
📌 Key Points
- విజయ్ దేవరకొండ, రష్మికల పెళ్లి వీడియో స్ట్రీమింగ్‌కు నెట్‌ఫ్లిక్స్ నుండి షాకింగ్ ఆఫర్: రూ. 60 కోట్లు!
- గీత గోవిందం సినిమాతో మొదలైన ప్రేమ.. పెళ్లి వరకు వచ్చిందంటూ టాలీవుడ్‌లో హాట్ టాక్!
- నయనతార, విఘ్నేష్ పెళ్లి డాక్యుమెంటరీ వివాదం తర్వాత కూడా నెట్‌ఫ్లిక్స్ భారీ ఆఫర్!
- ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్.. అత్యంత సన్నిహితులకు మాత్రమే ఆహ్వానం!
టాలీవుడ్ లవ్ బర్డ్స్ విజయ్ దేవరకొండ, రష్మిక మందానల పెళ్లి వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది. పెళ్లి వీడియో స్ట్రీమింగ్ హక్కుల కోసం నెట్‌ఫ్లిక్స్ భారీ ఆఫర్ ఇచ్చిందట! దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
విజయ్, రష్మికల పెళ్లి ఫిక్స్ అయిందా?
టాలీవుడ్ అగ్ర హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మందాన పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నా సంగతి తెలిసిందే. గత ఏడాది ఈ ఇద్దరు ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారట. ఈ నెల 26వ తేదీన విజయ్ దేవరకొండ, రష్మిక వివాహం కూడా కాబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు ప్రచారం జోరుగా సాగుతున్నాయి. ఉదయ్ పూర్ పెళ్లి జరుగనుందట. ఇంత జరుగుతున్నా ఇప్పటి వరకు విజయ్ దేవరకొండ కానీ, లేదా హీరోయిన్ రష్మిక గానీ పెళ్లిపై ఎవరు స్పందించడం లేదు. కానీ పెళ్లయితే జరుగుతుందని వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తలను ఈ ఇద్దరు స్టార్లు కొట్టి పారేయడం లేదు. దీంతో ఫిబ్రవరి 26వ తేదీన పెళ్లి కచ్చితంగా జరుగుతుందని అందరూ అంటున్నారు.
నెట్‌ఫ్లిక్స్ ఆఫర్ వెనుక అసలు కథ ఏంటి?
ఫిబ్రవరి 26వ తేదీన విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లి జరగబోతుందన్న వార్తలు వైరల్ అయిన నేపథ్యంలో.. మరో న్యూస్ బయటకు వచ్చింది. ఈ జంట పెళ్లి వీడియో స్ట్రీమింగ్ రైట్స్ కోసం నెట్ ఫ్లిక్స్ బంపర్ ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. ఏకంగా 60 కోట్లు నెట్ ఫ్లిక్స్ ఆఫర్ చేసిందని నేషనల్ మీడియాలో కూడా కథనాలు వస్తున్నాయి. అయితే ఈ జంట మాత్రం దానికి నో చెప్పినట్లు టాక్ నడుస్తోంది. గతంలో కూడా నాయనతార, విగ్నేష్ పెళ్లి డాక్యుమెంటరీకి ఇదే ఓటిటి ఫ్లాట్ ఫామ్ 25 కోట్లు చెల్లించింది. ఆ తర్వాత ఈ పెళ్లి డాక్యుమెంటరీ పై వివాదం రాజుకుంది. ఇలాంటి నేపథ్యంలోనే రష్మిక-విజయ్ దేవరకొండ నెట్ ఫిక్స్ ఆఫర్ రిజెక్ట్ చేసినట్లు చెబుతున్నారు.
గీత గోవిందం జోడీ పెళ్లి వార్తల్లో నిజమెంత?
కాగా టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక కాంబినేషన్ లో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. అయితే వీళ్ళిద్దరి కెరీర్ మార్చింది గీత గోవిందం సినిమా. ఈ సినిమా సమయంలోనే విజయ్, రష్మిక ప్రేమలో పడ్డారట. అప్పటినుంచి సీక్రెట్ గా ప్రేమించుకున్న ఈ ఇద్దరు పెళ్లికి సిద్ధమైనట్లు చెబుతున్నారు.
విజయ్, రష్మిక పెళ్లి గురించి వస్తున్న ఈ వార్తలు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. దీనిపై మరింత సమాచారం కోసం చూస్తూ ఉండండి. మరిన్ని అప్‌డేట్స్ కోసం వేచి చూడండి!


