
📌 Key Points
- విజయ్, రష్మికల పెళ్లి తర్వాత గ్రాండ్ విందులో నాన్ వెజ్ వడ్డన
- సత్యనారాయణ వ్రతం తర్వాత నాన్ వెజ్ వడ్డించడంతో నెటిజన్ల మధ్య తీవ్ర చర్చ
- విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ హేటర్స్: కామెంట్ల యుద్ధం నడుస్తోంది
- ఫేక్ వీడియో అంటూ కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు
విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన్నల పెళ్లి తర్వాత జరిగిన విందులో నాన్ వెజ్ వడ్డించడంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో ప్రకంపనలు మొదలయ్యాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
విజయ్, రష్మికల పెళ్లి విందులో నాన్ వెజ్!
గత నెల 26న ఉదయ్ పూర్ ప్యాలెస్ లో అతికొద్దిమంది అతిథుల సమక్షంలో వైభవంగా పెళ్లి చేసుకున్న విజయ్ – రష్మిక దంపతులు సోమవారం సొంతూరికి విచ్చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా బల్మూరు మండలం తుమ్మన్ పేటలో కొత్తగా కట్టుకున్న ఫామ్ హౌస్ లో సత్యనారాయణస్వామి వ్రతం చేసి, గృహప్రవేశం చేశారు. అనంతరం అక్కడికి వచ్చిన అతిథులు, అభిమానులు, గ్రామస్తులకు గ్రాండ్ గా దావత్ ఇచ్చారు. ఈ క్రమంలో భోజనంలో నాన్ వెజ్ వడ్డించిన వీడియోలు నెట్టింట వైరల్ అవ్వగా.. వాటిపైనే విజయ్ హేటర్స్ – ఫ్యాన్స్ మధ్య కామెంట్ల వార్ జరుగుతోంది.
సత్యనారాయణ స్వామి వ్రతం చేసి నాన్ వెజ్ పెట్టడం ఏంటంటూ.. కొందరు ఫైర్ అవుతున్నారు. పెళ్లి చేసుకుని అభిమానులకు దావత్ ఇస్తే అందులో తప్పేంటని ఫ్యాన్స్ సమర్ధిస్తున్నారు. ఆ జంట నాన్ వెజ్ తిన్నట్లు వీడియోలు, ఫొటోలేమైనా వచ్చాయా ? అక్కడికి వచ్చినవారికి విందు పెట్టారు అంతే కదా. ఇందులో తప్పేంటి అని ప్రశ్నిస్తున్నారు. ఇంకొందరు సత్యనారాయణ వ్రతం చేసుకుని ఎవరూ ఇలా నాన్ వెజ్ తెలిసి పెట్టరని, ఇదేదో ఫేక్ వీడియోల్లాగా ఉన్నాయని కామెంట్స్ చేస్తున్నారు.
సత్యనారాయణ వ్రతం.. ఆ తర్వాత నాన్ వెజ్ దావత్
నెట్టింట ఫ్యాన్స్, హేటర్స్ మధ్య కామెంట్ల యుద్ధం
విజయ్, రష్మికల ఈ వివాదం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. దీనిపై మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


