
📌 Key Points
- విజయ్, రష్మిక ఫిబ్రవరి 26న పెళ్లి చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు.
- కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో వివాహం జరగనుందని సమాచారం.
- మార్చి 4న హైదరాబాద్‌లో సినీ, రాజకీయ ప్రముఖుల కోసం రిసెప్షన్ ఏర్పాటు.
- విజయ్, రష్మికల రిసెప్షన్ ఆహ్వాన పత్రిక సోషల్ మీడియాలో వైరల్.
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఫిబ్రవరి 26న వీరి వివాహం జరగనుందని, మార్చి 4న హైదరాబాద్‌లో రిసెప్షన్ ఏర్పాటు చేసినట్లు సమాచారం. దీనికి సంబంధించిన వెడ్డింగ్ ఇన్విటేషన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఫిబ్రవరి 26న విజయ్, రష్మిక వివాహం?
Vijay Rashmika Wedding : టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లుగా కొనసాగుతున్న వారిలో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) రష్మిక మందన్న(Rashmika Mandanna) జంట ఒకటి .ఈ జంటకు సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. వీరిద్దరూ గీతగోవిందం సినిమా ద్వారా జంటగా పెళ్లి తెరపై సందడి చేశారు. అలాగే డియర్ కామ్రేడ్ సినిమాల్లో కూడా నటించారు. ఈ సినిమాల సమయంలోనే ప్రేమలో పడిన ఈ జంట ఎట్టకేలకు పెళ్లి బంధంతో ఒకటి కాబోతున్నారు. విజయ రష్మిక ఫిబ్రవరి 26వ తేదీ పెళ్లి చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి.
ఈ వార్తలకు అనుగుణంగానే వీరిద్దరూ కూడా తమ పెళ్లి ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు. ఇప్పటికే పెళ్లి రిసెప్షన్ కి సంబంధించి ఇన్విటేషన్ కూడా అందరికీ అందాయని సమాచారం. ఇక తాజాగా వీరిద్దరూ హైదరాబాద్ ఎయిర్ పోర్టులో కనిపించిన సంగతి తెలిసిందే .పెళ్లి పనులలో భాగంగా వీరిద్దరూ బిజీ అయ్యారని తెలుస్తోంది. ఫిబ్రవరి 26 తేదీ రష్మిక విజయ్ దేవరకొండ పెళ్లి అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి ఇప్పటివరకు ఈ జంట మాత్రం అధికారికంగా ఎక్కడ వెల్లడించలేదు.
హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్ ప్లాన్
ఇకపోతే తాజాగా విజయ్ దేవరకొండ రష్మిక పెళ్లికి సంబంధించిన ఒక ఇన్విటేషన్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈ జంట తమ పెళ్ళికి కాకుండా రిసెప్షన్ కు అందరిని ఆహ్వానించినట్టు తెలుస్తోంది. ఈ ఇన్విటేషన్ ప్రకారం విజయ్ దేవరకొండ రష్మికతో ఫిబ్రవరి 26వ తేదీ పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలియజేశారు. అయితే ఈ పెళ్లి వేడుక కేవలం కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితుల సమక్షంలో మాత్రమే జరగబోతుందని స్పష్టమవుతుంది.
మార్చి 4న హైదరాబాద్ లో రిసెప్షన్
వైరల్ అవుతున్న వెడ్డింగ్ ఇన్విటేషన్
ఉదయపూర్ ప్యాలెస్ లో వీరి వివాహం జరిగినప్పటికీ వీరిద్దరూ హైదరాబాదులో ఎంతో ఘనంగా రిసెప్షన్ చేసుకోబోతున్నారు. ఈ రిసెప్షన్ వేడుకకు టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన సినీ సెలబ్రిటీలతో పాటు పలువురు రాజకీయ నాయకులు కూడా హాజరు కాబోతున్నట్టు తెలుస్తోంది. ఫిబ్రవరి 26వ తేదీ పెళ్లి బంధంతో ఒకటి కాబోతున్న ఈ జంట మార్చి 4 వ తేదీ సాయంత్రం 7:00 గంటలకు హైదరాబాద్ లోని తాజ్ కృష్ణ, బంజారాహిల్స్, హైదరాబాద్ వీరి రిసెప్షన్ ఎంతో ఘనంగా జరగబోతున్నారని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ ఇన్విటేషన్ కి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే పెళ్లి విషయాన్ని విజయ్ దేవరకొండ రష్మిక వెల్లడించక పోయిన ఇన్విటేషన్ అందుకున్నవారు ఈ ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారని తెలుస్తోంది. ఈ ఇన్విటేషన్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు కూడా ఈ జంటకు ముందుగానే అభినందనలు తెలుపుతున్నారు.
మొత్తానికి విజయ్, రష్మికల పెళ్లి గురించి వస్తున్న వార్తలు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన వెలువడే వరకు వేచి చూడాల్సిందే. వారి రిసెప్షన్ గ్రాండ్ గా జరగబోతున్నట్లు తెలుస్తోంది.


