
📌 Key Points
- విజయ్, సంగీత విడాకుల వ్యవహారం: చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు!
- ప్రముఖ నటితో విజయ్ సంబంధం? గత రెండేళ్లుగా విడిగా ఉంటున్న దంపతులు!
- 1999లో వివాహం: విజయ్-సంగీతలకు కుమారుడు జోసన్ సంజయ్, కుమార్తె దివ్య సాషా!
- రాజకీయాల్లోకి విజయ్ ఎంట్రీ: ఎన్నికల వేళ విడాకులు షాకింగ్ పరిణామం!
తమిళ సూపర్ స్టార్ విజయ్‌కు ఊహించని షాక్ తగిలింది. ఆయన భార్య సంగీత విడాకుల కోసం కోర్టును ఆశ్రయించడంతో ఒక్కసారిగా తమిళ సినీ పరిశ్రమ ఉలిక్కిపడింది. దీనికి గల కారణాలపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
విడాకులకు కారణం అదేనా?
Breaking; తమిళ స్టార్ హీరో, తమిళగ వెట్రి కళగం అధినేత విజయ్ కి ఆయన భార్య సంగీత షాక్ ఇచ్చింది. విజయ్ నుంచి విడాకులు కోరుతూ చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసు వచ్చే నెల 20న విచారణకు వచ్చే అవకాశం ఉందని సమాచారం. ప్రముఖ నటితో విజయ్‌కు సంబంధం ఉన్న కారణంగానే సంగీత ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈనేపథ్యంలోనే గత రెండేళ్లుగా విజయ్- సంగీత విడిగా ఉంటున్నారట. ఇప్పుడు అధికారికంగా విడాకుల వరకు వెళ్లినట్లు తమిళనాట టాక్ నడుస్తోంది.
ఇక 1999లో వివాహం చేసుకున్న విజయ్- సంగీత జంటకు కుమారుడు జోసన్ సంజయ్, కుమార్తె దివ్య సాషా ఉన్నారు. దాదాపు 26 ఏళ్ల సుదీర్ఘ వైవాహిక బంధం తర్వాత విజయ్ భార్య సంగీత ఈ నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు తమిళనాట హాట్ టాపిక్ గా (Breaking)మారింది. మరోపక్క విజయ్ టీవీకే పార్టీ పెట్టి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సైతం ఆయన సిద్ధమవుతున్న అవుతున్నాడు. ఈ ఇలాంటి సమయంలో భార్య సంగీత విడాకుల కోసం కోర్టుకు వెళ్లడం అనేది ఆయన రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనేది చూడాలి మరి.
రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం?
26 ఏళ్ల బంధానికి ముగింపు?
విజయ్, సంగీత విడాకుల వార్త తమిళనాడులో హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై మరిన్ని వివరాలు త్వరలో తెలుస్తాయి. అప్‌డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


