|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

విజయ్ దళపతి చివరి సినిమా ఓటీటీ రిలీజ్ ఎందులోనో తెలుసా? జననాయగన్ ఎంతకు అమ్ముడుపోయిందంటే?

Published: 09-11-2025, 6:10 AM
విజయ్ దళపతి చివరి సినిమా ఓటీటీ రిలీజ్ ఎందులోనో తెలుసా? జననాయగన్ ఎంతకు అమ్ముడుపోయిందంటే?

దళపతి విజయ్ నటించిన చివరి సినిమా ‘జననాయగన్’ ఓటీటీ విడుదలపై ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోకు భారీ ధరకు అమ్ముడైంది. విజయ్ రాజకీయ ప్రవేశం నేపథ్యంలో ఈ సినిమా విశేషాలు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

Key Points

1

దళపతి విజయ్ చివరి సినిమాగా 'జననాయగన్' తెరకెక్కింది, ఇది ఆయన రాజకీయ ప్రవేశానికి ముందు విడుదల కానుంది.

2

రూ. 350 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రానికి విజయ్ రూ. 275 కోట్ల భారీ రెమ్యూనరేషన్ తీసుకున్నారు.

4

సంక్రాంతికి జనవరి 9న విడుదల కానున్న ఈ సినిమా మొదటి సింగిల్ 'దళపతి కచేరి' ఇటీవలే విడుదలైంది.

విజయ్ చివరి సినిమాపై రాజకీయ ప్రభావం

దళపతి విజయ్, దర్శకుడు హెచ్. వినోద్ దర్శకత్వంలో రూపొందిన ‘జననాయగన్’ సినిమా పూర్తి చేశారు. ఇది దళపతి చివరి సినిమా అని అభిమానులు అంగీకరించలేకపోతున్నారు. తన రాజకీయ ప్రయాణానికి సినిమా అడ్డు రాకూడదనే ఆయన  ఈ నిర్ణయం తీసుకున్నారు.

విజయ్ సినిమాలు మానేయడం అనేది శాశ్వత నిర్ణయమా లేక తాత్కాలికమా అనేది వచ్చే ఏడాది జరగబోయే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నిర్ణయిస్తాయని కొందరు రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఈ సినిమా 1000 కోట్లు వసూలు చేస్తుందని అని అందరూ ఎదురుచూస్తున్నారు.

‘జననాయగన్’ బడ్జెట్, తారాగణం వివరాలు

ఈ సినిమాలో దళపతి విజయ్‌కి జోడీగా పూజా హెగ్డే నటిస్తుండగా, మమితా బైజు కీలక పాత్రలో నటించింది. 350 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రానికి విజయ్‌కి 275 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈసినిమాకు  అనిరుధ్ సంగీతం అందించారు.

సంక్రాంతికి జనవరి 9న విడుదల కానున్న ఈ సినిమా ఫస్ట్ సింగిల్ ‘దళపతి కచేరి’ నిన్న విడుదలైంది. ఇది విజయ్ కెరీర్‌లో పాడిన చివరి పాట కావచ్చు. ఈ పాట చూశాక, ఇది బాలకృష్ణ తెలుగులో నటించిన ‘భగవంత్ కేసరి’ సినిమా రీమేక్ అని అభిమానులు నిర్ధారించారు.

ఓటీటీ హక్కులు: అమెజాన్ ప్రైమ్ భారీ డీల్

జననాయగన్ సినిమా నుంచి విజయ్ పాడిన  పాట విడుదలైన నిమిషాల్లోనే లక్షలాది వ్యూస్, లైక్స్ వస్తున్నాయి. థియేటర్లలో విడుదలయ్యాక ‘జననాయగన్’ ఏ ఓటీటీలో రిలీజ్ కాబోతోందో తెలిసిపోయింది.  ఈ సినిమా డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకున్నట్టు తెలుస్తోంది. దీని కోసం అమెజాన్ 100 కోట్లకు పైగా ఖర్చు చేసినట్టు సమాచారం.

విజయ్ చివరి సినిమాగా ‘జననాయగన్’పై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా విజయం ఆయన రాజకీయ భవిష్యత్తును ప్రభావితం చేయనుంది. రికార్డు స్థాయిలో అమ్ముడైన ఓటీటీ హక్కులు సినిమా క్రేజ్‌ను తెలియజేస్తున్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.