
📌 Key Points
- విజయ్ దేవరకొండ, రష్మికల గ్రాండ్ వెడ్డింగ్ వైరల్ పిక్స్!
- థాయ్‌లాండ్‌లో బడ్డీమూన్ ట్రిప్ అదిరింది అంటున్న ఫాన్స్
- వోగ్‌తో ప్రత్యేకంగా సెలబ్రేషన్స్ షేర్ చేసిన విరోష్ జంట
- స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేస్తున్న విరోష్ లేటెస్ట్ పిక్స్
టాలీవుడ్ క్యూట్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మికల పెళ్లి తర్వాత బడ్డీమూన్‌తో మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చారు. వీరి సెలబ్రేషన్స్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ జంట గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం.
విరోష్ జంట ట్రెండింగ్ బడ్డీమూన్ పిక్స్!
Virosh Buddy Moon : టాలీవుడ్ మోస్ట్ క్యూట్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక ఇటీవలే వివాహం చేసుకున్నారు. ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ వేదికగా.. అత్యంత సన్నిహితుల నడుమ, హిందూ మరియు కొడవ సంప్రదాయంలో వీరి వివాహం జరిగింది. ఆ తర్వాత ఈ జంట విజయ్ స్వగ్రామంలో సత్యనారాయణ వ్రతం చేసుకున్నారు. హైదరాబాద్‌లో ఘనంగా రిసెప్షన్ నిర్వహించారు. మొన్నటి వరకు పెళ్లి పనులతో బిజీగా గడిపిన ఈ జంట.. ఇప్పుడు హనీమూన్‌లో చిల్ అవుతున్నారు. వీరు థాయ్‌లాండ్‌కు వెళ్లారు. హనీమూన్ ట్రిప్‌కు సంబంధించిన క్యూట్ పిక్స్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి తెగ వైరల్ అవుతున్నాయి.
ఇక తమ పెళ్లి వేడుకతో నయా ట్రెండ్ సెట్ చేసిన ‘విరోష్’ జంట.. ఇప్పుడు హనీమూన్‌లో కూడా అదే ట్రెండ్ సెట్ చేస్తున్నారు. సాధారణంగా హనీమూన్ అంటే భార్యాభర్తలు మాత్రమే వెళ్తారు, ఏకాంతంగా గడుపుతారు. కానీ విరోష్ జంట మాత్రం హనీమూన్ బదులు “బడ్డీమూన్” కి వెళ్లారట. ఈ విషయాన్ని ప్రముఖ ఫ్యాషన్ మ్యాగజైన్ ‘వోగ్’ (Vogue) వెల్లడించింది. హనీమూన్‌కు వెళ్లిన విరోష్ జంట తమతో పాటు ప్రాణ స్నేహితులను కూడా తీసుకెళ్లారట. స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను వోగ్ షేర్ చేసింది.
థాయ్‌లాండ్‌లో ఫ్రెండ్స్‌తో కలిసి సెలబ్రేషన్స్!
రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ పెళ్లి వేడుకలు అప్పుడే ముగిశాయా అంటే.. ఇంకా సెలబ్రేషన్స్ కొనసాగుతూనే ఉన్నాయి. హనీమూన్‌కు వెళ్లిన ఈ జంట.. తమ ప్రాణమిత్రులను థాయిలాండ్‌లోని ‘కో సముయ్’కు ఒక ప్రత్యేక ట్రిప్‌కు ఆహ్వానించారు. అక్కడ Airbnb (@airbnb) ద్వారా ఏర్పాటు చేసిన గెటవేలో వీరంతా ఆనందంగా గడిపారనే క్యాప్షన్‌తో వోగ్ ఈ ఫోటోలను పోస్ట్ చేసింది.
తమ అత్యంత సన్నిహితులను వెంట తీసుకుని “బడ్డీమూన్” చేసుకోవడం ఇప్పుడు జీవితంలోని ముఖ్యమైన క్షణాలను కలిసి పంచుకునే కొత్త ట్రెండ్‌గా మారుతోంది. ఈ విషయంలో విరోష్ జంట నయా ట్రెండ్ సెట్ చేశారంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.
వోగ్‌తో ప్రత్యేకంగా విరోష్ సెలబ్రేషన్స్!
బడ్డీమూన్ అనేది ఇప్పుడు నయా ట్రెండ్. సాధారణంగా పెళ్లి తర్వాత కొత్త దంపతులు ఇద్దరే కలిసి ‘హనీమూన్’కి వెళ్తుంటారు. అయితే కొత్త జంట హనీమూన్ వెళ్లేటప్పుడు వారితో పాటు తమ ఆప్తమిత్రులను కూడా వెంట తీసుకెళ్లడాన్ని ‘బడ్డీమూన్’ అంటారు. ఈ పేరు ఎలా వచ్చిందంటే.. ‘బడ్డీ’ అంటే ఫ్రెండ్, స్నేహితులతో కలిసి వెళ్తున్నారు కనుక దీనిని బడ్డీమూన్ అని పిలుస్తున్నారు. పెళ్లి హడావుడిలో స్నేహితులతో సరిగ్గా గడపలేకపోయామని భావించేవారు, లేదా ఒంటరిగా కంటే గ్రూపుగా ఎంజాయ్ చేయాలనుకునే వారు ఈ పద్ధతిని ఎంచుకుంటున్నారు. తాజాగా విరోష్ జంట కూడా బడ్డీమూన్ ఎంజాయ్ చేస్తున్నారు.
విరోష్ జంట బడ్డీమూన్ ట్రెండింగ్‌లో ఉంది. అభిమానులు ఈ జంటను ఆశీర్వదిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


