|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

సినిమాలో సీఎం ఛాన్స్ వదులుకున్న విజయ్.. నిజ జీవితంలో ముఖ్యమంత్రి పీఠం!

Published: 04-05-2026, 5:45 PM
సినిమాలో సీఎం ఛాన్స్ వదులుకున్న విజయ్.. నిజ జీవితంలో ముఖ్యమంత్రి పీఠం!
  • నటుడు విజయ్ తమిళనాడు ఎన్నికలలో భారీ మెజారిటీతో విజయం సాధించారు.
  • రెండు సంవత్సరాలలోనే రాజకీయాల్లోకి వచ్చి సీఎం పీఠం దక్కించుకున్నారు.
  • 1999లో ‘ముదల్వన్’ చిత్రంలో సీఎం పాత్రను విజయ్ తిరస్కరించారు.
  • రీల్ లైఫ్ ఛాన్స్ వదులుకున్నా, రియల్ లైఫ్‌లో సీఎం కావడం విశేషం.

తమిళనాడు రాజకీయాల్లో నటుడు విజయ్ పేరు మారుమోగుతోంది. రాజకీయాల్లోకి వచ్చిన రెండేళ్లలోనే సీఎం పీఠం దక్కించుకోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. రీల్ లైఫ్‌లో సీఎం పాత్రను వదులుకున్న విజయ్, నిజ జీవితంలో ముఖ్యమంత్రి కావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

విజయ్ రాజకీయ ప్రవేశం, విజయం

Actor Vijay: ప్రస్తుతం తమిళనాడు రాష్ట్ర రాజకీయాలలోనూ, తమిళ చిత్ర పరిశ్రమలో మాత్రమే కాకుండా సౌత్ సినీ ఇండస్ట్రీలో హీరో విజయ్(Vijay) పేరు మారు మోగుతుంది. ఇండస్ట్రీలో హీరో ఒక మంచి సక్సెస్ అందుకున్న విజయ్ రాజకీయాలలోకి వచ్చిన రెండు సంవత్సరాల వ్యవధిలోనే ఎన్నికలలో పోటీ చేయడమే కాకుండా అధికారం అందుకోవటం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇలా ఇటీవల తమిళనాడు ఎన్నికల ఫలితాలు వెలబడడంతో విజయ్ టీవీకే పార్టీ (TVK Party)భారీ మెజారిటీతో విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలోనే విజయ్ కి సంబంధించిన ఎన్నో విషయాలు సోషల్ మీడియాలో వెలుగులోకి వస్తున్నాయి.

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో పనిచేసే హీరోలు ఎన్నో రకాల పాత్రలను పోషిస్తూ ఉంటారు అయితే ఓ సినిమాలో హీరో విజయ్ కు ముఖ్యమంత్రిగా నటించే అవకాశం వచ్చినప్పటికీ ఆయన ఆ పాత్రను రిజెక్ట్ చేశారని తెలుస్తోంది. మరి ఈయనకు ముఖ్యమంత్రిగా ఏ సినిమాలో నటించే అవకాశం వచ్చింది?ఎందుకు వదులుకున్నారు? అనే విషయానికి వస్తే.. 1999 వ సంవత్సరంలో శంకర్ దర్శకత్వంలో అర్జున్(Arjun) హీరోగా నటించిన చిత్రం ముదల్ వన్(Mudhalavan). ఈ సినిమా తెలుగులో ఒకే ఒక్కడు(Oke Okkadu) పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చి తెలుగు ,తమిళ భాషలలో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇలా ఈ సినిమా ముందుగా చేసే అవకాశం విజయ్ కు వచ్చిందని చెప్పాలి.

రీల్ లైఫ్ సీఎం ఛాన్స్ మిస్

ఈ సినిమాలో అర్జున్ ఒకరోజు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాని రిజెక్ట్ చేయడంతో విజయ్ ముఖ్యమంత్రిగా సినిమాలో నటించే అవకాశాన్ని కోల్పోయారు. ఇలా 1999 వ సంవత్సరంలో ఈ సినిమాలో ముఖ్యమంత్రి అవకాశాన్ని కోల్పోయిన విజయ్ 2026వ సంవత్సరంలో మాత్రం నిజజీవితంలో ముఖ్యమంత్రి పీఠం అందుకోవటం విశేషం. రీల్ లైఫ్ లో కాకుండా రియల్ లైఫ్ ముఖ్యమంత్రిగా ఈయన త్వరలో బాధ్యతలు తీసుకోబోతున్నారు. ఇక నేడు విజయ్ అద్భుతమైన విజయం అందుకోవడంతో ఈ సినిమాకి సంబంధించిన ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

ముఖ్యమంత్రిగా విజయ్ భాద్యతలు..

నిజ జీవితంలో ముఖ్యమంత్రి పీఠం

ఇలా రీల్ లైఫ్ లో ముఖ్యమంత్రిగా నటించే అవకాశాన్ని ఈయన కోల్పోయారనే విషయం తెలిసిన అభిమానులు అప్పుడు ఆ అవకాశం కోల్పోయినా, ఇప్పుడు నిజజీవితంలో ముఖ్యమంత్రి కావడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక విజయ్ ఎన్నికలలో రెండు స్థానాలలో పోటీ చేయగా రెండు స్థానాలలో అద్భుతమైన మెజారిటీతో విజయం సాధించారు. ఇక త్వరలోనే విజయ్ తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తూ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోబోతున్నారు. ఇక విజయ్ ఎన్నికలలో విజయం సాధించడంతో సోషల్ మీడియా వేదికగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీలతో పాటు రాజకీయ నాయకులు అభిమానులు కూడా ఈయనకు పెద్ద ఎత్తున అభినందనలు తెలియజేస్తున్నారు. ఇక విజయ్ మంచి మెజారిటీని అందుకున్నప్పటికీ ఇంతవరకు ఈయన మీడియా ముందుకు వచ్చి ఈ విజయం గురించి మాట్లాడలేదు. మరికొద్ది సేపట్లో ఈయన ప్రెస్ మీట్ పెట్టబోతున్నారని తెలుస్తోంది.

సినిమాలో సీఎం పాత్రను తిరస్కరించిన విజయ్, నిజ జీవితంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ అద్భుత విజయం ఆయన అభిమానులలో సంతోషాన్ని నింపింది. విజయ్ రాజకీయ ప్రస్థానం భవిష్యత్తులో ఎలా ఉంటుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.