
📌 Key Points
- విజయ్ నటించిన చివరి చిత్రం ‘జన నాయగన్’ విడుదలకు సిద్ధం.
- సెన్సార్ బోర్డు అభ్యంతరాలను హైకోర్టు కొట్టివేసింది.
- సినిమాకు యూ/ఏ సర్టిఫికేట్ ఇవ్వాలని హైకోర్టు ఆదేశం.
- త్వరలో విడుదల తేదీని ప్రకటించనున్న చిత్ర యూనిట్.
తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన చివరి చిత్రం ‘జన నాయగన్’ విడుదలకు మార్గం సుగమమైంది. సెన్సార్ బోర్డు అభ్యంతరాలను మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది. సినిమాకు యు/ఎ సర్టిఫికేట్ ఇవ్వాలని ఆదేశించింది.
జన నాయగన్ సినిమాకు సెన్సార్ అభ్యంతరాలు
Jana Nayagan : తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి నటిస్తున్న చివరి చిత్రం జన నాయగన్.. దర్శకుడు హెచ్ వినోత్ తెరకెక్కిస్తున్న ఈ మాస్ ఎంటర్టైనర్ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ విజయ్ ఫ్యాన్స్ కి ఎమోషనల్ గా మారింది. ఈ సినిమా తర్వాత ఆయన సినిమాలకు గుడ్ బై చెప్పేస్తున్నారు అన్న విషయం తెలిసిందే. అందుకే దీన్ని ఎప్పుడెప్పుడు థియేటర్లలో చూస్తామని అభిమానులు ఎంతగానో ఎదురు చూశారు. నిజానికి ఈ మూవీ ఇవాళ థియేటర్లలోకి రావాల్సి ఉంది. సినిమాపై సెన్సార్ అభ్యంతరాలు తెలిపింది. ఇందులోని 32 సన్నివేశాలను తొలగించాలని తెలిపింది. అందుకే విడుదలకు ఒకరోజు ముందు జన నాయగన్ మూవీ వాయిదా పడింది.. సెన్సార్ అభ్యంతరాలకు ఒప్పుకొని మూవీ టీం కోర్టుకు వెళ్లారు. తమ సినిమాకు సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వాల్సిందిగా కోరారు.. తాజాగా విచారణ జరిపిన మద్రాస్ హైకోర్టు ఈ చిత్ర యూనిట్ కి ఊరట కలిగించే న్యూస్ ని చెప్పింది. సినిమాకు సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వాలని ఆదేశాలు. సెన్సార్ బోర్డు సభ్యులకు జన నాయగన్ కి U/A సర్టిఫికేట్‌నే ఇవ్వాలని ఆదేశించింది మద్రాస్ హైకోర్టు. మొత్తానికి కోర్టు తీర్పుతో ఈ సినిమాకు లైన్ క్లియర్ అయిపోయింది.. ఇక కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు అన్నది మరి కాసేపట్లో తెలిసే అవకాశం ఉంది..
హైకోర్టు తీర్పుతో సినిమాకు ఊరట
త్వరలో విడుదల కానున్న జన నాయగన్
మొత్తానికి హైకోర్టు తీర్పుతో విజయ్ అభిమానులకు శుభవార్త అందింది. ‘జన నాయగన్’ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల తేదీ కోసం ఎదురుచూడాల్సిందే.


