
మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కుమారుడు సూర్య సేతుపతి తొలి సినిమా ‘ఫీనిక్స్’ జూలై 4న విడుదల కానుంది. వార్ 2 ఫైట్ మాస్టర్ అనల్ అరసు దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రంపై అంచనాలు పెరిగాయి.
Key Points
విజయ్ సేతుపతి కుమారుడు సూర్య సేతుపతి 'ఫీనిక్స్' సినిమాతో హీరోగా ఎంట్రీ
జూలై 4న తెలుగు, తమిళ భాషల్లో సినిమా విడుదల
యాక్షన్, ఎమోషన్స్ కలబోతతో సినిమా ఆకట్టుకుంటుందని భావిస్తున్నారు
సూర్య సేతుపతి హీరోగా ఎంట్రీ
మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కుమారుడు సూర్య సేతుపతి హీరోగా ఎంట్రీ ఇస్తోన్నాడు. ఫీనిక్స్ పేరుతో ఓ యాక్షన్ థ్రిల్లర్ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా రిలీజ్ డేట్‌ను మేకర్స్ అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. ఫినిక్స్ మూవీ జూలై 4 తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కాబోతోంది.
ఫీనిక్స్ మూవీకి స్టంట్ మాస్టర్ అనల్ అరసు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీతోనే అనల్ అరుసు డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తోన్నాడు. జవాన్, మహేష్‌బాబు శ్రీమంతుడు, ఎన్జీఆర్ జై లవకుశ, జనతా గ్యారేజ్‌తో పాటు పలు దక్షిణాది, బాలీవుడ్ సూపర్ హిట్ మూవీస్‌కు ఫైట్ మాస్టర్‌గా అనల్ అరుసు పనిచేశాడు. ప్రస్తుతం వార్ 2 మూవీకి యాక్షన్ కొరియోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నాడు. యాక్షన్, ఎమోషన్స్ కలబోతగా ఫీనిక్స్ మూవీ ఉండబోతున్నట్లు సమాచారం. సూర్య సేతుపతికి సరైన డెబ్యూ మూవీగా ఉండబోతోంది.
‘ఫీనిక్స్’ మూవీ విడుదల తేదీ
ఈ సినిమాకి పుష్ప 2 సినిమా కు బీజీఎమ్ సమకూర్చిన సామ్ సిఎస్ సంగీతాన్ని అందిస్తుండగా, వేల్‌రాజ్ సినిమాటోగ్రఫీ, ప్రవీణ్ కేఎల్ ఎడిటింగ్ అందిస్తున్నారు.
ఫీనిక్స్ మూవీతోనే సూర్య సేతుపతి హీరో గా ఎంట్రీ ఇస్తున్నాడు. గతంలో తండ్రి విజయ్ సేతుపతి హీరోగా నటించిన నానుమ్ రౌడీ ధాన్, సింద్‌బాద్ వంటి సినిమాల్లో అతిథి పాత్రల్లో సూర్య సేతుపతి కనిపించాడు. ఫీనిక్స్ మూవీలో అభినక్షత్ర, వర్ష హీరోయిన్లుగా నటిస్తుండగా…వరలక్ష్మి శరత్‌కుమార్, సంపత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
అనల్ అరసు దర్శకత్వం
ఫీనిక్స్ మూవీ నుంచి సెకండ్ సింగిల్ “ఇంధ వంగికో” గురువారం రిలీజ్ చేశారు. సామ్ సిఎస్ కంపోజ్ చేసిన ఈ పాట మ్యూజిక్ లవర్స్‌ను ఆకట్టుకుంటోంది. బాబా భాస్కర్ కోరియోగ్రఫీ, వెల్‌రాజ్ అందించిన కలర్ ఫుల్ విజువల్స్, సూర్య సేతుపతి ఎనర్జిటిక్ డ్యాన్స్ తో పాట సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
“ఇంధ వంగికో” పాటను విజయ్ సేతుపతి స్వయంగా సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేయడం గమనార్హం.
సుర్య సేతుపతి యొక్క ‘ఫీనిక్స్’ సినిమా జూలై 4న విడుదల కానున్నట్లు ప్రకటించారు. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఆశిద్దాం.


