
📌 Key Points
- విజయ్, రష్మికల పెళ్లి వేడుకల్లో రొమాంటిక్ మూమెంట్స్ వైరల్!
- ఉదయ్‌పూర్‌లో అంగరంగ వైభవంగా జరిగిన ‘విరోష్’ ప్రీ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్!
- ‘గీత గోవిందం’ జంట నిజ జీవితంలో ఒక్కటవ్వడం పట్ల అభిమానుల ఆనందం!
- సెప్టెంబర్ 11న ‘రణబాలి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్న విరోష్!
టాలీవుడ్ మోస్ట్ లవ్డ్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల పెళ్లి వేడుకలకు సంబంధించిన పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. వీరిద్దరూ త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నారని సమాచారం.
విజయ్, రష్మికల రొమాంటిక్ వెడ్డింగ్ అప్డేట్స్!
Vijay Rashmika: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న తమ పెళ్లికి ముందు జరిగిన ప్రధానం, మెహెందీ వేడుకల ఫొటోలను అభిమానులతో షేర్ చేసుకున్నారు. ఈ ఫొటోల్లో ఈ కపుల్ మాంచి రొమాంటిక్ మూడ్ లో కనిపించారు. ఒకదాంట్లో రష్మికకు విజయ్ ముద్దు ఇవ్వడం చూడొచ్చు.
ఏడేళ్ల ప్రేమ ప్రయాణాన్ని పెళ్లి పీటల వరకు తీసుకెళ్లిన టాలీవుడ్ స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న తమ పెళ్లి సెలబ్రేషన్స్ కు సంబంధించిన అద్భుతమైన ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. ఉదయ్‌పూర్‌లో అత్యంత వైభవంగా జరిగిన వీరి వివాహానికి ముందు నిర్వహించిన ‘ప్రధానం’, ‘మెహందీ’ వేడుకల ఫోటోలను ఈ జంట సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య జరిగిన ఈ వేడుకల్లో ‘విరోష్’ (Virosh) జోడీ సందడి చూసి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
అంగరంగ వైభవంగా ప్రీ-వెడ్డింగ్ వేడుకలు
ఉదయ్‌పూర్‌లో గ్రాండ్ గా ప్రీ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్!
తమ సంతోషాన్ని పంచుకుంటూ రష్మిక ఇన్‌స్టాగ్రామ్‌లో భావోద్వేగపూరితమైన పోస్ట్ పెట్టింది. “25.02.26.. అది ఒక అద్భుతమైన మెహందీ, ప్రధానం ఈవెనింగ్. అంతా పర్ఫెక్ట్‌గా జరిగింది, కానీ సమయం మాత్రం చాలా వేగంగా గడిచిపోయింది. మా కోసం ఇంతటి ప్రత్యేకమైన దుస్తులను రూపొందించినందుకు తోరాని (Torani) టీమ్‌కు ధన్యవాదాలు” అని పేర్కొంది.
విజయ్ దేవరకొండ కూడా అదే రోజును గుర్తు చేసుకుంటూ.. “ఆ సాయంత్రం ఎంతో సరదాగా గడిచింది. వంద గంటలైనా ఆ సమయం అలాగే ఉంటే బాగుండు అనిపించింది” అని తన మనసులోని మాటను రాసుకొచ్చాడు.
‘రణబాలి’గా కలిసి రానున్న విరోష్!
‘విరోష్’ వివాహం.. తరలివచ్చిన సినీ తారాలోకం
‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ సినిమాలతో వెండితెరపై మ్యాజిక్ చేసిన ఈ జంట, నిజ జీవితంలోనూ ఏడడుగులు వేయడం పట్ల అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఇద్దరూ రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో ‘రణబాలి’ అనే పీరియడ్ డ్రామాలో కలిసి నటిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
విజయ్, రష్మికల పెళ్లి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. వారి ఫొటోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్నాయి. మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.


