
📌 Key Points
- విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లికి ఉదయ్‌పూర్ వేదిక, ఫిబ్రవరి 26న వివాహం!
- హైదరాబాద్‌లో మార్చి 4న గ్రాండ్‌గా రిసెప్షన్ ఏర్పాటు చేస్తున్నారని సమాచారం.
- పెళ్లి ఫోటోలు బయటకు రాకుండా ‘నో ఫోన్’ పాలసీ అమలు చేయనున్నారని టాక్!
- విజయ్, రష్మికల పెళ్లి వార్త సోషల్ మీడియాలో వైరల్!
టాలీవుడ్ మోస్ట్ లవ్డ్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందాన త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌లో పెళ్లి!
టాలీవుడ్ ఇండస్ట్రీలో బ్యూటిఫుల్ హీరోయిన్ రష్మిక మందాన, యంగ్ హీరో విజయ్ దేవరకొండ పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. చాలా రోజులుగా సీక్రెట్ గా రిలేషన్ లో ఉన్న ఈ జంట.. ఈ నెల చివరలో పెళ్లి పీటలు ఎక్కబోతోంది. ఫిబ్రవరి 26వ తేదీన విజయ్ దేవరకొండ, రష్మిక వివాహం జరగబోతున్నట్లు తెలుస్తోంది. ఉదయ్‌పూర్ ( Udaipur) వేదికగా వీళ్ల జంట పెళ్లి చేసుకోబోతుందట. ఈ మేరకు పెళ్లి కార్డు కూడా వైరల్ గా మారింది. చాలా గోప్యంగా ఈ వివాహం జరుగుతోంది. కానీ రిసెప్షన్ మాత్రం హైదరాబాద్ లో గ్రాండ్ గా చేయబోతున్నారట.
మార్చి 4వ తేదీన హైదరాబాద్ వేదికగా విజయ్ దేవరకొండ, రష్మికల రిసెప్షన్ నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ పెళ్లి నేపథ్యంలో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే, ఈ నెల చివరలో పెళ్లి చేసుకోబోతున్న విజయ్ దేవరకొండ, రష్మిక జంట గురించి ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నో ఫోన్ పాలసీని తెరపైకి తీసుకువచ్చేందుకు ఈ జంట నిర్ణయం తీసుకుందట. పెళ్లికి సంబంధించిన ఫోటోలు బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోనున్నారట.
హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్
పెళ్లికి వచ్చిన అతిథులు ఫోటోలు తీయకుండా కండిషన్లు పెట్టబోతున్నట్లు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే పెళ్లి పూర్తయిన తర్వాత తమ సోషల్ మీడియా వేదికగా ఫోటోలను పంచుకునేందుకు నిర్ణయం తీసుకుందట విజయ్, రష్మిక జంట. కానీ గెస్టులు మాత్రం ఫోటోలు తీయకుండా నో ఫోన్ పాలసీ తెరపైకి తీసుకు వచ్చినట్లు పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఇందులో ఎంత మేరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది.
నో ఫోన్ పాలసీతో సీక్రెట్ వెడ్డింగ్!
A post shared by Bollywood Machine (@bollywoodmachinebm)
విజయ్, రష్మికల పెళ్లి వార్త టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. దీనికి సంబంధించిన మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


