|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

విజయ్, త్రిష: లవ్ ఎఫైర్ రూమర్స్ వైరల్! విడాకులకు సిద్ధమైన దళపతి? షాకింగ్ కామెంట్స్ చేసిన విక్రమ్ భట్!

Published: 09-03-2026, 11:35 AM
విజయ్, త్రిష: లవ్ ఎఫైర్ రూమర్స్ వైరల్! విడాకులకు సిద్ధమైన దళపతి? షాకింగ్ కామెంట్స్ చేసిన విక్రమ్ భట్!
  • విజయ్, త్రిషల బంధంపై దర్శకుడు విక్రమ్ భట్ సంచలన వ్యాఖ్యలు – వ్యక్తిగత జీవితాలపై కామెంట్స్ చేయొద్దన్న విక్రమ్.
  • 25 ఏళ్ళ వైవాహిక బంధానికి తెర? విజయ్, సంగీత విడాకుల వ్యవహారం కోలీవుడ్‌లో హాట్ టాపిక్!
  • విజయ్ కోస్టార్‌తో ఎఫైర్ పెట్టుకున్నాడని ఆరోపణలు – త్రిష పేరు తెరపైకి రావడం సంచలనంగా మారింది.
  • 30 కోట్ల చీటింగ్ కేసులో విక్రమ్ భట్ అరెస్ట్ – బెయిల్‌పై విడుదల కావడం హాట్ టాపిక్!

దళపతి విజయ్, హీరోయిన్ త్రిషల మధ్య ఏదో జరుగుతోందనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనికి తోడు విజయ్ తన భార్యకు విడాకులు ఇవ్వబోతున్నాడనే వార్త మరింత సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో విక్రమ్ భట్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారాయి.

విజయ్, త్రిషల మధ్య బంధంపై విక్రమ్ భట్ కామెంట్స్!

Vikram Bhatt Support Thalapathy Vijay Trisha: తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ తన భార్య సంగీత నుంచి ఆరోపణలు, విడాకుల ప్రక్రియ ఎదుర్కొంటున్నారు. అలాగే, హీరోయిన్ త్రిషతో విజయ్‌ బంధంపై పుకార్లు తెగ వెస్తున్నాయి. ఈ విషయాలపై బాలీవుడ్ దర్శకుడు విక్రమ్ భట్ స్పందించారు. విజయ్, త్రిషకు మద్దతునిచ్చారు.

తమిళ చిత్ర పరిశ్రమలో దళపతి విజయ్ వ్యక్తిగత జీవితం ఇప్పుడు పెను సంచలనంగా మారింది. సుమారు 25 ఏళ్ల వైవాహిక బంధం తర్వాత ఆయన భార్య సంగీత సోర్నలింగం చెన్నై కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేయడం కోలీవుడ్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది.

25 ఏళ్ల వివాహానికి బ్రేక్? కోర్టులో విడాకుల పిటిషన్!

విజయ్ తన కోస్టార్ (నటి) తో వివాహేతర సంబంధం పెట్టుకున్నారని సంగీత తన పిటిషన్‌లో ఆరోపించిన నేపథ్యంలో హీరోయిన్ త్రిష కృష్ణన్ పేరు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ సామాజిక విమర్శల మధ్య బాలీవుడ్ దర్శక దిగ్గజం విక్రమ్ భట్ ఈ జంటకు మద్దతుగా నిలిచారు.

“రెండు మనసులు కలవనప్పుడు సమాజం కోసం బలవంతంగా ఒక రిలేషన్‌లో బంధీలుగా ఉండటం నరకం కంటే దారుణం. హృదయం (మనసు) ఎప్పుడూ తనకు సంతోషాన్నిచ్చే చోటికే వెళ్తుంది” అని విక్రమ్ భట్ పేర్కొన్నారు.

30 కోట్ల చీటింగ్ కేసులో దర్శకుడు అరెస్ట్!

“విజయ్, త్రిషల విషయంలో నాకు ఒకటి నచ్చింది. వారు దేనినీ దాచడం లేదు.. పాపంలా భయపడటం లేదు. వారి సినిమాలు మనకు సొంతం కావచ్చు. కానీ, వారి వ్యక్తిగత జీవితాలు మనవి కావు” అని విక్రమ్ భట్ ఈ జంటకు సపోర్టింగ్‌గా నిలిచారు.

నాలుగు సినిమాల నిర్మాణానికి సంబంధించి ఒప్పందం కుదుర్చుకుని, తమ నుంచి తీసుకున్న రూ. 30 కోట్లను విక్రమ్ భట్ దంపతులు దారి మళ్లించారని ముర్దియా ఆరోపించారు. ఈ నేపథ్యంలో జైలుకెళ్లిన విక్రమ్ భట్ బెయిల్ మీద తిరిగి ఇంటికొచ్చారు.

విజయ్, త్రిషల వ్యవహారం కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. విక్రమ్ భట్ చేసిన వ్యాఖ్యలు మరింత సంచలనంగా మారాయి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.