|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

విజయ్ సంచలనం: డ్రైవర్ కొడుక్కి ఎమ్మెల్యే టికెట్! ఒక్కసారిగా షాక్ తిన్న ఫ్యాన్స్!

Published: 02-04-2026, 12:35 AM
విజయ్ సంచలనం: డ్రైవర్ కొడుక్కి ఎమ్మెల్యే టికెట్! ఒక్కసారిగా షాక్ తిన్న ఫ్యాన్స్!
  • విజయ్ అభిమానులకు పండగ: ఒకప్పటి డ్రైవర్ కొడుక్కి ఎమ్మెల్యే టికెట్!
  • శబరినాథన్ ఎంటెక్ పూర్తి చేసి ఖతార్‌లో ఉద్యోగం చేసిన వ్యక్తి
  • తండ్రి వద్దనటంతో డైరెక్టుగా విజయ్‌తో మాట్లాడి పార్టీలో చేరిక!
  • చిన్నప్పుడు విజయ్‌ ఎత్తుకున్న ఫోటోను షేర్ చేసిన శబరినాథన్ వైరల్

తమిళనాడు రాజకీయాల్లో హీరో విజయ్ సంచలనం సృష్టించారు. తన నమ్మకమైన డ్రైవర్ కొడుక్కి ఏకంగా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ నిర్ణయం వెనుక అసలు కథేంటో తెలుసుకుందాం!

డ్రైవర్ కొడుక్కి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన విజయ్

Vijay : తమిళనాడులో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. ఏప్రిల్ 23న అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న DMK పార్టీతో పాటు BJP కూటమి, హీరో విజయ్ పార్టీలు పోటాపోటీగా తలపడనున్నాయి. విజయ్ సొంతంగా అన్ని స్థానాల నుంచి అభ్యర్థులను నిలబెట్టి పోటీ చేస్తున్నాడు.

ఈ క్రమంలో విజయ్ ఓ కుర్రాడికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం చర్చగా మారింది. దీంతో అతను ఎవరు అని వెతికేస్తున్నారు. విజయ్ దగ్గర ఎంతో కాలంగా డ్రైవర్ గా పనిచేసి ఆ తర్వాత విజయ్ కి PA గా మారారు రాజేంద్రన్. ఆయన కొడుకు శబరినాథన్ కి విజయ్ అసెంబ్లీ ఎన్నికల్లో విరుగంబక్కం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు.

ఖతార్ నుండి రాజకీయాల్లోకి శబరినాథన్ ఎంట్రీ

రాజేంద్రన్ తనయుడు శబరినాథన్ ఎంటెక్ చదివి ఖతార్ లో జాబ్ చేయడానికి వెళ్ళాడు. విజయ్ పార్టీ పెట్టాడని తెలిసి ఆ పార్టీలో చేరతానని తన తండ్రికి చెప్తే ఒప్పుకోలేదు. దీంతో డైరెక్ట్ విజయ్ తో మాట్లాడటంతో విజయ్ రాజేంద్రన్ ని పిలిచి ఒప్పించాడు. 2024 నుంచి విజయ్ TVK పార్టీలో చేరి పని చేస్తున్నాడు శబరినాథన్. మొదట జిల్లా కార్యదర్శి పదవి కూడా ఇచ్చారు విజయ్. ఇప్పుడు విరుగంబక్కం నియోజకవర్గంకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు.

వైరల్ అవుతున్న విజయ్, శబరినాథన్ ఫోటోలు

ప్రస్తుతం శబరినాథన్ తన నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నాడు. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటున్నాడు. ఈ క్రమంలో చిన్నప్పుడు విజయ్ తనని ఎత్తుకున్న ఫోటోని, ఇప్పుడు విజయ్ తో కలిసి దిగిన ఓ ఫోటోని షేర్ చేసాడు. దీంతో ఈ ఫోటో వైరల్ గా మారింది. ఒకప్పుడు విజయ్ దగ్గర పనిచేసిన డ్రైవర్ కొడుక్కి, తాను ఎత్తుకున్న పిల్లాడికి ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడంతో విజయ్ ని అభినందిస్తున్నారు. మరి శబరినాథన్ ఈ ఎన్నికల్లో గెలుస్తాడా లేదా చూడాలి.

విజయ్ తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. శబరినాథన్ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో వేచి చూడాలి. మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.