|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఓటీటీలోకి విజయ్ సేతుపతి, నిత్యమీనన్ రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా ‘తలైవన్ తలైవి’.. భార్యాభర్తల గిల్లికజ్జాలు.. తెలుగులోనూ స్ట్రీమింగ్

Published: 21-08-2025, 9:13 PM
ఓటీటీలోకి విజయ్ సేతుపతి, నిత్యమీనన్ రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా ‘తలైవన్ తలైవి’.. భార్యాభర్తల గిల్లికజ్జాలు.. తెలుగులోనూ స్ట్రీమింగ్

విజయ్ సేతుపతి మరియు నిత్య మీనన్ ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ చిత్రం ‘తలైవన్ తలైవి’ (తెలుగులో ‘సార్ మేడమ్’) ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగులోనూ అందుబాటులో ఉంది. భార్యాభర్తల మధ్య సంబంధాలను చూపించే ఈ రొమాంటిక్ డ్రామా..

Key Points

1

విజయ్ సేతుపతి, నిత్య మీనన్ జంట నటన అద్భుతం.

2

‘తలైవన్ తలైవి’ ఓటీటీలో తెలుగులోనూ స్ట్రీమింగ్.

4

భార్యాభర్తల మధ్య గొడవలు, విడిపోవడం, కలుసుకోవడం..

‘తలైవన్ తలైవి’ ఓటీటీ ప్రయాణం

విజయ్ సేతుపతి, నిత్య మీనన్ ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా ‘తలైవన్ తలైవి’ (Thalaivan Thalaivii) ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సూపర్ హిట్ సినిమా ఇవాళ (ఆగస్టు 22) నుంచే డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగులో ఈ సినిమా ‘సార్ మేడమ్’ పేరుతో థియేటర్లలో రిలీజైన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఓటీటీలోనూ తెలుగులో స్ట్రీమింగ్ అవుతోంది.

తమిళ రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా తలైవన్ తలైవి శుక్రవారం ఓటీటీ లోకి అడుగుపెట్టింది. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో లో ఇవాళ నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లోనూ ఈ మూవీ అందుబాటులో ఉంది. విజయ్ సేతుపతి, నిత్య మీనన్ లీడ్ రోల్స్ ప్లే చేశారు.

విజయ్ సేతుపతి, నిత్య మీనన్ జంట నటన

తలైవన్ తలైవి మూవీ నెల రోజుల్లోపే ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమా జులై 25న థియేటర్లలో రిలీజైంది. చిత్రానికి మిక్స్ డ్ టాక్ వచ్చినప్పటికీ కమర్షియల్ గా హిట్ అయింది. థియేటర్లలో రిలీజైన నెల రోజుల్లోపే ఇప్పుడు ఆగస్టు 22న ఓటీటీలోకి వచ్చేసింది. విజయ్ సేతుపతి , నిత్య మీనన్ కలిసి చేసిన రెండో సినిమా తలైవన్ తలైవి. ఇది ఒక రొమాంటిక్ కుటుంబ కథా చిత్రం. ఇద్దరు వ్యక్తుల జీవితాలను, వారి దాంపత్య జీవితంలోని ఎమోషన్లను ఈ మూవీ చూపిస్తుంది.

తలైవన్ తలైవి సినిమాకు పాండిరాజ్ డైరెక్టర్. ఈ చిత్రం అగసవేరన్, అరసి మ్యారేజ్ లైఫ్ చుట్టూ తిరుగుతుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ల జీవితాలు ఎలాంటి మలుపు తిరిగాయనేది ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మ్యారేజ్ తర్వాత వారి జీవితాలు తలకిందులు అవుతాయి. ఎందుకంటే దంపతులు ఒకరితో ఒకరు గొడవ పడుతూనే ఉంటారు. ఒకానొక దశలో విడిపోవాలని అనుకుంటారు. మరి చివరకు ఏం జరిగింది? ఈ దంపతులు కలిసే ఉన్నారా? అసలు సమస్య ఏమిటీ? అన్నది సినిమాలో చూడాలి.

కథాంశం: భార్యాభర్తల మధ్య సంఘర్షణ

విజయ్ సేతుపతి, నిత్య మీనన్ జోడీ మరోసారి స్క్రీన్ పై అదరగొట్టింది. తలైవన్ తలైవి సినిమాలో కెమిస్ట్రీతో ఆడియన్స్ ను అలరించింది. లవ్, రొమాన్స్, కన్నీళ్లు.. ఇలా ప్రతి ఎమోషన్ ను పక్కగా పండించింది. కామెడీతో పాటు బరువైన భావోద్వేగాలను చూపించింది ఈ జంట. ఇందులో రొమాన్స్, కామెడీ, సెంటిమెంట్, యాక్షన్ అంశాలు ఉన్నాయి,

యోగి బాబు, చెంబన్ వినోద్, మైనా నందిని, సరవణన్, కాళి వెంకట్, దీప, రోషిణి హరిప్రియన్ తదితరులు కూడా నటించారు.

తమిళంలో సూపర్ హిట్ అయిన ‘తలైవన్ తలైవి’ తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకునే అంశాలతో నిండి ఉంది. ఓటీటీలో చూసి ఆనందించండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.