
📌 Key Points
- విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ నుండి రియల్ లైఫ్ లవ్ స్టోరీ వరకు.
- ఇటీవల నిశ్చితార్థం, ఫిబ్రవరి 26న ఉదయ్ పూర్‌లో పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు వైరల్.
- పెళ్లి రూమర్స్ మధ్య విజయ్ పంచెకట్టులో, రష్మిక పట్టుశారీలో ఉన్న క్రేజీ ఫొటో నెట్టింట వైరల్.
- కొత్త పెళ్లికూతురి గెటప్‌లో రష్మిక, ఆమెకు ఉంగరం తొడుగుతున్న విజయ్ ఫొటోపై ఫ్యాన్స్ ఫిదా.
టాలీవుడ్ స్టార్ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల పెళ్లి వార్తలు ప్రస్తుతం హాట్ టాపిక్. వారి ప్రేమాయణం, నిశ్చితార్థం పుకార్ల మధ్య తాజాగా ఓ అద్భుతమైన ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ ఫొటోలో కొత్త పెళ్లి జంటగా కనిపించి ఫ్యాన్స్‌ను ఆశ్చర్యపరిచారు. ఈ వార్తలపై మరింత సమాచారం ఇక్కడ ఉంది.
విజయ్-రష్మిక ప్రేమాయణం: ఆరంభం నుంచి పుకార్ల దాకా
టాలీవుడ్ స్టార్ సెలబిట్రీలు విజయ్ దేవర కొండ(Vijay Devarakonda), రష్మిక మందన్న(Rashmika Mandanna) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరు ‘గీత గోవిందం’(Geetha Govindam), ‘డియర్ కామ్రెడ్’(Dear Comrade) వంటి సినిమాల్లో జంటగా నటించి మెప్పించారు. ఆన్ స్క్రీన్ వీరిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీకి ఆడియన్స్ కనెక్ట్ అయిపోయారు. అయితే వీరు రియల్ లైఫ్‌లో కూడా ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. కానీ ఈ విషయంపై ఈ జంట అఫీషియల్‌గా ప్రకటించనప్పటికీ పలు మార్లు మీడియాకు చిక్కడం, వేకెషన్స్‌కు వెళ్లినప్పుడు సేమ్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఫొటోలు పెట్టడంతో ఎట్టకేలకు వీళ్లు రిలేషన్‌లో ఉన్నారని అందరూ కన్ఫర్మ చేసుకున్నారు.
మ్యారేజ్ డేట్ రూమర్స్: ఎక్కడ, ఎప్పుడు?
ఈ క్రమంలో రీసెంట్‌గా వీరిద్దరు ఎంగేజ్‌మెంట్ కూడా చేసుకున్నారు. అయితే ఓ ఈవెంట్‌లో రష్మిక చేతికి ఉంగరం ఉండటంతో ఈ పుకార్లకు ఆజ్యం పోయినట్లయింది. ఈక్రమంలో వీరిద్దరి పెళ్లి డేట్ కూడా ఫిక్స్ అయిపోయినట్లు, రాజాస్థాన్‌లోని ఉదయ్ పూర్‌లో కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత స్ననిహితుల మధ్య ఫిబ్రవరి 26న ఈ జంట మ్యారేజ్ చేసుకోబోతున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
నెట్టింట చక్కర్లు కొడుతున్న ఆ వైరల్ ఫొటో విశేషాలు
ఇలా మ్యారేజ్ డేట్ రూమర్స్ జోరందుకున్న వేళ విజయ్-రష్మికల ఓ క్రేజీ ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. ఆ పిక్‌లో విజయ్ పంచకుట్టుకొని ఉండగా రష్మిక మెరూన్ కలర్ పట్టు శారీ కట్టుకొని ఒంటినిండా నగలతో సింగారించుకుని కొత్త పెళ్ళికూతురిలా ఉంది. ఇక విజయ్ రష్మిక ఊయల మీద కూర్చుని ఉన్నారు. అంతేకాకుండా రౌడీ హీరో మన నేషనల్ క్రష్‌కు ఉంగరం తొడుగుతుండగా ఆమె సిగ్గు పడుతూ ఉంది. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ ఫొటోను చూసి వీరి ఫ్యాన్స్ చూడటానికి రెండు కళ్లు సరిపోవట్లేదంటూ కామెంట్స్ చేస్తున్నారు.
విజయ్-రష్మికల పెళ్లి వార్తలు, వైరల్ అవుతున్న ఫొటోతో వారి అభిమానుల్లో ఉత్సాహం మరింత పెరిగింది. ఈ జంట తమ రిలేషన్‌షిప్‌పై త్వరలో అధికారిక ప్రకటన చేస్తారని అందరూ ఆశిస్తున్నారు. వారి ప్రేమ ప్రయాణం ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.


