
📌 Key Points
- విజయ్, సంగీత విడాకుల పిటిషన్ దాఖలు – కోలీవుడ్‌లో కలకలం!
- 1999లో వివాహం, 26 ఏళ్ల బంధానికి ముగింపు పలికిన ఈ జంట.
- విజయ్, త్రిష ఎఫైర్ రూమర్స్‌పై బీజేపీ నేత కామెంట్స్ – దుమారం!
- ఏప్రిల్ 20న కోర్టుకు హాజరుకావాలని విజయ్‌కు నోటీసులు జారీ.
దళపతి విజయ్ అభిమానులకు ఒక షాకింగ్ న్యూస్! విజయ్, సంగీత విడాకులు తీసుకోబోతున్నారా? 26 ఏళ్ల వారి వివాహ బంధానికి తెరపడనుందా? పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
26 ఏళ్ల బంధానికి సంగీత ఫుల్‌స్టాప్!
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ టీవీకే పార్టీ అధినేత దళపతి విజయ్(Thalapathy Vijay)కి బిగ్ షాక్ తగిలింది. ఆయన భార్య సంగీత సంచలన నిర్ణయం తీసుకున్నారు. భర్త విజయ్ నుంచి విడాకులు కోరుతూ చెంగల్‌పట్టు జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణకు స్వీకరించిన కోర్టు.. ఏప్రిల్ 20వ తేదీన విచారణకు హాజరు కావాలని విజయ్‌కి నోటీసులు జారీ చేసింది. గతేడాది నుంచి వీళ్లిద్దరూ విడాకులు తీసుకుంటారని రూమర్స్ వచ్చాయి. 1999లో విజయ్-సంగీత వివాహం జరిగింది. వీరికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. పెళ్లైన 26ఏళ్ల తర్వాత విడాకులు కోరడం చర్చనీయాంశమవుతోంది.
కాగా, ఇటీవల విజయ్ – నటి త్రిష మధ్య ఎఫైర్ ఉందంటూ ఇటీవల రూమర్స్ వినిపించిన విషయం తెలిసిందే. ఏకంగా తమిళనాడు బీజేపీ అధ్యక్షుడే ఈ కామెంట్స్ చేయడం దేశ వ్యాప్తంగా దుమారం రేగింది. దీనిపై త్రిష స్పందించి సీరియస్ కావడంతో ఆయన సారీ చెప్పారు. అయితే.. విజయ్ భార్య విడాకుల పిటిషన్ దాఖలు చేయడానికి.. విజయ్ వివాహేతర సంబంధమే కారణమని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
త్రిషతో ఎఫైర్ రూమర్స్‌పై బీజేపీ నేత కామెంట్స్
విడాకుల పిటిషన్‌తో కోలీవుడ్‌లో కలకలం!
సంగీత విడాకుల పిటిషన్ కోలీవుడ్‌లో సంచలనంగా మారింది. దీనిపై విజయ్ ఎలా స్పందిస్తారో చూడాలి. మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


