ్యాప్తంగా ఈ న్యూస్ ఇప్పుడు సంచలనంగా మారింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న విజయ్ నుంచి దాదాపు 26 ఏళ్ళ తరువాత సంగీత విడాకులు కోరడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. నిజానికి, కొద్దికాలంగా ఈ ఇద్దరు వేరుగానే ఉంటున్నారట. ఇక వీరి విడాకుల పిటీషన్ కేసు మార్చి నెలలో విచారణకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

అయితే, విజయ్(Vijay)- సంగీతల విడాకుల పిటీషన్ లో రెండు అంశాలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అదేంటంటే, విజయ్ గత కొంతకాలంగా వేరే హీరోయిన్ తో రిలేషన్ ఉంటున్నారని ఆమె ఆరోపించినట్టుగా తెలుస్తోంది. ఆమె కూడా తమిళ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ హీరోయిన్ అని తెలుస్తోంది. దీనికి సంబందించిన వార్తలు కూడా కొంతకాలంగా వైరల్ అవుతున్నాయి.

విజయ్ వ్యక్తిగత జీవితంలో కలకలం

ఇక మరో అంశం ఏంటంటే, విడాకుల పిటీషన్ లో విజయ్ కి మతి స్థిమితం సరిగా లేదని కూడా ఆమె పేర్కొంది. ఈ విషయం కూడా ఇప్పుడు సంచలనంగా మారింది. అయితే, ఈ విజయ్ ఫ్యాన్స్ సంగీతను తప్పు పడుతున్నారు. మతి స్థిమితం లేని వ్యక్తి హీరోగా ఇంతకాలం ఎలా కొనసాగుతాడు. అది కూడా స్టార్ హీరో రేంజ్ లో, అలాగే, ఒక రాజకీయ పార్టీని స్థాపించగలడా. ఇది కేవలం, ఆయన వ్యక్తిగత ఇమేజ్ ని డ్యామేజ్ చేయడానికే ఈ ఆరోపణలు ఆమె చేస్తున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం?

ఓపక్క రాజకీయాల్లో బిజీ అవుదామనుకున్న విజయ్ కి ఈ సమయంలో ఇలాంటి వివాదంలో ఇరుక్కోవడం ఒక రంకంగా పెద్ద దెబ్బె అని చెప్పాలి. ప్రతిపక్షాలు ఈ విషయాన్ని తమకు అనుకూలంగా మార్చుకునే అవకాశం తప్పకుండా ఉంటుంది. ఇక మరో రెండు నెలల్లో తమిళనాట ఎన్నికలు ఉన్న సంగతి తెలిసిందే. ఇలాంటి సమయంలో విజయ్ ఓపక్క రాజకీయాలు, మరోపక్క వ్యక్తిగత జీవితాన్ని ఎలా బాలన్స్ చేస్తాడు అనేది చూడాలి మరి.

విజయ్ వ్యక్తిగత జీవితంలో చోటుచేసుకున్న ఈ పరిణామాలు ఆయన రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతాయో వేచి చూడాలి. మరిన్ని ఆసక్తికరమైన అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.